• Sitemap
  • Advance Search
Social Welfare

కృత్రిమ మేధతో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు

Posted On: 13 FEB 2026 12:58PM

కీలకాంశాలు
- ఆరోగ్య సంరక్షణ సేవల్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, వైద్య పరికరాలు, సేవలు, మందుల నాణ్యతను మెరుగుపరచడానికి, అలాగే వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా, చౌకగా లభించేలా చేయడానికి భార‌త ప్ర‌భుత్వానికి ఏఐ సహాయపడుతోంది.
- ఏఐ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వ్యాధులను ముందుగానే గుర్తించడంలో, మెరుగైన చికిత్స‌ నిర్ణయాలు తీసుకోవడంలో, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను అందించడంలో తోడ్పడుతోంది.
- జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఏఐ పరికరాలను ఉపయోగించడం వల్ల క్షయవ్యాధి దుష్ప్రభావాలలో 27% తగ్గుదల కనిపించింది. 4,500 కంటే ఎక్కువ వ్యాధి వ్యాప్తి హెచ్చరికలను జారీ చేయడం సాధ్యమైంది.
- ఏప్రిల్ 2023 నుంచి నవంబర్ 2025 మధ్య కాలంలో 28.2 కోట్ల టెలిమెడిసిన్ సంప్రదింపులు జరిగాయి. వీటిలో ఏఐ సూచించిన రోగ నిర్ధారణల ద్వారా 1.2 కోట్ల మంది రోగులు ప్రయోజనం పొందారు.

పరిచయం
భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టెలిమెడిసిన్, పర్యవేక్షణ సాధనాల ద్వారా విప్లవాత్మక మార్పులు సాధిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఈ అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నాయి. ప్రతి పౌరుడికి సరసమైన ధరకే వైద్యం అందించడం, సేవల నాణ్యత పెంచడం, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా భారత ప్రభుత్వం 'అందరికీ ఆరోగ్యం' లక్ష్యాన్ని నెరవేరుస్తోంది.

'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే దృక్పథంతో, సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడానికి, పాలనను బలోపేతం చేయడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం 2024 మార్చిలో 'ఇండియా-ఏఐ మిషన్' ప్రారంభించింది. ఈ మిషన్ రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంది:
1. సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ: ఏఐ సాధనాలు గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని విభాగాలకు చేరేలా చూడటం.
2. మానవాళి కోసం సాంకేతికత: ఏఐని కేవలం సాంకేతిక పురోగతి కోసమే కాకుండా, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగించడం.
2047 నాటికి 'వికసిత భారత్' సాధించే ప్రయాణంలో భాగంగా ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకురావడం ఈ సమగ్ర విధానం ప్రధాన ఉద్దేశం.
ఆరోగ్య సేవల్లో ఏఐ శక్తిని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. 2018లోనే నీతి ఆయోగ్ 'జాతీయ ఏఐ వ్యూహాన్ని' ప్రచురించింది. ఇది ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ వంటి సాంకేతికతలను ఆరోగ్య రంగానికి 'కొత్త నాడీ వ్యవస్థ'గా అభివర్ణించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ జాతీయ కార్యక్రమాల్లో ఏఐ సాధనాలు భాగమయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా వైద్య నైపుణ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఉదాహరణకు, క్షేత్రస్థాయి సిబ్బంది టీబీ, డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలను గుర్తించడానికి ఇవి తోడ్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన 28.2 కోట్ల టెలిమెడిసిన్ సంప్రదింపుల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. ఈ కృషి వల్ల టీబీ చికిత్సలో ప్రతికూల ఫలితాలు 27% తగ్గాయి, వ్యాధి నిర్ధారణ సామర్థ్యం 12-16% పెరిగింది.

ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ సౌత్ తొలి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌ను భారతదేశం నిర్వహించనుంది. దీనిలో ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక సంస్థలు, ఆవిష్కర్తలు మరియు నిపుణులు సమావేశమవుతారు. ఈ సమ్మిట్ ఏఐ-కేంద్రీకృత విధానం, పరిశోధన, పరిశ్రమ, ప్రజా భాగ‌స్వామ్యంపై దృష్టిసారిస్తుంది.

 

A diagram of a diagramAI-generated content may be incorrect.


