మంత్రిమండలి

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల‌లో మొబైల్ సేవల క‌ల్పనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 23 MAY 2018 3:49PM by PIB Hyderabad

యూనివ‌ర్స‌ల్ స‌ర్వీస్ ఓబ్లిగేశన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్‌) మ‌ద్ద‌తు తో చేప‌ట్టే ప‌థ‌కం కింద‌, రెండో ద‌శ ప్రాజెక్టులో భాగంగా వామ‌ప‌క్ష తీవ్రవాద (ఎల్ డబ్ల్యు ఇ) ప్ర‌భావిత 10 రాష్ట్రాల లోని 96 జిల్లాల‌లో కేంద్ర హోం మంత్రిత్వ‌ శాఖ గుర్తించిన ఆవాసాల‌లో, ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌థ‌కం కిందకు రాని  4072 ట‌వ‌ర్ లొకేశన్ లలో మొబైల్ సేవ‌లను క‌ల్పించేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7330 కోట్ల రూపాయ‌లుగా ఉండగలదు.

 

ఈ నెట్‌వ‌ర్క్ ను వామ‌ప‌క్ష తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల బాధిత ప్రాంతాల‌లో నియ‌మితులైన భ‌ద్ర‌త సిబ్బంది ఉపయోగించుకోనున్నారు.  ఈ ప్రోజెక్టు మొబైల్ సేవ‌ల‌ను అనుసంధాన‌త లేని నివాస గ్రామాల‌ లోని వారికి స‌హాయ ప‌డేందుకు కూడా అందుబాటు లోకి తీసుకువస్తుంది.  తద్వారా ఆ ప్రాంతాలలో ఆర్థిక కార్య‌క‌లాపాలు మెరుగుప‌డ‌గలవు. డిజిటల్ మొబైల్ అనుసంధానం వెనుక‌బ‌డిన ప్రాంతాల, వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఇ-గ‌వ‌ర్నెన్స్ కార్య‌క‌లాపాలు పుంజుకోవ‌డానికి ఊతం లభిస్తుంది. 

 

10 రాష్ట్రాల‌లో ప్ర‌తిపాదించిన ట‌వ‌ర్ లొకేశన్ ల సంఖ్యలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి :

-----------------------------------------------------------------------

 క్ర‌మ‌

సంఖ్య       రాష్ట్రం          జిల్లాలు       ట‌వ‌ర్‌ లొకేశన్ ల సంఖ్య‌

----------------------------------------------------------------------

1    ఆంధ్ర‌ ప్ర‌దేశ్                8                   429

2    బిహార్                       8                  412

3   ఛత్తీస్‌ గడ్                 16                 1028

4   ఝార్ ఖండ్               21                 1054

5   మ‌ధ్య‌ ప్ర‌దేశ్                 1                     26

6   మ‌హారా ష్ట్ర                   2                  136

7   ఒడిశా                       18                 483

8   తెలంగాణ                   14                 118

9   ఉత్త‌ర్ ప్ర‌దేశ్                  3                 179

10  ప‌శ్చిమ‌ బెంగాల్            5                  207

--------------------------------------------------------------------------

మొత్తం   10 రాష్ట్రాలు          96                 4072

-------------------------------------------------------------------------

 

 పూర్వరంగం :

ఎ. ఎల్‌డ‌బ్ల్యుఇ ఫేజ్-1 ప్రాజెక్టు

 

 ఎల్ డబ్ల్యు ఇ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా, వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల‌లో  2జి సాంకేతిక విజ్ఞానంతో మొబైల్ సేవ‌లను క‌ల్పించేందుకు మొత్తం ఆమోదిత 4080.78 కోట్ల రూపాయ‌ల ప్రాజెక్టు పూర్తి కావ‌చ్చింది. 

 

  1. ప్ర‌స్తుతం మొత్తం 2355 సైట్‌ ల‌కు గాను 2335 సైట్‌లు రేడియేట్ అవుతున్నాయి.

బి. ఎల్‌డ‌బ్ల్యుఇ ఫేజ్-2 ప్రాజెక్టు

 

కేంద్ర హోం మంత్రిత్వ‌ శాఖ సంబంధిత రాష్ట్రాల‌తో క‌లిసి 10 రాష్ట్రాల లోని 96 జిల్లాల‌లో నియ‌మితులైన భ‌ద్ర‌త సిబ్బంది క‌మ్యూనికేశన్ అవ‌స‌రాల నిమిత్తం 4072 ట‌వ‌ర్ లొకేశన్ లను గుర్తించి ఇదే సంగతిని 2017 అక్టోబ‌ర్ 27వ తేదీన డిఒటి కి తెలిపింది.

 

  1. ఫేజ్‌-2 లో భాగంగా ప్ర‌తిపాదించిన సాంకేతిక విజ్ఞానాన్ని సంబంధిత వ‌ర్గాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయ‌డమైంది.  ఇక ఈ ప్రోజెక్టు లో భాగంగా మొబైల్ సంధానాన్ని క‌ల్పించ‌డానికి 2జి మరియు 4జి సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకు రానున్నారు.

 

***



(Release ID: 1533270) Visitor Counter : 141