ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆంధ్ర ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, కేర‌ళ‌, తెలంగాణ మ‌రియు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో వ‌స్తువుల అంత‌ర్ రాష్ట్ర చేర‌వేత కోసం 2018 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమ‌లు లోకి రానున్న ఇ-వే బిల్లు వ్యవస్థ

Posted On: 10 APR 2018 11:26AM by PIB Hyderabad

 జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణ‌యానికి అనుగుణంగా వ‌స్తువుల చేర‌వేత‌కు ఇ-వే బిల్లు వ్య‌వ‌స్థ‌ను 2018 ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని రాష్ట్రాల‌లో ఆరంభించ‌డ‌మైంది.  అదే తేదీ నాటి నుండి క‌ర్నాట‌క లో కూడా స‌రుకుల అంత‌ర్ రాష్ట్ర చేర‌వేత‌కు ఇ-వే బిల్లు వ్య‌వ‌స్థ అమ‌లు లోకి వ‌చ్చింది.  ఇ-వే బిల్లు ల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది;  2018 ఏప్రిల్ 9వ తేదీ వరకు 63 ల‌క్ష‌ల‌కు పైగా  ఇ-వే బిల్లుల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డ‌మైంది.

 

     ఈ కింద పేర్కొన్న రాష్ట్రాల‌లో స‌రుకుల అంత‌ర్ రాష్ట్ర చేర‌వేత కోసం  ఇ-వే బిల్లు వ్య‌వ‌స్థను 2018 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమ‌లులోకి తీసుకు వస్తున్నట్లు  తెలియపరచడమైంది:

 

(i)      ఆంధ్ర ప్ర‌దేశ్‌

 

(ii)      గుజ‌రాత్‌

 

(iii)      కేర‌ళ 

 

(iv)      తెలంగాణ   

 

(v)      ఉత్త‌ర్ ప్ర‌దేశ్

 

     ఈ రాష్ట్రాల‌లో ఇ-వే బిల్లు వ్య‌వ‌స్థ అమ‌లు లోకి వ‌చ్చాక స‌రుకుల ర‌వాణాకు సంబంధించినంత వ‌ర‌కు చూస్తే వ్యాపారంప‌రిశ్ర‌మ‌ల రంగాల మ‌ధ్య మ‌రింత స‌మ‌న్వ‌యం నెల‌కొంటుంద‌నిత‌ద్వారా దేశ‌వ్యాప్తంగా ఒకే ఇ-వే బిల్లు వ్య‌వ‌స్థ ఏర్ప‌డేందుకుగాను మార్గం సుగ‌మం అవుతుందని ఆశిస్తున్నారు.  ఈ రాష్ట్రాల‌లోని వ్యాపారపారిశ్రామిక మ‌రియు ర‌వాణా సంస్థ‌లు చివ‌రి తేదీ కోసం వేచి వుండకుండాఇ- వే బిల్లు పోర్టల్ అయిన https://www.ewaybillgst.gov.in ను సందర్శించి రిజిస్ట్రేష‌న్‌/ ఎన్ రోల్ మెంట్ ను పొంద‌వ‌చ్చును.

 

 

***



(Release ID: 1528453) Visitor Counter : 113