 
ఆరోగ్య సంరక్షణలో ఏఐ
సాంకేతికతను ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపేలా ఉపయోగించడం ద్వారా, వివిధ ప్రజారోగ్య కార్యక్రమాలను మెరుగ్గా అమలు చేయడానికి ఏఐ తోడ్పడింది. నిరంతరంగా ఎదురయ్యే అభివృద్ధి సవాళ్లను సాంకేతిక పరిష్కారాల ద్వారా ఎలా అధిగమించవచ్చో మరియు అందరికీ సమానమైన, సంపూర్ణమైన సామాజిక అభివృద్ధిని ఎలా పెంపొందించవచ్చో ఇది నిరూపిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

2022 నుంచి 2025 వరకు నిపుణుల కొరతను అధిగమించడానికి, ముందస్తు ఆరోగ్య రక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, భారతదేశం ఏఐని ఒక సమగ్ర వ్యూహంగా మార్చుకుని తన ప్రజారోగ్య వ్యవస్థను ప్రాథమికంగా పునర్నిర్మించింది. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, జాతీయ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ప్రోగ్రామ్, మీడియా డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్‌లలో ఏఐ పరికరాలను ప్రవేశపెట్టడం ద్వారా నిపుణులు కాని వారు కూడా ఉన్నత స్థాయి స్క్రీనింగ్‌లు చేసేలా ప్రభుత్వం సాధికారత కల్పించింది. దీని ఫలితంగా క్షయవ్యాధి వల్ల కలిగే దుష్ప్రభావాలు 27% తగ్గాయి. 4,500 కంటే ఎక్కువ వ్యాధి వ్యాప్తి హెచ్చరికలను గుర్తించడం సాధ్యమైంది. ఈ మార్పు 'ఈ-సంజీవని' ద్వారా మరింత బలపడింది. ఇది ఏఐ సహాయంతో వ్యాధులను గుర్తించే విధానం ద్వారా 282 మిలియన్ల సంప్రదింపులకు సహకరించింది. అలాగే, పోషకాహార లోపాన్ని పర్యవేక్షించడానికి 'ఉద్యోగ్ యంత్ర' ఏఐ వ్యవస్థ తోడ్పడింది. అంటువ్యాధుల నిర్వహణ, క్యాన్సర్ కేర్ నుంచి, ఆయుర్వేద వైద్య విధానం, నేషనల్ వన్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ఆధునీకరించడం వరకు అన్నింటినీ కలుపుతూ ఒక సమగ్రమైన వ్యవస్థను ఇది సృష్టించింది.

A close-up of a hand touching a dna strandAI-generated content may be incorrect.



ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం(2022-2025) చేపట్టిన ఏఐ- ఆధారిత కార్యక్రమాలు:
ఆరోగ్య దృష్టి
ఏఐ ప‌రిష్కారం/ కార్య‌క్ర‌మం
ప్ర‌క్రియ‌, చికిత్స‌లో సాంకేతిక‌త అనుభ‌వం
చికిత్స‌/నిర్వాహ‌క ప్ర‌భావం


టీబీ నిర్వ‌హ‌ణ‌
ప్ర‌తికూల ఫ‌లితం అంచ‌నా
నివార‌ణ విశ్లేష‌ణ‌లు: చికిత్స విఫ‌ల‌మ‌య్యేందుకు ఎక్కువ ముప్పు ఉన్న రోగుల‌ను ఏఐ గుర్తిస్తుంది. ఇలాంటి వారికి వేగంగా చికిత్స మొద‌లుపెట్ట‌వ‌చ్చు.
దేశ‌వ్యాప్తంగా అమ‌లు త‌ర్వాత ప్ర‌తికూల ఫ‌లితాల్లో 27% త‌గ్గుద‌ల క‌నిపించింది.


టీబీ ట్రియేజ్‌
డీప్‌సీఎక్స్ఆర్‌(చెస్ట్ ఎక్స్‌-రే)
రేడియాలజీ ఏఐ: క్షయ వ్యాధి అనుమానిత కేసులలో నోడ్యూల్స్/కావిటీలను గుర్తించడానికి డిజిటల్ ఎక్స్-రేల ఆటోమేటెడ్ రీడింగ్.
8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అమలులో ఉంది; నిపుణుల కొరతను అధిగమించడానికి ప్రభుత్వానికి ఉచితంగా అందుబాటులో ఉంది.

మ‌ధుమేహం(డీఆర్)
మధునేత్రఏఐ
రెటినల్ ట్రయాజ్: నిపుణులు కాని వారు రెటినల్ ఫోటోలు తీస్తారు; అత్యవసర స్పెషలిస్ట్ రిఫరల్స్ కోసం ఏఐ వాటిని గ్రేడ్ చేస్తుంది.

38 కేంద్రాలలో 7,100 మంది రోగులు ప్రయోజనం పొందారు; డిసెంబర్ 2025లో భారత మొట్టమొదటి ఏఐ కమ్యూనిటీ స్క్రీనింగ్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.

టెలిమెడిసిన్
ఈసంజీవ‌ని సీడీఎస్ఎస్‌
డిఫరెన్షియల్ డయాగ్నోసిస్: రోగుల ఫిర్యాదులను క్రమబద్ధీకరిస్తుంది. ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ సిఫార్సులను అందిస్తుంది.
ఏప్రిల్ 2023 నుంచి నవంబర్ 2025 వరకు 282 మిలియన్ సంప్రదింపులు జరిగాయి; 1.20 కోట్ల‌ మంది ఏఐ సిఫార్సు చేసిన రోగనిర్ధారణల ద్వారా ప్రయోజనం పొందారు.


