ప్రధాన మంత్రి కార్యాలయం

దేశంలోని కొన్ని ప్రాంతాలలో విధ్వంస ఘ‌ట‌న‌ల‌ను తీవ్రంగా తిర‌స్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

హోం శాఖ మంత్రి తో సంభాష‌ణ‌; నేరం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొంటామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

Posted On: 07 MAR 2018 10:43AM by PIB Hyderabad
దేశం లోని కొన్ని ప్రాంతాల‌లో విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు; అంతేకాక, నేరం చేసిన‌ట్లు తేలిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకొంటామ‌ని కూడా ఆయ‌న అన్నారు.  విగ్ర‌హాల‌ను ప‌డ‌గొట్టిన సంఘ‌ట‌న‌లు దేశంలోని కొన్ని ప్రాంతాల‌లో జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.  ఈ విష‌యమై హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడడారు.  ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను తాను తీవ్రంగా తోసిపుచ్చుతున్న‌ట్లు ఈ సందర్భంగా ఆయన స్ప‌ష్టం చేశారు.  ఈ త‌ర‌హా విధ్వంస‌క‌ర ఘ‌ట‌నలను హోం మంత్రిత్వ శాఖ గంభీరంగా ప‌రిగ‌ణించింది.  ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను నివారించ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకొని తీరాల‌ని రాష్ట్రాల‌కు హోం మంత్రిత్వ శాఖ సూచించింది.  ఇలాంటి ప‌నుల‌కు పాల్పడే వారితో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, సంబంధిత చ‌ట్ట నిబంధ‌న‌ల ప్ర‌కారం కేసులను న‌మోదు చేయాల‌ని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.


***


(Release ID: 1522893) Visitor Counter : 98