మంత్రిమండలి

కాప్ 24, కాటోవైసి, పోలాండ్ (2-15 డిసెంబ‌ర్ 2018) విష‌యంలో భార‌త్ వైఖ‌రికి సంబంధించి పూర్వ‌పు తేదీతో అమ‌లులోకి వ‌చ్చే విధంగా కేబినెట్ ఆమోదం

Posted On: 02 JAN 2019 5:53PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్  స‌మావేశం , వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోలండ్‌లోని క‌టోవిస్‌లో డిసెంబ‌ర్ 2 నుంచి 15 వ‌ర‌కు జ‌రిగిన‌ యునైటెడ్ నేష‌న్స్ ఫ్రేమ్‌వ‌ర్క్ క‌న్వెన్ష‌న్‌కు సంబంధించి 24వ కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్‌కు సంబంధించిన సంప్ర‌దింపుల విష‌యంలో భార‌త్ వైఖ‌రికి సంబంధించి కేంద్ర కేబినెట్ పూర్వ‌పు తేదీతో అమ‌లులోకి వ‌చ్చే విధంగా త‌న ఆమోదం తెలిపింది. 2018 న‌వంబ‌ర్ 28న ఇచ్చిన అనుమ‌తికి కొన‌సాగింపుగా కేంద్ర కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది.
  ఈ స‌మావేశాల‌కు ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు, వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించి కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్ నాయ‌క‌త్వంలో  భార‌త ప్ర‌తినిధి వ‌ర్గం హాజ‌రైంది. 2020 త‌ర్వాత పారిస్ ఒప్పందాన్ని అమ‌లుకు సంబంధించిన విధి విధానాల‌ను ఖ‌రారు చేయ‌డంపై ఈ స‌మావేశం ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది.ఈ విష‌యంలో భార‌త దేశం వైఖ‌రి, యు.ఎన్‌.ఎఫ్‌.సి.సి.సి విధానాలు, సూత్రాల‌కు అనుగుణంగా , పారిస్ ఒప్పందానికి ప్ర‌త్యేకించి స‌మాన‌త్వం, ఉమ్మ‌డి అయితే విభిన్న బాధ్య‌త‌లు, సంబంధిత సామ‌ర్ధ్యాల‌కు అనుగుణంగా (సిబిపిఆర్‌- ఆర్‌.సి) ఉంది.

పారిస్ ఒప్పందానికి భార‌త దేశం తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు పున‌రుద్ఘాటించింది. కాప్ -24 సంద‌ర్భంగా త‌న నాయ‌క‌త్వాన్ని ప్ర‌స్ఫుటంగా ప్ర‌ద‌ర్శించింది. పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమ‌లు చేయాల‌ని , ఉమ్మ‌డిగా ఇందుకు బాధ్య‌త తీసుకోవాల‌న్న విష‌యంలో ఐక్య‌త తీసుకువ‌చ్చింది. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌న్న మ‌న సంప్ర‌దాయ విలువ‌ల‌కు  అనుగుణంగా  వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన ముప్పును ఎదుర్కొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. ఈ చ‌ర్య‌లు, వాతావ‌ర‌ణ మార్పుల విష‌యంలో కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించి త‌న చిత్త‌శుద్దిని ప్ర‌క‌టించుకున్న‌ట్ట‌యింది.పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌కు సంబంధించి పలు చర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింది. దీనివ‌ల్ల 74 జిడ‌బ్ల్యుల స్థాపిత పున‌రుత్పాద‌క ఇంధ‌న సామ‌ర్ధ్యాన్ని సాధించ‌డం జ‌రిగింది.ఇందులో 24 గిగా వాట్ల సౌర విద్యుత్ కూడా క‌లిసి ఉంది. ఇలా సౌర విద్యుత్ విష‌యంలో భార‌త్ ప్ర‌పంచానికి నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. అంత‌ర్జాతీయ సౌర కూట‌మి, ఇంధ‌న సామ‌ర్ధ్యానికి సంబంధించి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఇందుకు త‌గిన ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు.
అయితే, వ‌ర్థ‌మాన దేశాలు తీసుకుంటున్న చ‌ర్య‌లకు నిరంత‌రాయ మ‌ద్ద‌తు అవ‌స‌రం . అలాగే వీటిని స‌క్ర‌మంగా అమ‌లు చేసేందుకు అభివృద్ధ‌ఙ చెందిన దేశాల నుంచి త‌గిన ఆర్థిక వ‌న‌రులు , సామ‌ర్ధ్యాల నిర్మాణం, సాంకేతిక మ‌ద్ద‌తు అవ‌స‌రం.ఇప్పుడు చేప‌ట్టిన మార్గ‌ద‌ర్శ‌కాలు అభివృద్ధి చెందుతున్న దేశాల కార్య‌క్ర‌మాల అమ‌లుకు త‌గిన వెసులుబాటు క‌ల్పించ‌డంతోపాటు వాతావ‌ర‌ణ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించి అభివృద్ధి చెందిన దేశౄలు స‌వివ‌ర‌మైన స‌మాచారం విష‌యంలో స్ప‌ష్ట‌త నివ్వ‌వ‌ల‌సి ఉంటుంది. 2020 త‌ర్వాత నూత‌న స‌మ‌ష్ఠి ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న‌కు 100 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నూత‌న చొర‌వ‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని సంబంధిత పార్టీలు అంగీకారానికి వ‌చ్చాయి.
 మొత్తంమీద‌, భార‌త దేశ‌పు దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షింప‌బ‌డ్డాయి. అయితే ఇండియా, గ్లోబ‌ల్ స్టాక్ టేక్ (జిఎస్‌టి) నిర్ణ‌యానికి సంబంధించి అమెరికాకు గ‌ల అభిప్రాయాల విష‌యంలో  భార‌త్ త‌నకు కొన్ని అభిప్రాయాలున్నాయ‌ని అమెరికాకు తెలిపింది.. పారిస్ ఒప్పందం ప్ర‌కారం గ్లోబ‌ల్ స్టాక్ టేక్ ముఖ్య‌మైన‌ది. ఇది జిఎస్‌టి ప్రాసెస్‌లో ముఖ్య‌మైద‌ని . పారిస్ ఒప్పందం ప్రకారం ఇది పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్న‌ది.



(Release ID: 1558303) Visitor Counter : 240