సాంప్రదాయ వైద్యం
ఆయుర్జెనోమిక్స్, ఆయుష్ గ్రిడ్‌
జెనోమిక్-ఆయుర్వేద హైబ్రిడ్: ప్రకృతి(శరీర తత్వం), పురాతన గ్రంథాల ఆధారంగా వ్యాధి గుర్తులను గుర్తించడానికి ఏఐని ఉపయోగిస్తుంది.
సాంప్రదాయ జ్ఞానంతో ఏఐని అనుసంధానించడంలో ప్రపంచ నమూనాగా డ‌బ్ల్యూహెచ్ఓ(జూలై 2025) చేత గుర్తింపు పొందింది.


క్యాన్సర్ సంరక్షణ
ఇమేజింగ్ బయోబ్యాంక్‌
డేటాబేస్ ఆర్ అండ్ డీ: 20,000 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ రోగుల ప్రొఫైల్‌ల(రేడియాలజీ/పాథాలజీ చిత్రాలు) డేటాబేస్‌ను నీతి ఆయోగ్ రూపొందిస్తోంది.
క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం, నిర్వహణ కోసం అధిక-క‌చ్చితత్వ ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులకు శక్తినిస్తుంది.

ఆరోగ్య మోసాలు
ఏబీ-పీఎంజేఏవై యాంటీ-ఫ్రాడ్
ఇంటెగ్రిటీ మేనేజ్‌మెంట్: ఏఐ/ఎంఎల్‌ అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తుంది. పీఎం-జేఏవై పథకంలో ఎప్ప‌టిక‌ప్పుడు మోసాలను అరికట్టడంలో సహాయపడుతుంది.
ఆరోగ్య పథకం పర్యవేక్షణను రియాక్టివ్ డిటెక్షన్ నుంచి ప్రోయాక్టివ్ మేనేజ్‌మెంట్‌కు మారుస్తుంది.

సర్వైలెన్స్(పర్యవేక్షణ)
మీడియా డిసీజ్ సర్వైలెన్స్(ఎండీఎస్‌)
ముందస్తు హెచ్చరిక: లక్షణాల సమూహాల(ఉదా. అపరిచిత జ్వరాలు) కోసం ఏఐ జాతీయ డిజిటల్ వార్తా మూలాలను స్కాన్ చేస్తుంది. ప్రాంతీయ వ్యాప్తిని నివారించడానికి ఏప్రిల్ 2022 నుండి 4,500 కంటే ఎక్కువ ఈవెంట్ అలర్ట్‌లను ప్రచురించింది.

ఏఐ సాధ‌నాలు సుర‌క్షిత‌మైన‌విగా, ప్రామాణిక‌మైన‌విగా ఉండేందుకు ప్ర‌భుత్వం ఒక ప్రాథ‌మిక స్థాయిని ఏర్పాటుచేసింది.

- కృత్రిమ మేధస్సు కోసం అత్యుత్తమ కేంద్రాలు: మార్చి 2025లో వీటిని కేటాయించారు. ఎయిమ్స్‌ ఢిల్లీ, పీజీఐఎంఈఆర్‌ చండీగఢ్, ఎయిమ్స్‌ రిషికేష్‌లు స్వదేశీ ఏఐ పరిష్కారాల అభివృద్ధిలో ముందున్నాయి. దీంతో పాటు ఆరోగ్య సంరక్షణలో ఏఐ సంబంధిత అభివృద్ధికి నాయకత్వం వహించడానికి బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ఉన్న విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సీఓఈ(టీఏఎన్‌యూహెచ్‌)తో ఎన్‌హెచ్ఏ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
- నేషనల్ ఫెడరేటెడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఉన్న భాగస్వాముల డేటాను ఉపయోగించి, ఏఐ హెల్త్ మోడల్స్‌ను పరీక్షించడానికి మరియు ధృవీకరించడానికి ఒక బహిరంగ వేదికను రూపొందించేందుకు అక్టోబర్ 14, 2024న ఎన్‌హెచ్ఏ, ఐఐటీ కాన్పూర్ మధ్య ఒప్పందం కుదిరింది.
- నైతిక పర్యవేక్షణ: వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా మరియు డేటా మార్పిడి సురక్షితంగా ఉండేలా చూడటానికి, అన్ని ఏఐ అప్లికేషన్లు ఐసీఎంఆర్‌ నైతిక మార్గదర్శకాలు(2023), ఎంఈఐటీవై ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలను అనుసరిస్తాయి.
- భారతదేశ ఆరోగ్య సంరక్షణలో ఏఐ వ్యూహం(స‌హి): ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య రంగానికి ప్రత్యేకించిన ఏఐ వ్యూహంపై పనిచేస్తోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ వ్యూహాన్ని సిద్ధం చేసింది.

