మంత్రిమండలి

ఆరోగ్యం మరియు వైద్య విజ్ఞానశాస్త్రం రంగాల లో స‌హ‌కారానికి గాను భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 26 SEP 2018 4:07PM by PIB Hyderabad

ఆరోగ్యం, ఇంకా వైద్య విజ్ఞానశాస్త్రం రంగాల లో స‌హ‌కారానికి గాను భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య ఒప్పందం పై సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. 

ఈ ఒప్పందం దిగువన పేర్కొన్న రంగాల‌కు వ‌ర్తిస్తుంది:-


బోధ‌న సంబంధ సామ‌గ్రి మ‌రియు వైద్య విద్య సంస్థ‌ ల రిసర్చ్ లేబరేటరీ లు, ఇంకా ఫార్మాస్యూటిక‌ల్ ప్రోడ‌క్టులు స‌హా వైద్య సామ‌గ్రి రంగం లో వ్యాపార ప‌ర‌మైన స‌హ‌కారాన్ని అభివృద్ధి ప‌ర‌చుకొనే అవ‌కాశాల‌ను విస్త‌రించ‌డం;
ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ను ప‌టిష్టప‌ర‌చ‌డం మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాల క‌ల్ప‌న‌;
వైద్య‌ప‌ర‌మైన మ‌రియు ఆరోగ్య సంబంధ ప‌రిశోధ‌న, ఇంకా అభివృద్ధి లతో పాటు ఈ రంగాల‌ లో అనుభ‌వాన్ని ఇచ్చి, పుచ్చుకోవ‌డం;
టెలిమెడిసిన్ మ‌రియు ఎల‌క్ట్రానిక్‌, హెల్త్ ఇన్‌ఫ‌ర్మేశ‌న్ సిస్ట‌మ్స్ రంగం లో అనుభ‌వాలు మ‌రియు సాంకేతిక విజ్ఞానాల ఆదాన ప్ర‌దానం;
తల్లి బిడ్డ ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌;
అంటువ్యాధులు మ‌రిము అసాంక్రామిక వ్యాధుల నియంత్ర‌ణ, ఇంకా ఎపిడెమియోలజికల్  స‌ర్వేలెన్స్ పై మెల‌కువల, వ్యూహాల మెరుగుద‌ల మరియు అభివృద్ధి;
మందులు మ‌రియు ఔష‌ధ ఉత్ప‌త్తుల నియంత్ర‌ణ‌;
ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడివ‌డిన మ‌రే ఇత‌ర రంగాల లోనైనా స‌హ‌క‌రించుకోవ‌డం.
 
ఈ ఒప్పందం యొక్క అమ‌లును ప‌ర్య‌వేక్ష‌ించేందుకు, ఇంకా స‌హ‌కారానికి సంబంధించిన వివరాలను మ‌రింతగా విడమరచేందుకుగాను ఒక కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.


**



(Release ID: 1547427) Visitor Counter : 88