• Sitemap
  • Advance Search
Social Welfare

ఐఎఫ్ఎఫ్ఐ: ఫ్రేమ్‌ల‌లో లిఖించిన ప్ర‌యాణం

Posted On: 15 NOV 2025 3:47PM

కీల‌కాంశాలు


- న‌వంబ‌ర్ 20-28 మ‌ధ్య గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ 2025 జ‌రుగుతోంది. 1952 నుంచి ద‌క్షిణాసియాలో ఎఫ్ఐఏపీఎఫ్ గుర్తింపు పొందిన ఏకైక చ‌ల‌న‌చిత్రోత్స‌వ పోటీగా త‌న వార‌స‌త్వాన్ని ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగిస్తోంది.
- ఈ ఏడాది అంత‌ర్జాతీయ స‌హ‌కారాల‌కు జ‌పాన్‌(ప్ర‌ధాన దృష్టి క‌లిగిన దేశం), స్పెయిన్‌(భాగ‌స్వామ్య దేశం), ఆస్ట్రేలియా(స్టాట్‌లైట్ దేశం) నేతృత్వం వ‌హిస్తున్నాయి.
- ఇందులో పున‌రుద్ధ‌రించిన పాత చిత్రాలు, శ‌త‌వసంత ప్ర‌త్యేక‌మైన‌వి, క్యూరేటెడ్ గ్లోబ‌ల్ విభాగాలు, మొట్ట‌మొద‌టి ఐఎఫ్ఎఫ్ఐఈఎస్‌టీఏ, వేవ్స్ ఫిల్మ్ బ‌జార్‌కు విస్త‌ర‌ణ‌, తొలిసారి సినిమాఏఐ హాక‌థాన్ స‌హా కీల‌క అంశాలు ఉన్నాయి.
- ఐఎఫ్ఎఫ్ఐ 2025లో 81 దేశాల‌కు చెందిన 240 చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న ఉండటం ప్ర‌పంచ‌వ్యాప్త భాగ‌స్వామ్యాన్ని చాటుతోంది.

ప‌రిచ‌యం
1952 నుంచి ఫీచ‌ర్ చిత్రాల విభాగంలో ద‌క్షిణాసియాలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్స్ అసోసియేష‌న్‌(ఎఫ్ఐఏపీఎఫ్‌) గుర్తింపు పొందిన ఏకైక చ‌ల‌న‌చిత్రోత్స‌వంగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) నిలుస్తోంది. త‌ద్వారా ప్ర‌పంచ సినీ ప‌టంలో ఐఎఫ్ఎఫ్ఐ త‌న‌ స్థాయిని చాటుకుంటోంది. ప్ర‌పంచ‌లోని అత్యుత్త‌మ చిత్రాల‌ను భార‌తీయ ప్రేక్ష‌కుల‌కు అందించే ప్ర‌య‌త్నంగా ఇది మొద‌లైంది. ద‌శాబ్దాలుగా వివిధ‌ ఖండాలకు చెందిన‌ చ‌ల‌న‌చిత్ర నిర్మాత‌లు, సినీ ప్రియులు, సృజ‌నాత్మ‌క నిపుణుల‌కు శ‌క్తివంత‌మైన స‌మావేశ స్థ‌లిగా ఇది రూపాంత‌రం చెందింది.

ఈ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 20 నుంచి 28 వ‌ర‌కు గోవా న‌డిబొడ్డున మ‌రో ఉల్లాస‌భ‌రిత‌మైన ఎడిష‌న్‌గా చ‌ల‌న‌చిత్రోత్సం జ‌రుగుతోంది.

సంస్కృతులు క‌లిసిన‌ప్పుడు సినిమా గొప్ప‌గా వృద్ధి చెందుతునే విశ్వాసం ఐఎఫ్ఎఫ్ఐలో ప్ర‌ధాన‌మైన‌ది. ప్ర‌తి ఎడిష‌న్ సాంస్కృతికంగా గొప్ప‌వైన‌, విశిష్ఠ సినీ ప‌రిశ్ర‌మ నిపుణుల‌చే ఆలోచ‌నాత్మ‌కంగా రూపుదిద్దుకున్న వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ఒక్క చోట‌కు చేరుస్తోంది. ఉత్త‌మ క‌ళాత్మ‌క‌త‌కు ఈ ఉత్స‌వం విశ్వ‌స‌నీయ‌మైన వేదిక‌గా నిలుస్తోంది. ముఖ్యంగా ఇందులోని అంత‌ర్జాతీయ సినిమా విభాగం సంప్ర‌దాయాల‌ను స‌వాలు చేసే, క‌థ‌న‌శైలి ప‌ద‌జాలాన్ని విస్త‌రించే ర‌చ‌న‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. చ‌ల‌న‌చిత్రోత్స‌వం జ‌రిగే ఏడాదిలో అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన అంత‌ర్జాతీయ‌ చిత్రాల‌ను అందించాల‌నే ఐఎఫ్ఎఫ్ఐ నిబద్ధ‌త‌ను ఉత్స‌వం పున‌రుద్ఘాటిస్తోంది.