 
మహారాష్ట్రలోని ఏటపల్లి జిల్లాలో 'ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్'ను పర్యవేక్షిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి.. ప్రభుత్వ భోజన పథకాలు అమలులో ఉన్నప్పటికీ విద్యార్థులలో స్పష్టమైన పోషకాహార లోపాలను గమనించారు. తోడ్సా ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన తనిఖీలో 27% మంది విద్యార్థులు పోషకాహార లోపంతో ఉన్నారని వెల్లడైంది. దీనికి పరిష్కారంగా పిల్లలకు అందించే ఆహారంలో మార్పులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ఆహారం అందుతుందో లేదో తనిఖీ  చేయడానికి ఒక ఏఐ-ఆధారిత యంత్రాన్ని ప్రవేశపెట్టారు. ఇది అత్యాధునిక 'ఇమేజ్ రికగ్నిషన్'  సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ యంత్రం ఆహారం ఉష్ణోగ్రత, రూపం వంటి సుమారు 2,100 రకాల అంశాలను విశ్లేషించగలదు.

ఈ యంత్రాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన విశ్లేషణలో చాలావరకు భోజనాలు ప్రభుత్వం నిర్ణయించిన మెనూకు అనుగుణంగా లేవని తేలింది. విద్యార్థులకు అందాల్సిన పండ్లు లేదా పోష‌కాలు ఉన్న ఆహార పదార్థాలు తరచుగా మిస్ అవుతున్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. ఆహారాన్ని సరిగ్గా ఉడికించకపోవడం, కూరగాయలను అతిగా ఉడికించడం, పాడైపోయిన పదార్థాలను వాడటం వల్ల పోషకాహార లోపాలు మరింత పెరిగాయని గుర్తించారు. ఈ ఏఐ-ఆధారిత యంత్రం అధికారులకు నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి, ఆహార సరఫరాదారుల జవాబుదారీతనాన్ని పెంచడానికి సహాయపడింది. దీనివల్ల పిల్లల పోషణలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. ఈ విజయవంతమైన నమూనాను జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో కూడా అమలు చేశారు.

ప్రాంతీయ ఓపెన్ డిజిటల్ హెల్త్ స‌ద‌స్సు 2025
ప్రాంతీయ ఓపెన్ డిజిటల్ హెల్త్ స‌ద‌స్సు 2025 నవంబర్ 19-20 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్ఏ), ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్ఈజీడీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం(ఎస్ఈఏఆర్ఓ), యూనిసెఫ్(యూనిసెఫ్‌) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఈ సమ్మిట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతం(ఎస్ఈఏఆర్) నుంచి విధానకర్తలు, సాంకేతిక నిపుణులు, ప్రజారోగ్య నాయకులు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. బలమైన పాలన, బహిరంగ ప్రమాణాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా భారతదేశం తన డిజిటల్ హెల్త్ వ్యవస్థను ఎలా బలోపేతం చేసిందో ఈ చర్చలు ప్రముఖంగా వివరించాయి. ఆరోగ్య సంరక్షణలో జెనరేటివ్ ఏఐ(జెన్ఏఐ) వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఏఐ-ఆధారిత పర్యవేక్షణ, వ్యాధి నిర్ధారణ, వ్యాధులను వేగంగా గుర్తించడం, వ్యాప్తిని ముందుగానే అంచనా వేయడం, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలతో పాటు ఇతర ఆరోగ్య కార్యక్రమాలలో ఏఐని అనుసంధానించడం గురించి చర్చించారు. ఈ సదస్సులో శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, తైమూర్-లెస్టే ప్రతినిధులతో పాటు డ‌బ్ల్యూహెచ్ఓ-సీఏఆర్ఓ, యూనిసెఫ్ సీనియర్ అధికారులు, సీఈఏఆర్‌ సభ్య దేశాల డిజిటల్ ఆరోగ్య ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఇండియాఏఐ మిషన్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు
2024 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఏఐని ఉపయోగించి భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రూ. 10,371.92 కోట్ల బడ్జెట్ వ్యయంతో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్‌ను ఆమోదించింది.

ఇండియాఏఐ మిషన్ చొరవలు ఏఐ- ఆధారిత ఆరోగ్య సంరక్షణ అనువర్తనాల్లో ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ మిషన్  మూలస్తంభాలలో ఒకటి ఇండియాఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్. ఈ పథకం ముఖ్యమైన జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభావవంతమైన ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, విస్త‌రించ‌డం, స్వీకరించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన, సమర్థవంతమైన ఏఐ- ఆధారిత ఆరోగ్య సంరక్షణ డెలివరీ ఈ చొరవ అనేక ఫలితాలలో ఒకటి.

