మంత్రిమండలి

మెస్స‌ర్స్ రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ (ఆర్‌సిఎఫ్‌) కు చెందిన భూమి ని ముంబ‌యి మెట్రో పాలిట‌న్ రీజన‌ల్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ (ఎమ్ఎమ్ఆర్‌డిఎ) కి బ‌దిలీ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

మెస్స‌ర్స్ ఆర్‌సిఎఫ్ కు చెందిన భూమి ని మ్యునిసిప‌ల్ కార్పొరేశన్ ఆఫ్ గ్రేట‌ర్ ముంబ‌యి (ఎమ్‌సిజిఎమ్‌) కి బ‌ద‌లాయించేందుకు; మ‌రియు ఎమ్ఎమ్ఆర్‌డిఎ/ఎమ్‌సిజిఎమ్ కు భూమి ని బ‌దిలీ చేసినందుకు బ‌దులుగా అందుకున్న/అంద‌వ‌ల‌సివున్న ట్రాన్స్‌ఫ‌ర‌బుల్ డివెల‌ప్‌మెంట్ రైట్ (టిడిఆర్‌) స‌ర్టిఫికెట్ విక్ర‌యానికి కూడా

Posted On: 12 SEP 2018 4:34PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం మెస్స‌ర్స్ రాష్ట్రీయ కెమిక‌ల్స్ & ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌ (ఆర్‌సిఎఫ్‌) కు చెందిన భూమి ని ముంబ‌యి మెట్రో పాలిట‌న్ రీజ‌న‌ల్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ (ఎమ్ ఎమ్ ఆర్‌డిఎ)కి బ‌దిలీ చేసేందుకు; మెస్స‌ర్స్ ఆర్‌సిఎఫ్ కు చెందిన భూమి ని మ్యునిసిప‌ల్ కార్పొరేశన్ ఆఫ్ గ్రేట‌ర్ ముంబ‌యి (ఎమ్‌సిజిఎమ్‌)కి బ‌ద‌లాయించేందుకు; మ‌రియు ఎమ్ఎమ్ఆర్‌డిఎ/ఎమ్‌సిజిఎమ్ కు భూమిని బ‌దిలీ చేసినందుకు బ‌దులుగా అందుకున్న/ అంద‌వ‌ల‌సివున్న ట్రాన్స్‌ఫ‌ర‌బుల్ డివెల‌ప్‌మెంట్ రైట్ (టిడిఆర్‌) స‌ర్టిఫికెట్ విక్ర‌యానికి ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

పూర్వ‌రంగం:

