మంత్రిమండలి

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ ల వేత‌నం మ‌రియు భ‌త్యాల స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 11 APR 2018 2:03PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ (ఎల్ జి) ల వేత‌నం మ‌రియు భ‌త్యాల స‌వ‌ర‌ణ‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  దీనితో ఎల్‌జి ల వేత‌నం మ‌రియు భ‌త్యాలు భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి యొక్క వేత‌నం మ‌రియు భ‌త్యాల తో స‌మం కానున్నాయి.

వివ‌రాలు:

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ ల వేత‌నం మ‌రియు భ‌త్యాల‌ను భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి శ్రేణి లో ఉన్న అధికారుల‌కు వ‌ర్తిస్తున్న మేరకు పెంచే ప్ర‌తిపాద‌న‌ ను మంత్రివ‌ర్గం ఆమోందించింది.  దీని ప్ర‌కారం.. ఎల్‌జి ల‌కు వేతనం మరియు భత్యాలు 2016 జ‌న‌వ‌రి 1వ తేదీ నుండి క‌ర‌వు భ‌త్యం, ప్రతి నెల కు 4,000 రూపాయల చొప్పున అతి వ్య‌య నియంత్రణ భ‌త్యం, ఇంకా స్థానిక భ‌త్యాలు క‌లుపుకొని నెల నెలా 80,000 రూపాయలుగా లభిస్తున్న దానిని పెంచి, క‌ర‌వు భ‌త్యం, ప్రతి నెల కు 4,000 రూపాయల చొప్పున అతి వ్య‌య నియంత్రణ భ‌త్యం, ఇంకా భారత ప్రభుత్వంలో కార్యదర్శి శ్రేణి లో ఉన్న అధికారులకు లభించే స్థానిక భత్యాలతో సహా  2,25,000 రూపాయలకు చేరుకొంటాయి. ఇది ఒక షరతుకు లోబడి వుంటుంది; ఆ షరతు ఏమిటంటే, స్థానిక భ‌త్యాలు మ‌రియు అతి వ్య‌యాన్ని నియంత్రించే భ‌త్యం మిన‌హా మొత్తం పారితోషికం ఒక రాష్ట్రం యొక్క గ‌వ‌ర్న‌ర్ పొందే మొత్తం పారితోషికాన్ని మించి వుండ‌కూడ‌ద‌న్నదే.

పూర్వ‌రంగం:

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ ల యొక్క వేత‌నం మ‌రియు భ‌త్యాలు భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి శ్రేణి లోని అధికారుల‌తో స‌మంగా ఉంటాయి.  క‌డ‌ప‌టి సారిగా  2006 జ‌న‌వ‌రి 1 నుండి అమ‌ల‌య్యేటట్టు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ ల వేత‌నం మ‌రియు భ‌త్యాల‌ను మంత్రివ‌ర్గం ఆమోదంతో సవరించడం జరిగింది.  ఈ సవరణ తో లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ ల యొక్క వేత‌నం మ‌రియు భ‌త్యాలు ఒక్కొక్క నెల‌కు 26,000 రూపాయల (నిర్ధారితం) నుండి పెంచి క‌ర‌వు భ‌త్యం, ప్రతి నెల 4,000 రూపాయల అతి వ్య‌యాన్ని నియంత్రించే భ‌త్యం మరియు స్థానిక భ‌త్యాల‌తో క‌లిపి ఒక్కొక్క నెల‌కు 80,000 రూపాయలుగా (నిర్ధారితం) చేయడమైనది.

భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి శ్రేణి లోని అధికారులకు వేత‌నాన్ని సిసిఎస్ (రివైజ్ డ్) పే రూల్స్, 2016 ను అనుసరించి.. 2016 జ‌న‌వ‌రి 1 నుండి అమ‌లులోకి వ‌చ్చే విధంగా.. ప్రతి నెల‌ కు 80,000 రూపాయల నుండి ప్రతి నెల కు 2,25,000 రూపాయ‌లుగా చేసివేయడం జ‌రిగింది.


***



(Release ID: 1528686) Visitor Counter : 102