జాతీయ చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ‌(ఎన్ఎఫ్‌డీసీ), కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా(ఈఎస్‌జీ) క‌లిసి నిర్వ‌హంచే ఈ చ‌ల‌న‌చిత్రోత్సవం 2004లో గోవాను శాశ్వ‌త వేదిక‌గా మార్చుకుంది. సుంద‌ర‌మైన‌ గోవా స‌ముద్ర తీర నేప‌థ్యంతో స‌మ్మిళిత సాంస్కృతిక స్ఫూర్తి ఐఎఫ్ఎఫ్ఐని నిజంగా విల‌క్ష‌ణంగా మారుస్తోంది. ఈ ఉత్స‌వం భార‌త‌దేశ విస్తృత భావ‌న అయిన‌ ఏక్ భార‌త్‌, శ్రేష్ఠ భార‌త్‌ను ప్ర‌తిబింబిస్తోంది. విభిన్న‌మైన సినీ క్రియేట‌ర్లు, ప్రేక్ష‌కులు, క‌ళాత్మ‌క సంప్ర‌దాయాల‌ను ఒకే చోట‌కు చేరుస్తోంది. మ‌హిళా నేతృత్వంలోని సృజ‌నాత్మ‌క బృందాల భాగ‌స్వ‌మ్యం పెరుగుతుండ‌టం, యువ నిపుణుల హాజ‌రు అధిక‌మ‌వుతుండ‌టం, గిరిజ‌న‌, ఆదివాసీ క‌థ‌ల నుంచి ప్ర‌తినిధ్యం వ‌స్తుండ‌టం ద్వారా ఐఎఫ్ఎఫ్ఐ దేశం లోతైన‌, భిన్న‌మైన గొంతుల ప్ర‌తిబింబించేందుకు చోటు క‌ల్పిస్తోంది. ఈ స‌మ్మిళిత‌త్వం సృజ‌నాత్మ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంతో పాటు సంస్కృతి, అవ‌కాశం అంద‌రికీ అందుబాటులో ఉండాల‌నే భార‌త‌దేశ నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌తిద్వ‌నిస్తోంది.

ఐఎఫ్ఎఫ్ఐ 2025: ఆవిష్క‌ర‌ణ‌, స‌మ్మిళిత‌త్వం, ప్ర‌పంచ సినీ దృశ్యం
ఈ ఏడాది న‌వంబ‌ర్ 20 నుంచి 28 వ‌ర‌కు గోవాలో 56వ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వం జ‌రుగుతోంది. ఐఎఫ్ఎఫ్ఐకి పెరుగుతున్న ప్ర‌పంచ‌స్థాయిని ప్ర‌తిబింబించే విస్తృత‌మైన కార్య‌క్ర‌మం ఇది. ఈ ఎడిష‌న్‌లో కంట్రీ ఆఫ్ ఫోక‌స్‌గా జ‌పాన్‌తో చ‌ల‌న‌చిత్రోత్స‌వ అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాల‌ను బ‌లోపేతం చేస్తోంది. ఇందులో వివిధ రూపాల్లోని ఆరు స‌మ‌కాలీన జ‌ప‌నీస్ చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది. భాగ‌స్వామ్య దేశంగా స్పెయిన్‌, స్పాట్‌లైట్ కంట్రీగా ఆస్ట్రేలియా సైతం ఈ ఉత్స‌వంలో పాల్గొంటున్నాయి. ఈ దేశాల‌న్నీ ప్ర‌పంచ సంభాష‌ణ‌ను సుసంప‌న్నం చేసే చిత్రాలు, అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను తీసుకువ‌చ్చాయి.

కార్య‌క్ర‌మం స్థాయి, ప్రీమియ‌ర్‌, ఎంపిక‌లు

 


ఐఎఫ్ఎఫ్ఐ 2025 81 దేశాల నుంచి 240కి పైగా చిత్రాలను తీసుకువ‌స్తోంది. ఇందులో 13 వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్లు, 15 ఇంర్నేష‌న‌ల్ ప్రీమియ‌ర్లు, 44 ఏషియ‌న్ ప్రీమియ‌ర్లు. 127 దేశాల నుంచి 2,314 ద‌ర‌ఖాస్తులు రావ‌డం చ‌ల‌న‌చిత్రోత్స‌వానికి విస్త‌రిస్తున్న ప్ర‌పంచ ఖ్యాతిని ప్ర‌తిబింబిస్తోంది.