2025 మార్చి నాటికి ఇండియాఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ కింద షార్ట్‌లిస్ట్ చేసిన ఆరోగ్య సంరక్షణ సంబంధిత ఏఐ పరిష్కారాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ప‌రిష్కారం పేరు
పరిష్కారం వివరణ
ద‌శ‌

నిడాన్
(స‌మీకృత ఊపిరితిత్తుల ఆరోగ్య ప‌రీక్ష‌లు, ఏఐ ద్వారా జాతీయ‌స్థాయిలో క్ష‌య నిర్ధార‌ణ‌)
ఛాతీ ఎక్స్ కిరణాలను(సీఎక్స్ఆర్‌) వివరించడానికి ఒక అధునాతన ఏఐ సాధనం క్యూఎక్స్ఆర్‌, 30+ ఫలితాలను గుర్తించి స్థానికీకరిస్తుంది.
ప‌రిష్కారం

ఎండ్ టు ఎండ్ ఏఐ
రేడియాలజీ కోసం క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌
రోగ నిర్ధారణ

రేడియాలజీ నిర్ధారణ కోసం ఏఐ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌, కంప్యూటర్ విజన్(సీవీ), జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డికామ్, మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వినూత్న సాంకేతికతలను సమగ్రపరచడం.
పరిష్కారం

ప్రభావవంతమైన ఏఐ
పరిష్కారం, నివారించదగినది
అంధత్వం, సామాజిక ఆర్థిక కోసం
పరివర్తన.
దృష్టిని బెదిరించే రెటీనా అసాధారణతలను ముందుగానే గుర్తించడం పరిష్కారం

మస్క్యులోస్కెలెటల్ కీళ్ల ఆరోగ్య నొప్పి గుర్తింపు & నిర్ధారణ ఏఐ పవర్డ్ ధరించగలిగే సాంకేతికత
కీళ్ల నొప్పుల నిర్ధారణ, ఆరోగ్య సంరక్షణ విభాగాల పునరావాసం కోసం ఏఐ ఆధారిత హార్డ్‌వేర్ వేదిక‌
పరిష్కారం

వోక్సెల్‌బాక్స్
మానవ మెదడు క్రియాత్మక పటాలు/కనెక్టోమిక్స్‌ను మ్యాప్ చేయడానికి అనుమతించే న్యూరో-ఇన్ఫర్మేటిక్స్ ప్లాట్‌ఫార్మ్‌
నమూనా అభివృద్ధి

ఒసెల‌క్స్ అభివృద్ధి: కంటి ప‌రీక్ష ద్వారా మ‌ధుమేహాన్ని ముందుగా గుర్తించ‌ద‌గిన ఏఐ ఆధారిత ప‌రిష్కారం

డయాబెటిక్ రెటినోపతి, వయసు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్ & గ్లాకోమా వంటి కంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి ఏఐ ఆధారిత పోర్టబుల్, సరసమైన, సులభంగా అందుబాటులో ఉండే రెటీనా ఇమేజింగ్ పరికరం.
నమూనా

వైద్యుల నేతృత్వంలో ఏఐ వినియోగం ద్వారా ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ విప్లవాత్మకం

ఏఐ-ఆధారిత వ్యక్తిగత వైద్యుడు 24x7 ఉచితంగా అందుబాటులో ఉంటాడు. ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి, ధరించగలిగే వస్తువుల ద్వారా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, వ్యాధులను నివారించడానికి ఆరోగ్య కోచ్‌గా వ్యవహరించడానికి రూపొందింది.

నమూనా


క్యాన్సర్ దశ, స్థానికీకరణ, మార్జిన్ల కోసం ఏఐ/ఎంఎల్‌తో కూడిన మాఫ్‌ప్రో పరికరం

మాఫ్‌ప్రో హ్యాండ్‌హెల్డ్ డిటెక్టర్ రేడియేషన్-రహిత, నాన్-ఇన్వాసివ్, సురక్షితమైన, ఖర్చు-సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది, ఇది ఏఐ/ఎంఎల్‌ ఆధారిత అల్గారిథమ్‌లను ఉపయోగించి లింఫ్‌నోడ్‌లలో మెటాస్టేజ్‌లను విశ్వసనీయంగా గుర్తించి తగినంతగా అంచనా వేయగలదు.

