ప్రధాన మంత్రి కార్యాలయం

హేమ‌వ‌తి నంద‌న్ బ‌హుగుణ స్మార‌క త‌పాల బిళ్ళ‌ను విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 26 APR 2018 5:40PM by PIB Hyderabad

ఉత్త‌ర్ ప్రదేశ్ పూర్వ ముఖ్య‌మంత్రి, కీర్తిశేషులు శ్రీ హేమ‌వ‌తి నంద‌న్ బ‌హుగుణ స్మార‌కార్థం తీసుకు వ‌చ్చిన ఒక త‌పాలా బిళ్ళ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ బ‌హుగుణ ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు నిబ‌ద్ధుడైన ఒక నేత‌ అంటూ అభివ‌ర్ణించారు.  గాంధీ మ‌హాత్ముడు, ఆచార్య వినోబా భావే, ఆచార్య న‌రేంద్ర దేవ్‌, శ్రీ రామ్ మ‌నోహ‌ర్ లోహియా, మ‌రియు శ్రీ చంద్ర‌శేఖ‌ర్ అజాద్ లతో సహా ప‌లువురు విభిన్న నేత‌ల నుండి శ్రీ బ‌హుగుణ ప్రేర‌ణ‌ను పొందార‌ని ఆయ‌న అన్నారు.

విద్య రంగం లో మ‌రియు దేశంలో ప‌ర్వ‌త‌మ‌య ప్రాంతాల అభివృద్ధి లో శ్రీ బ‌హుగుణ అందించిన తోడ్పాటు ను గురించి కూడా ప్ర‌ధాన మంత్రి సుదీర్ఘంగా వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌మ్యూనికేశన్ ల శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్యత‌) శ్రీ మ‌నోజ్ సిన్హా పాలుపంచుకొన్నారు.  శ్రీ విజ‌య్ బ‌హుగుణ, ఇంకా డాక్ట‌ర్ రీతా బ‌హుగుణ లు సహా శ్రీ బహుగుణ కుటుంబానికి చెందిన ఇతర స‌భ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.


***


(Release ID: 1530433) Visitor Counter : 130