మంత్రిమండలి

మేఘాల‌య లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ కై మొబైల్ స‌ర్వీసుల ఏర్పాటుకు ఉద్దేశించినటువంటి యుఎస్ఒఎఫ్ ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 23 MAY 2018 3:49PM by PIB Hyderabad

మేఘాల‌య లో నార్త్ ఇస్ట‌ర్న్ రీజియ‌న్ (ఎన్ఇఆర్‌) కోసం కోంప్రిహెన్సివ్ టెలికమ్ డివెల‌ప్‌మెంట్ ప్లాన్ (సిటిడిపి) ను అమ‌లు చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  దీనికి మొత్తం 3911 కోట్ల రూపాయ‌ల ప్రోజెక్టు వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా.  ఈ నిధుల‌ను యూనివ‌ర్స‌ల్ స‌ర్వీస్ ఓబ్లిగేశన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్‌) అందిస్తుంది.  అలాగే, ఎన్ఇఆర్ కు ఉద్దేశించిన సిటిడిపి ప్రోజెక్టు కు  8120.81 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు వ్య‌యానికి కూడా ఆమోదం ల‌భించింది. (మంత్రివ‌ర్గం ఇప్ప‌టికే 5336.18 కోట్ల రూపాయ‌ల నిధుల‌కు 2014 సెప్టెంబ‌ర్ 10వ తేదీన ఆమోదం తెలిపింది).

ముఖ్యాంశాలు:

ఈ ప‌థ‌కం మేఘాల‌య రాష్ట్రంలో గుర్తించిన‌టువంటి అన్ క‌వ‌ర్‌డ్‌ ఏరియాల‌కు 2జి+4జి మొబైల్ సేవ‌ల‌ను స‌మ‌కూరుస్తుంది; అదే విధంగా మేఘాల‌య లోని జాతీయ ర‌హ‌దారుల వెంబ‌డి 2జి+4జి నిరంత‌రాయ క‌వ‌రేజి ని స‌మ‌కూరుస్తుంది.

ప్ర‌యోజ‌నాలు:
 
టెలికం నెట్‌వ‌ర్క్ ను బ‌లోపేతం చేసినందువ‌ల్ల మేఘాల‌య లో మొబైల్ సంధానం యొక్క వ్యాప్తి పెరుగుతుంది.  త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు క‌మ్యూనికేశన్, స‌మాచారం మ‌రియు పాల‌న న్యాయ‌బ‌ద్ధంగాను, ఇంకా త‌క్కువ ఖ‌ర్చులోను అందుబాటులోకి వ‌స్తుంది.
 
మేఘాల‌య లో ఇంత‌వ‌ర‌కు మొబైల్ నెట్‌వ‌ర్క్ సేవలకు నోచుకోని ప్ర‌జ‌ల‌కు ఆ సౌకర్యాన్ని స‌మ‌కూర్చ‌డం వ‌ల్ల పౌరుల‌కు ఐసిటిల తాలూకు ప్ర‌యోజ‌నాలను క‌ల్పించి సామాజిక‌, ఆర్థిక వికాసాల‌ను ఇనుమ‌డింపజేసిన‌ట్లు అవుతుంది.
 
బ్రాడ్‌బాండ్ ఇంకా ఇంట‌ర్ నెట్ ల‌భ్య‌త‌ల ద్వారా  ఆయా ప్రాంతాలలో న‌వ‌క‌ల్ప‌న తాలూకు నైపుణ్యం పెంపొందుతుంది.


***



(Release ID: 1533237) Visitor Counter : 142