మంత్రిమండలి

తపాలా శాఖకు చెందిన గ్రామీణ డాక్ సేవకుల వేతనాలు, అలవెన్సుల సవరణకు మంత్రి మండలి ఆమోదం

Posted On: 06 JUN 2018 3:16PM by PIB Hyderabad

ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి - తపాలా శాఖకు చెందిన గ్రామీణ డాక్ సేవకుల వేతనాలు, అలవెన్సుల సవరణకు ఆమోదం తెలియజేసింది.

వేతన సవరణ వల్ల 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1,257 కోట్ల 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ( ఇందులో 860 కోట్ల 95 లక్షల రూపాయలు స్థిర వ్యయం కాగా - 396 కోట్ల 80 లక్షల రూపాయల మేర పురావృత వ్యయంగా ఉంటుంది).

వేతన సవరణ ద్వారా 3 లక్షల 7 వేల మంది గ్రామీణ డాక్ సేవకులు ప్రయోజనం పొందుతారు.

వివరాలు :

  1. సమయాన్ని బట్టి కొనసాగించే అలవెన్సుల (టి ఆర్ సి ) నిర్మాణాన్ని మరియు స్లాబులను హేతుబద్ధం చేయడం జరిగింది. మొత్తం గ్రామీణ డాక్ సేవకులను రెండు వర్గాల కిందకు తీసుకురావడం జరిగింది - బ్రాంచి పోస్టు మాస్టర్లు (బిపిఎమ్ లు) మరియు బ్రాంచి పోస్టు మాస్టర్లు మినహా మిగిలినవారు - అంటే - సహాయ పోస్టు మాస్టర్లు ( బిపిఎమ్ లు).

  1. ప్రస్తుతం ఉన్న 11 టి ఆర్ సి స్లాబులను కేవలం మూడు టి ఆర్ సి స్లాబులుగా కుదించడం జరిగింది. బిపిఎమ్ లకు, బిపిఎమ్ లు మినహా మిగిలిన వారికీ - ఒక్కొక్కరికీ రెండేసి స్థాయిలు నిర్ణయించారు.

  1. సమయాన్ని బట్టి కొనసాగించే కొత్త అలవెన్సుల (టి ఆర్ సి ) వివరాలు ఇలా ఉన్నాయి:

పని గంటలు / స్థాయి ఆధారంగా ప్రతిపాదిత రెండు రకాల కేటగిరీలలో కనీస టి ఆర్ సి

వరుస సంఖ్య

కేటగిరి

4 గంటలు / స్థాయి 1 లో కనీస టి ఆర్ సి

5గంటలు / స్థాయి-2 లో కనీస టి ఆర్ సి

1

బి పి ఎమ్

రూ. 12000/-

రూ. 14500/-

2

ABPM/Dak Sevaks

బి పి ఎం / డాక్ సేవకులు

రూ. 10000/-

రూ. 12000/-

  1. కరువు భత్యాన్ని ఒక ప్రత్యేక మొత్తంగా చెల్లించడం కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించినప్పుడల్లా ఎప్పటికప్పుడు సవరించడం జరుగుతుంది.

  1. కొత్త పధకాన్ని రూపొందించే వరకు - టి ఆర్ సి మూల వేతనం గరిష్టంగా రూ. 7000 + కరువు భత్యం పై ఎక్స్ గ్రేషియా లెక్కకట్టి ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

  1. ప్రస్తుతం ఉన్న టి ఆర్ సి మూలవేతనాన్ని 2.57 (ఫ్యాక్టర్) తో హెచ్చవేయగా వచ్చిన మొత్తాన్ని సవరించిన మూల వేతనంగా పరిగణించి - 1.1.2016 తేదీ నుంచి వేతన సవరణ అమలుచేసే వరకూ వేతన బకాయిల మొత్తాన్ని ఒకే వాయిదాలో చెల్లించడం జరుగుతుంది.

  1. గ్రామీణ డాక్ సేవకులు ఒక సారి ఇచ్చే వ్రాత పూర్వక అభ్యర్ధన ఆధారంగా - ప్రతీ ఏటా - జనవరి ఒకటవ తేదీన లేదా జులై ఒకటవ తేదీన - 3 శాతం చొప్పున వార్షిక పెంపుదల వర్తింపచేస్తారు.

  1. . ప్రమాదం మరియు కష్టాలను పరిగణలోనికి తీసుకుని కొత్తగా ఒక అలవెన్సు ను ప్రవేశపెట్టడం జరిగింది. కార్యాలయ నిర్వహణ అలవెన్సు, కంబైన్డ్ డ్యూటీ అలవెన్సు, క్యాష్ కన్వేయన్సు చార్జీలు, సైకిల్ నిర్వహణ అలవెన్సు, బోటు అలవెన్సు, ఫిక్సడ్ స్టేషనరీ చార్జీలు మొదలైన ఇతర అలవెన్సులను కూడా సవరించారు.

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు :

  • సవరణ వల్ల గ్రామీణ డాక్ సేవకుల జీత భత్యాలు, ఇతర ప్రయోజనాలు మెరుగవుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమర్ధవంతమైన, సరసమైన ధరలకు తపాలా సదుపాయాలు / సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతిపాదిత వేతన పెంపుదల - డాక్ సేవకుల సామాజిక, ఆర్ధికస్థితి మెరుగౌతుంది.

ప్రభావం :

  • సమాచారం మరియు ఆర్ధిక సేవల కల్పనకు బ్రాంచ్ పోస్టాఫీసులే ఆధారం. మరియు ఇవి మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. పోస్టు మాస్టర్లు ఒక్కోసారి పెద్ద మొత్తంలో నగదును ఖాతాదారులకు చెల్లించవలసి వస్తుంది; అందువల్ల వీరి పనిలో జవాబుదారీ తనం కూడా ఇమిడి ఉంటుంది. వేతన పెంపుదల వారి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. దీనికి తోడు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపిపిబి) సేవలు మరింత పెరగడం ద్వారా - గ్రామీణ ప్రజల ఆర్ధిక చేరిక ప్రక్రియలో సిడిఎస్ నెట్ వర్క్ ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

నేపధ్యం :

  • ఉద్యోగులను నియమించడానికి అవసరంలేని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమిక, ఆర్ధిక, సమర్ధవంతమైన తపాలా సేవలు అందుబాటులోకి తేవడం కోసం - తపాలా శాఖకు అనుబంధంగా ఎక్స్ ట్రా డిపార్ట్ మెంటల్ విధానం దాదాపు 150 సంవత్సరాలకంటే ముందే ఏర్పాటైంది. లక్షా ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు (1,29,346) ఎక్స్ ట్రా డిపార్ట్ మెంటల్ బ్రాంచ్ తపాలా కార్యాలయాలను గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లే నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా, గ్రామీణ డాక్ సేవకులూ, అలాగే బ్రాంచ్ పోస్టు మాస్టర్లు మినహా మిగిలినగారు - బ్రాంచి, సబ్, హెడ్ పోస్టాఫీసుల్లో కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ డాక్ సేవకులు వారి ఇతర వృత్తుల ద్వారా లభించే సంపాదనకు అదనంగా - వారికీ, వారి కుటుంబానికీ ఆర్ధిక వెసులుబాటు కలిగించే విధంగా - రోజుకు 3 నుంచి 5 గంటలు పార్ట్ టైం గా పనిచేస్తారు. 65 ఏళ్ల వయస్సు వరకు వారు సర్వీసులో కొనసాగుతారు.

****

(Release ID: 1534688) Visitor Counter : 151