ఆర్‌సిఎఫ్ భార‌తదేశం లోని ప్ర‌భుత్వ రంగం లో గ‌ల అగ్ర‌గామి ఎరువులు మ‌రియు ర‌సాయ‌నాల త‌యారీ కంపెనీ ల‌లో ఒక‌టి గా ఉంది.  దీనిని 1978వ సంవ‌త్స‌రం మార్చి నెల 6వ తేదీ నాడు అంత‌కు పూర్వం ఉన్న‌టువంటి ఫ‌ర్టిలైజ‌ర్ కార్పొరేశ‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను పున‌ర్వ్యవస్థీకరించి నెలకొల్పడమైంది.  ప్ర‌స్తుతం ఆర్‌సిఎఫ్ అధీకృత మూల‌ధ‌నం 800 కోట్ల రూపాయ‌లు గాను, చెల్లించిన మూల‌ధ‌నం 551.69 కోట్ల రూపాయ‌లు గాను ఉంది.  1997 వ సంవ‌త్స‌రంలో ఈ కంపెనీ కి ప్ర‌తిష్టాత్మ‌క‌ ‘మినీ ర‌త్న’ హోదా ను ఇవ్వ‌డ‌ం జరిగింది.  ఆర్‌సిఎఫ్ కు చెందిన 48,849.74 చ‌.మీ. భూమి (ఇందులో 8265 చ‌.మీ.ల భూమి ఎటువంటి చిక్కులు లేని/ స్వేచ్ఛాయుత‌మైన భూమి కాగా 40584.74 చ‌.మీ లు రుణ‌గ్ర‌స్త భూమి)ని ఎమ్ఎమ్ఆర్‌డిఎ సేక‌రించి ఈస్ట‌ర్న్ ఫ్రీ వే - అనిక్ పంజ్ రాపోల్ లింక్ రోడ్డు (ఎపిఎల్ఆర్) నిర్మాణాన్ని పూర్తి చేసి, 2014వ సంవ‌త్స‌రం లో ప్ర‌జా వినియోగానికి గాను ప్రారంభించింది.
ఇందులో 8265 చ‌.మీ. ల భూమి ఎటువంటి చిక్కులు లేని/ విముక్త భూమి కి గాను ఒక తాత్కాలిక స‌హాయం గా ఎమ్ఎమ్ఆర్‌డిఎ 1.11.2017 నాడు  16530 చ‌.మీ. ల‌కు గాను జారీ చేసిన టిడిఆర్ స‌ర్టిఫికెట్ ను ఆర్‌సిఎఫ్ స్వీక‌రించింది.  40584.74 చ‌.మీ. ల విస్తీర్ణం క‌లిగిన రుణ గ్ర‌స్త భూమి కి గాను టిడిఆర్‌/న‌ష్ట ప‌రిహారం కోరుతూ ఆర్‌సిఎఫ్ వేసిన దావా పై మ‌ధ్య‌వ‌ర్తి ఒక నిర్ణయాన్ని వెలువ‌రించవ‌ల‌సివుంది.

ఎమ్‌సిజిఎమ్ యొక్క ముంబ‌యి అభివృద్ధి ప్ర‌ణాళిక లో నుండి ఆర్‌సిఎఫ్ కాల‌నీ కి చెందిన అంత‌ర్గ‌త ర‌హ‌దారుల‌ను తొల‌గించాల‌ంటూ ఆర్‌సిఎఫ్ దీర్ఘ‌కాలంగా ఎమ్ సిజిఎమ్ ను ప‌ట్టు బట్టుతూ వ‌స్తోంది.  అనంత‌ర కాలంలో ప‌ర‌స్ప‌రం అంగీకారం కుదిరిన నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డిన‌టువంటి న‌ష్ట ప‌రిహారం గా టిడిఆర్ కు బ‌దులుగా దాదాపు 16000 చ‌.మీ ల భూమి ని (స్థ‌లం వాస్త‌వ కొల‌త ష‌ర‌తుకు లోబ‌డి) 18.3 మీట‌ర్ల డిపి ర‌హ‌దారి నిర్మాణం కోసం అప్పగించేందుకు ఆర్‌సిఎఫ్ అంగీక‌రించింది.

ప్ర‌తిపాదిత ఆర్‌సిఎఫ్ టౌన్ శిప్ కు ఎదురుగా 331.96 చ.మీ. ల మేర‌కు  ఆర్‌సిఎఫ్ భూమి ని ప‌బ్లిక్ రోడ్డు విస్త‌ర‌ణ‌కై రిజ‌ర్వు చేస్తున్న‌ట్లు  అభివృద్ధి ప్ర‌ణాళిక‌ లో ఎమ్‌సిజిఎమ్ చూపించింది.  ఎమ్‌సిజిఎమ్ యొక్క 1991 నాటి డివెల‌ప్‌మెంట్ కంట్రోల్ రూల్స్ ప్ర‌కారం, భూమి ని రిజ‌ర్వు చేసిన‌ట్ల‌యితే భూమి ని రోడ్‌ సెట్ బ్యాక్ ఏరియా గా ఎమ్‌సిజిఎమ్ కు విధ్యాత్మకంగా వ‌దులుకోవ‌ల‌సివుంటుంది.


**



(Release ID: 1546099) Visitor Counter : 136