మంత్రిమండలి
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్,ఐర్లండ్‌ల మధ్య 2010లో సంతకాలు జరిగిన పరస్పర గుర్తింపు ఒప్పందానికి (ఎం.ఆర్.ఎ) , తాజా ఎం.ఆర్.ఎ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Posted On:
18 JUL 2018 5:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసిఎఐ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్,(సిపిఎ) ఐర్లండ్‌ల మధ్య 2010లో సంతకాలు జరిగిన పరస్పర గుర్తింపు ఒప్పందానికి (ఎం.ఆర్.ఎ) వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా అలాగే, తాజా ఎం.ఆర్.ఎ కు ఆమోదం తెలిపింది.పరస్పర సహకారం, అకౌంటింగ్ పరిజ్ఞానంలో పురోగతి,పరస్పర రెండు సంస్థల సభ్యుల ప్రయోజనాలను కాపాడడం, ఐర్లండ్,ఇండియాలలో అకౌంటింగ్ వృత్తి సానుకూల వృద్ధికి ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ప్రభావం :
ఎం.ఆర్.ఎ ఉభయ దేశాలలోని ఈ సంస్థల సభ్యులు ఆయా దేశాలలో కొత్త మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానాలు అనుసరించేందుకువీలుగా తగిన అవకాశాలు కల్పించడానికి ఇది ఉపకరించనుంది.
నేపథ్యం:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ) భారత పార్లమెంటు చేత చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 ప్రకారం ఏర్పాటైన సంస్థ.
భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తిని నియంత్రించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఇన్ ఐర్లండ్ (సిపిఎ, ఐర్లండ్) ఐరిష్ అకౌంటెన్సీ ప్రధాన సంస్థ. ఇందులో 5000మంది సభ్యులుగా ఉన్నారు.
(Release ID: 1539142)
Visitor Counter : 139