మంత్రిమండలి

భార‌త‌దేశానికి, ఇరాన్ కు మ‌ధ్య రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌కు మ‌రియు ప్రభుత్వ కోశ సంబంధిత ఎగ‌వేత‌ నివార‌ణ‌కు ఉద్దేశించిన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 14 MAR 2018 7:33PM by PIB Hyderabad

భార‌త‌దేశానికి, ఇరాన్ కు మ‌ధ్య ఆదాయ‌పు ప‌న్నుల‌కు సంబంధించి రెండు సార్లు ప‌న్ను విధింపును నివారించేందుకు మ‌రియు ఫిస్క‌ల్ ఇవేఝ‌న్ ను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందం ఇరు దేశాల‌కు మ‌ధ్య రెండు సార్లు ప‌న్ను విధింపును నివారించ‌డంతో పాటు ఉభయ దేశాలకు మధ్య సిబ్బంది, పెట్టుబ‌డులు మ‌రియు సాంకేతిక విజ్ఞానం అటు నుండి ఇటు, ఇటు నుండి అటు రావడాన్ని, పోవడాన్ని పెంపొందించనుంది.  కాంట్రాక్టింగ్ పార్టీల మ‌ధ్య స‌మాచారం యొక్క ఆదాన ప్ర‌దానం తాజా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా సాగేటట్టు ఈ ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది.  త‌ద్వారా, ప‌న్నుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని ఇది మెరుగు ప‌రుస్తుంది; అంతే కాక ప‌న్నుల ఎగ‌వేత‌ను అరికట్టడంలో మరియు ప‌న్ను చెల్లింపుల‌ నుండి త‌ప్పించుకొనే ధోర‌ణుల‌ను అడ్డ‌గించ‌డంలో కూడా ఇది తోడ్ప‌డనుంది.

భార‌త‌దేశం ఇత‌ర దేశాల‌తో కుదుర్చుకున్న‌టు వంటి ఒప్పందాల కోవలోనే ఈ ఒప్పందం ఉన్నది.  భార‌త‌దేశం స‌మాన ప్రాతిప‌దిక‌న పాలుపంచుకొన్నటువంటి జి-20 ఒఇసిడి బేస్ ఇరోఝ‌న్ & ప్రాఫిట్ శిఫ్టింగ్ (బిఇపిఎస్‌) ప్రాజెక్టు లో భాగంగా ఒడంబ‌డికకు సంబంధించిన క‌నీస ప్ర‌మాణాల‌కు ప్ర‌తిపాదిత ఒప్పందం తుల‌ తూగుతుంది.  

భార‌తదేశానికి సంబంధించినంత వ‌ర‌కు ప‌రిశీలిస్తే, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961 ప‌రిధిలో విధించ‌ద‌గిన ఆదాయ‌పు ప‌న్ను ను త‌ప్పించుకోవ‌డాన్ని లేదా ఎగ‌వేత‌ ను నివారించ‌డానికి ఉద్దేశించినటువంటి స‌మాచారం యొక్క ఆదాన ప్రదానానికి, ఇంకా రెండు సార్లు ప‌న్ను విధింపును నివారించ‌డానికి ఏదైనా విదేశం తోనో లేదా ఏదైనా స్పెసిఫైడ్ టెరిట‌రి తోనో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొనే అధికారం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961 లో 90 వ (వి)భాగం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వానికి దఖలుపడింది.


***



(Release ID: 1524545) Visitor Counter : 81