నమూనా


ఏఐ-సహాయక ఆరోగ్య సంరక్షణకు ప్రైవేట్ రంగం సహకారం
ప్రభుత్వ ప్రధాన ప్రజా విధాన థింక్ ట్యాంక్, నీతి ఆయోగ్, ప్రైవేట్ రంగం గణనీయమైన వినూత్న సహకారాన్ని గుర్తించింది. ఈ ఏఐ-ఆధారిత కార్యక్రమాలలో కొన్ని ఈ ది విధంగా ఉన్నాయి:

ఆరోగ్య దృష్టి
ఏఐ ప‌రిష్కారం/కార్య‌క్ర‌మం
సాంకేతికత & "చికిత్స" అనుభవం
క్లినికల్ / ఆపరేషన్ ప్రభావం


వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు
మైడిజీరికార్డ్స్(ఎండీఆర్‌)
రోగి యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్: టీకాలు మరియు మందుల రిమైండర్‌లతో సహా జీవితకాల ఆరోగ్య చరిత్రను నిర్వహించడానికి సురక్షితమైన మొబైల్ యాప్. హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు మరియు రక్తపోటును అంచనా వేయడానికి ముఖ వీడియో విశ్లేషణను ఉపయోగించే స్మార్ట్‌విటల్స్‌ను కలిగి ఉంటుంది.
40,000+ వినియోగదారులు; వేగవంతమైన క్లినికల్ సందర్భం కోసం 20+ ఆసుపత్రులు/క్లినిక్‌లు ఈ ప్లాట్‌ఫామ్‌ను సిఫార్సు చేస్తున్నాయి. సంరక్షణ కొనసాగింపును బలోపేతం చేయడానికి ఏబీడీఎం, ఏబీహెచ్ఏ ఐడీతో లింక్‌లు.



ప్రసూతి సంరక్షణ

కేర్‌ఎన్‌ఎక్స్

స‌మీకృత వ్య‌వ‌స్థ‌: గర్భిణుల గృహ-స్థాయి స్క్రీనింగ్‌ల(బీపీ, హిమోగ్లోబిన్, పిండం హృదయ స్పందన రేటు) కోసం ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉపయోగించే పోర్టబుల్ యాంటెనాటల్ కేర్ కిట్‌లు, వైర్‌లెస్ ఫీటల్ మానిటరింగ్(ఫెటోసెన్స్).

20+ రాష్ట్రాలలో 500,000+ తల్లులకు మద్దతు ఇచ్చింది. ఖర్చులను తగ్గించింది. నిర్వహణ ఖర్చులను తగ్గించింది.



నవజాత శిశువుల పర్యవేక్షణ

నెమోకేర్ రక్ష

ధరించగలిగే ఐఓటీ/ఏఐ: నవజాత శిశువులకు వైర్‌లెస్ సాక్ లాంటి ధరించగలిగే ప‌రిక‌రం హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు, రక్త ఆక్సిజన్ సంతృప్తత, శరీర ఉష్ణోగ్రతను నిరంతరం ట్రాక్ చేస్తుంది. వైర్‌లెస్ డేటా ట్రాన్స్‌మిషన్ ఒక నర్సు ఒకేసారి 40–50 మంది శిశువులను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది.

2022 నుంచి 20,000+ నవజాత శిశువులకు మద్దతు ఇచ్చింది



క్రిటిక‌ల్ కేర్‌

క్లౌడ్‌ఫిజిషియ‌న్‌


స్మార్ట్ ఐసీయూ-ఇన్-ఎ-బాక్స్: 24/7 పర్యవేక్షణ కోసం రిమోట్ ఐసీయూలను అనుసంధానించే కమాండ్ సెంటర్. వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరించడానికి ఏఐఆర్ఏ(ఎంఎల్‌- పవర్డ్ నోట్ అసిస్టెంట్), నేత్ర‌ (కంప్యూటర్ విజన్ టూల్)ను ఉపయోగిస్తుంది.

280 ఆసుపత్రులలో 130,000+ రోగులను ప్రభావితం చేసింది. డాక్యుమెంటేషన్ సమయాన్ని 40% తగ్గిస్తుంది.



కంటి వైద్యం

3నేత్రా

పోర్టబుల్ ఏఐ స్క్రీనింగ్: డయాబెటిక్ రెటినోపతి, కంటిశుక్లం, గ్లాకోమా వంటి రుగ్మతలకు ఆటోమేటెడ్ స్క్రీనింగ్ కోసం కంటి ముందు, వెనుక భాగాలను సంగ్రహించే తక్కువ-ధర, నాన్-మైడ్రియాటిక్ ఇమేజింగ్ పరికరం. 75+ దేశాలలో స్వీకరించిన ఇది 30 ల‌క్ష‌ల‌ మందిని పరీక్షించింది. అనవసరమైన నిపుణుల సిఫార్సులను 70% తగ్గించింది.



గుండె & శ్వాసకోశ

ఏఐస్టెత్

ఏఐ-శక్తితో కూడిన స్టెతస్కోప్: స్మార్ట్‌ఫోన్‌లో గుండె, ఊపిరితిత్తుల తరంగ రూపాలను దృశ్యమానం చేయడానికి ఏఐని ఉపయోగించి శరీర శబ్దాలను సంగ్రహించ‌డంతో పాటు డిజిటలైజ్ చేస్తుంది.

