మంత్రిమండలి

సాంప్రదాయక వైద్య పద్ధతులు మరియు హోమియోపతి రంగం లో సహకారానికి గాను భారతదేశం మరియు క్యూబా ల మధ్య ఎంఓయూ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 18 JUL 2018 5:38PM by PIB Hyderabad

సాంప్రదాయక వైద్య పద్ధతులు మరియు హోమియోపతి రంగం లో సహకారానికి గాను భారతదేశం మరియు క్యూబా ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.  ఈ ఎంఓయూ పై 2018 జూన్ 22వ తేదీ న సంతకాలయ్యాయి.

ప్రభావం:

ఈ ఎంఓయూ సాంప్రదాయక వైద్య పద్ధతుల లోను, హోమియోపతి రంగం లోను భారతదేశం మరియు క్యూబా ల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించనుంది.  ఇది ఉభయ దేశాల మధ్య నెలకొన్న ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిగణనలోకి తీసుకొన్నట్లయితే గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకోనుంది.

పూర్వ‌రంగం:

భార‌త‌దేశం లో వైద్యం తాలూకు సాంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తులు సువ్య‌వ‌స్థిత‌మైన‌వి, క్రోడీకరించినవే కాక గ్రంథస్తం చేసినవీనూ.  ఆయుర్వేదం, యోగ‌, ప్ర‌కృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా రిగ్ పా, ఇంకా హోమియోప‌తి ల వంటివి ఇందులో భాగాలుగా ఉన్నాయి.  ప్ర‌పంచ ఆరోగ్య రంగంలో  బ్రహ్మాండమైన ఆదరణకు నోచుకొనే సామర్థ్యం ఈ పద్ధతులకు ఉంది.  ఈ సాంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తులను మ‌రింత‌గా ప్రోత్స‌హించ‌డం, ప్ర‌చారంలోకి తీసుకు రావ‌డంతో పాటు ప్ర‌పంచంలో వీటికి మ‌రింత ఆద‌ర‌ణ‌ను సంత‌రించే బాధ్య‌త‌ల‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు అప్ప‌గించడమైంది.  ఆయుష్ మంత్రిత్వ శాఖ సాంప్ర‌దాయ‌క వైద్య రంగంలో స‌హ‌కారం కోసం 10 దేశాల‌తో ఎమ్ఒయు ను కుదుర్చుకొని దీటైనటువంటి చ‌ర్య‌లను కూడా చేప‌ట్టింది.  ఇరు ప‌క్షాలు నియంత్రణ సంబంధ అంశాలలో మ‌రింత చ‌క్క‌ని అవ‌గాహ‌న‌ను ఏర్ప‌ర‌చుకోవ‌డానికి ఈ ఎమ్ఒయు మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.   భార‌త‌దేశం నుండి ఇండోనేశియా కు వైద్య ఉత్ప‌త్తుల ఎగుమ‌తిని పెంపొందింపచేయడంలోను మరియు అంతర్జాతీయ వేదికలలో మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పడంలోను ఈ ఎమ్ఒయు తోడ్ప‌డగలుగుతుంది.
 

**



(Release ID: 1539144) Visitor Counter : 103