మంత్రిమండలి
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ను పిపిపి తరహా లో ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన పథకాని కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
24 OCT 2018 1:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల లో ప్రభుత్వ, పైవేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతి లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ ల)ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల లో అవసరాన్ని మరియు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను దృష్టి లో పెట్టుకొని ఐఐఎస్ ను ప్రోత్సహించడం కోసం ఈ మార్గాన్ని ఉపయోగించుకోనున్నారు.
ప్రయోజనాలు:
ఉన్నత స్థాయి తో కూడినటువంటి నైపుణ్య శిక్షణ ను, అప్లయిడ్ రిసర్చ్ ఎడ్యుకేషన్ ను సమకూర్చడంతో పాటు పరిశ్రమ తో ప్రత్యక్ష సంబంధాన్ని, అర్థవంతమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో కీలక రంగాల్లో ప్రపంచ శ్రేణి స్పర్ధాత్మకత ను పెంపొందించేందుకు ఐఐఎస్ ల స్థాపన తోడ్పడనుంది. ఇది దేశం లో మహత్త్వాకాంక్ష కలిగిన యువత కు ఉన్నత స్థాయి నైపుణ్య సంబంధ శిక్షణావకాశాన్ని కల్పిస్తుంది. మరి అలాగే పరిశ్రమ తో వారికి సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా జవాబుదారుతనాన్ని ఇనుమడింపచేయగలదు. అంతే కాక విభిన్న రంగాల లో ప్రపంచ శ్రేణి పోటీ తత్వాన్ని పెంచేందుకు కూడా మార్గాన్ని ఇది సుగమం చేయగలదు.
ప్రైవేటు రంగం లోని కృషి సంబంధ సామర్థ్యం తాలూకు ప్రయోజనాలను ఉపయోగించుకొని, దానికి ప్రభుత్వ భూమి రూపం లో ప్రభుత్వ పెట్టుబడి ని జత పరచడం ద్వారా ఇది ప్రావీణ్యం, జ్ఞానం మరియు స్పర్ధాత్మకత లకు నిలయమైన నూతన సంస్థ ల ఏర్పాటు కు దోహదం చేయనుంది.
***
(Release ID: 1550643)