గుండె శబ్దాలు, శ్వాసకోశ సమస్యలను గుర్తించడంలో నిపుణులు కానివారికి సహాయపడుతుంది; రిమోట్ డయాగ్నస్టిక్స్, టెలి-కన్సల్టేషన్లకు ఉపయోగపడుతుంది.



అడ్వాన్స్‌డ్ రేడియాలజీ

క్యూర్‌.ఏఐ

స్మార్ట్ స్కాన్‌లు: డీప్ లెర్నింగ్ అల్గోరిథంలు ఛాతీ ఎక్స్-రేలు, సీటీ స్కాన్‌లను విశ్లేషించి, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వైఫల్యాలు వంటి 35+ ఫలితాలను సెకన్లలో గుర్తిస్తాయి.

1,000కిపైగా సైట్లలో ఉపయోగించబడుతోంది. ఏటా 15 మిలియన్ల మంది రోగులకు సేవలందిస్తోంది. క్యూర్‌.ఏఐ టీబీ గుర్తింపును 30% మెరుగుపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చులను తగ్గించింది. 125 మిలియన్ డాల‌ర్ల‌ నిధులను పొందింది. ఆరోగ్య సంరక్షణను వేగవంతం చేయడానికి, మరింత అందుబాటులోకి తీసుకురావడానికి డ‌బ్ల్యూహెచ్ఓ, ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కలిగి ఉంది.



రొమ్ము క్యాన్సర్

థర్మాలిటిక్స్

ఏఐ-థర్మల్ ఇమేజింగ్: ఉష్ణోగ్రత వైవిధ్యాల ఆధారంగా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి అధిక-రిజల్యూషన్ థర్మల్ సెన్సార్లు, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తుంది.

ఇది 29 భారతీయ నగరాలు మరియు విదేశాలలో 75,000+ మహిళలను పరీక్షించింది. నాన్-కాంటాక్ట్, రేడియేషన్-రహిత, గోప్యతకు అనుకూలమైనది.



ప‌ట్ట‌ణ నీటి నాణ్య‌త‌

బోసన్ వైట్‌వాటర్

మురుగునీటి శుద్ధి చేసిన నీటిని తాగడానికి యోగ్యమైన నాణ్యతగా మారుస్తున్న 11-దశల వడపోత వ్యవస్థ. ఇది ఏఐ/ఐఓటీ పర్యవేక్షణలో ఉంది.

65+ కోట్ల లీటర్ల రిక‌వ‌రీ జ‌రిగింది; ఈ.కోలి, కోలిఫాంలు, పురుగుమందులు, కలుపు సంహారకాలు, భారీ లోహాలు, వైరస్‌లను తొలగిస్తుంది.


 
పారిశుధ్యం & పరిశుభ్రత

ఏఐ వ్యర్థాల నిర్వహణ

వీడియో అనలిటిక్స్ & స్మార్ట్ బిన్‌లు: ఏఐ మోడల్‌లు ఇప్పటికే ఉన్న నగర సీసీటీవీ ఫీడ్‌లను ఉపయోగించి నిండిపోయిన చెత్త‌కుండీలను, బహిరంగ ప్రదేశాలలో చెత్తను గుర్తిస్తాయి.

వారణాసి, విశాఖపట్నం వంటి నగరాల్లో శుభ్రపరిచే సామర్థ్యంలో 20–30% మెరుగుదల; డెంగ్యూ వంటి వ్యాధి వాహకాలను తగ్గిస్తుంది.


భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో వస్తున్న ఈ ఏఐ మార్పులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాల వల్ల - అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) వల్ల సాధ్యమయ్యాయి. ఆగస్టు 2025 నాటికి ఇప్పటికే 799 మిలియన్ల డిజిటల్ హెల్త్ ఐడీలు సృష్టించబడ్డాయి. 4,10,000 కంటే ఎక్కువ నమోదిత ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, 6,70,000 కంటే ఎక్కువ మంది ఆరోగ్య నిపుణులు ఈ డిజిటల్ ఖ‌జానాలలో నమోదై ఉన్నారు. అలాగే, 671 మిలియన్లకు పైగా ఆరోగ్య రికార్డులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధానిత‌మ‌య్యాయి.

ఏబీడీఎం కింద ఆరోగ్య సేవలను అందించే విధానాన్ని మార్చడానికి ప్రైవేట్ రంగం వినూత్న పద్ధతులను ఉపయోగించేలా ప్రోత్సహించబడుతోంది. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన కొన్ని ఏఐ-ఆధారిత, ఏబీడీఎం-అనుసంధాన అప్లికేషన్లు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఆరోగ్య దృష్టి

ఏఐ ప‌రిష్కారం/కార్య‌క్ర‌మం

సాంకేతికత & "చికిత్స" అనుభవం

క్లినికల్/ఆపరేషన్ ప్రభావం



రోగి రికార్డులను సంగ్రహించడం

ఎకా డాక్

క్లినిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్: రోగుల ఆరోగ్య రికార్డులను నిర్వహించడానికి సురక్షితమైన యాప్, వీటిలో ట్రయాజింగ్, ప్రోటోకాల్ శోధన, వైద్యుల కోసం రోగి రికార్డులను సంగ్రహించడం మొదలైనవి ఉన్నాయి.

