ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్ష‌త‌న ముగిసిన కేంద్రీయ హిందీ సంఘం 31వ స‌మావేశం

Posted On: 06 SEP 2018 4:57PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్రీయ హిందీ సంఘం 31వ స‌మావేశం ఈ రోజున న్యూ ఢిల్లీ లో జ‌రిగింది.

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో, సంఘం స‌భ్యులు అంద‌రూ చేసినటువంటి సృజ‌నాత్మ‌క‌మైన మ‌రియు ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన సూచ‌న‌ల‌కు గాను వారిని అభినందించారు.

రోజువారీ సంభాష‌ణల ద్వారా హిందీ భాష ను వ్యాప్తి చేయాల‌ని, సంక్లిష్ట‌మైన సాంకేతిక ప‌దాల‌ను ఉప‌యోగించ‌డం మానుకోవాలని, లేదంటే వాటిని ఆధికారిక ప్రయోజనాలకై కొద్ది మేర‌కు ఉప‌యోగించాల‌ంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ప్ర‌భుత్వం లోను, స‌మాజం లోను హిందీ వాడ‌కం విషయంలో ఉన్న అంత‌రాన్ని త‌గ్గించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కిపలుకుతూ, ఈ ప్ర‌చార ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించ‌డం లో విద్యా సంస్థ‌లు సహాయకారి కాగలవన్నారు.  

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా త‌నకు ఎదురైన అనుభ‌వాల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, హిందీ స‌హా అన్ని భార‌తీయ భాష‌ల స‌హాయం తో మనం యావ‌త్తు ప్ర‌పంచం తో సంధానం కావ‌చ్చ‌ంటూ స‌భ్యుల‌కు హామీని ఇచ్చారు.

ఇదే మాదిరిగా, ప్ర‌పంచం లో కెల్లా అతి పురాత‌న‌మైన త‌మిళం వంటి భార‌తీయ భాష‌లను చూసుకొని మ‌నం గ‌ర్విద్దాం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దేశం లోని అన్ని భాష‌లు హిందీ ని సుసంప‌న్నం చేయ‌గ‌లుగుతాయ‌ని కూడా ఆయ‌న చెప్పారు.  ఈ సంద‌ర్భం లో ప్ర‌భుత్వం యొక్క ‘‘ఏక్ భార‌త్ శ్రేష్ఠ భార‌త్’’ కార్య‌క్ర‌మాన్ని గురించి కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.

హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింహ్ స్వాగ‌తోప‌న్యాసం చేసిన అనంత‌రం, రాజ భాష కార్య‌ద‌ర్శి  వివిధ భాష‌ల లో పురోగ‌తి పై కార్య‌క్ర‌మ ప‌ట్టిక కు అనుగుణంగా ఒక నివేదిక ను సభ కు స‌మ‌ర్పించారు.  హిందీ భాష ప్ర‌చారానికి సంబంధించిన అంశాల పై స‌భ్యులు వారి వారి ఆలోచ‌న‌ల‌ను వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్రీయ హిందీ నిదేశాలయ్ ప్ర‌చురించిన గుజ‌రాత్‌-హిందీ ఫండ్ ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు.

సుమారు రెండు గంట‌ల సేపు కొన‌సాగిన ఈ స‌మావేశం లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మ‌రియు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రుల‌ తో పాటు సంఘానికి చెందిన ఇత‌ర స‌భ్యులు పాలుపంచుకొన్నారు.


**



(Release ID: 1545208) Visitor Counter : 212