ఏబీడీఎం సంరక్షణ కొనసాగింపును బలోపేతం చేయడానికి అప్లికేషన్‌ను ప్రారంభించింది. 10 లక్షలకు పైగా రోగులను పరీక్షించడంలో, 17 లక్షలకు పైగా రికార్డులను సంగ్రహించడంలో మద్దతు ఇచ్చింది.



క్లినికల్ డాక్యుమెంటేషన్

ఈక్లినిక‌ల్‌వ‌ర్క్స్‌ ద్వారా సునోహ్.ఏఐ

వాయిస్ టెక్నాలజీతో వైద్యులు ఈ-ప్రిస్క్రిప్షన్‌ను రూపొందించడానికి వీలు కల్పించే ఏఐ ఆధారిత స్క్రైబింగ్ సాధనం.

ఏఐ ఉపయోగించి లక్షలాది ఈప్రిస్క్రిప్ష‌న్‌ల‌ను సృష్టించడంలో వైద్యులకు మద్దతు ఇస్తుంది.



క్లినికల్ డాక్యుమెంటేషన్

ఎకా స్క్రైబ్

వాయిస్ టెక్నాలజీతో వైద్యులు ఈ-ప్రిస్క్రిప్షన్‌ను రూపొందించడానికి వీలు కల్పించే ఏఐ ఆధారిత లిఖిత‌ సాధనం.

ఏఐ ఉపయోగించి 5 లక్షలకు పైగా ఈ-ప్రిస్క్రిప్ష‌న్‌ల‌ను సృష్టించడంలో మద్దతు.



ఏఐ ఆధారిత హెచ్ఎంఐఎస్‌

ఈ క్లినికల్ వర్క్స్

ఇమేజ్ రీడింగ్‌లో ఏఐ ఆటోమేషన్ ద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, క్లినికల్, డయాగ్నస్టిక్ వర్క్‌ఫ్లోలలో సహాయం చేయడానికి ఏఐ, ఎంఎల్‌ ఎంబెడెడ్ హెచ్ఎంఐఎస్‌ వ్యవస్థ.

219 ఆసుపత్రులలో 34 లక్షల ఏబీహెచ్ఏ లింక్డ్ హెల్త్ రికార్డులను సృష్టించింది.



స్మార్ట్ నివేదికలు

ఎకాకేర్

జీవితకాల ఆరోగ్య చరిత్రను నిర్వహించేటప్పుడు ఆరోగ్య రికార్డులను రూపొందించడానికి, సారాంశాలను రూపొందించడానికి ఏఐ/ఎన్ఎల్‌పీ సామర్థ్యాలతో వ్యక్తిగత ఆరోగ్య రికార్డు అప్లికేషన్‌లను ఏబీడీఎం ప్రారంభించింది.

1.3 కోట్లకు పైగా స్మార్ట్ నివేదికలను అందించింది.

ఏబీడీఎం లింక్డ్ హెల్త్ రికార్డులు



ఏఐ ఆధారిత హెచ్ఎంఐఎస్‌

ప్లస్91

పేషెంట్ నోట్స్, ప్రత్యేక క్లినికల్ మద్దతు ద్వారా వైద్యుడి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐ, ఎంఎల్‌తో కూడిన హెచ్ఎంఐఎస్‌ వ్యవస్థ.

6613 ఆసుపత్రులలో 4.24 కోట్ల ఏబీహెచ్ఏ లింక్డ్ హెల్త్ రికార్డులను సృష్టించింది.
 
 
కేర్ఎన్ఎక్స్‌ అనేది భారతదేశానికి చెందిన డిజిటల్ హెల్త్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్. ఇది కృత్రిమ మేధస్సు, మొబైల్ డయాగ్నస్టిక్స్, క్లౌడ్-ఆధారిత నిర్ణయ మద్దతు వ్యవస్థలను ఉపయోగించి నాణ్యమైన ప్రసూతి, మహిళల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 
ముగింపు
వివిధ వ్యాధులను గుర్తించడం, అట్టడుగు వర్గాల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం నుంచి, స్వచ్ఛమైన నీటిని అందించడం వరకు.. ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ వినూత్న ఉపయోగాలు 'మానవాళి కోసం ఏఐ' అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కీలకమైన మానవ సవాళ్లను పరిష్కరించడానికి, సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, వికసిత్ భారత్ @2047 దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.

 

***

(Explainer ID: 157580) आगंतुक पटल : 53
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Gujarati , Kannada , Malayalam