ప్రారంభ చిత్రం - బ్రెజిలియ‌న్ ద‌ర్శ‌కుడు గాబ్రియెల్ మస్కారో తీసిన ది బ్లూ ట్ర‌య‌ల్‌. ఇది 2025 బెర్లినేల్‌లో సిల్వ‌ర్ బియ‌ర్ గ్రాండ్ జ్యూరీ పుర‌స్కారాన్ని గెలుచుకుంది.

గాలా ప్రీమియ‌ర్స్ విభాగంలో 13 అంత‌ర్జాతీయ, 2 ఆసియా, 1 భార‌త చిత్రాలు, 2 ప్ర‌త్యేక షోకేస్ స్క్రీనింగ్‌లు స‌హా 18 చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఎర్ర తివాచీపై స్వాగ‌తం ప‌లికే కార్య‌క్ర‌మం ఉంటుంది.

అంత‌ర్జాతీయ పోటీలు & పుర‌స్కారాలు
మూడు ప్ర‌ధాన అంత‌ర్జాతీయ పోటీల్లో ఐదు ఖండాల‌కు చెందిన 32 చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది. త‌ద్వారా ఈ ఏడాది బాగా ఆద‌ర‌ణ పొందిన చిత్రాల‌ను మొద‌టిసారి భార‌తీయ ప్రేక్ష‌కుల ముందు తేవ‌డం జ‌రుగుతోంది. కేన్స్‌, బెర్లినేల్‌, వెనీస్‌, లోకార్నో, టీఐఎఫ్ఎఫ్‌, బుస‌న్‌, ఐఎఫ్ఎఫ్ఆర్‌లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలను సైతం ఐఎఫ్ఎఫ్ఐలో ప్ర‌ద‌ర్శిస్తారు. త‌ద్వారా అత్యుత్త‌మ స‌మ‌కాలీన చిత్రాల‌కు భార‌త‌దేశ ప్ర‌వేశ‌మార్గంగా త‌న పాత్ర‌ను బ‌లోపేతం చేసుకుంటోంది.

 



క్యూరేటెడ్ విభాగాలు
ఈ సంవ‌త్స‌రం డాక్యు-మాంటేజ్‌, ఫ్ర‌మ్ ది ఫెస్టివ‌ల్స్‌, రైజింగ్ స్టార్స్‌, మిష‌న్ లైఫ్‌, ఎక్స్‌ప‌రిమెంట‌ల్ ఫిల్మ్స్‌, రిస్టోర్డ్ క్లాసిక్స్‌, మాకాబ్రే డ్రీమ్స్‌, యునిసెఫ్‌, సినిమా ఆఫ్ ది వ‌ర‌ల్డ్ అనే తొమ్మిది క్యూరేటెడ్ విభాగాలు ఉన్నాయి. అంత‌ర్జాతీయ పోటీ, డెబ్యూ ఫీచ‌ర్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్ట‌ర్‌, ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడ‌ల్ స‌హా మొత్తం 15 పోటీ, క్యూరేటెడ్ విభాగాల‌ను ఐఎఫ్ఎఫ్ఐ స‌మ‌ర్పిస్తోంది.

శ‌తాబ్ది నివాళులు
భార‌తీయ సినీ చ‌రిత్రను ఉత్స‌వంగా జ‌రుపుకుంటూ గురుద‌త్‌, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘాట‌క్‌, పి.భానుమ‌తి, భూపెన్ హ‌జారికా, స‌లీల్ చౌద‌రి వంటి వారి శ‌త‌బ్దుల‌ను ఐఎఫ్ఎఫ్ఐ 2025 నిర్వ‌హిస్తోంది. ముసాఫిర్‌, సుబ‌ర్ణ‌రేఖ వంటి పున‌రుద్ధ‌రించిన క‌ళాఖండాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది.

ర‌జ‌నీకాంత్ స్వ‌ర్ణోత్స‌వం
50 సంవ‌త్స‌రాల సినీ జివితాన్ని పూర్తి చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను ఐఎఫ్ఎఫ్ఐ 2025 ఘ‌నంగా స‌త్క‌రిస్తోంది. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సంస్కృతిపై ఆయ‌న శాశ్వ‌త ప్ర‌భావాన్ని జ‌రుపుకునే మైలురాయి ఈ ఉత్స‌వం. ముగింపు వేడుక‌లో ర‌జినీకాంత్‌ను స‌త్క‌రించ‌నుంది. ఆయ‌న కృషి, విస్తృత ప్ర‌జాద‌ర‌ణ‌, ద‌శాబ్దాలుగా భార‌తీయ క‌థ‌లను రూపొందించ‌డంలో ఆయ‌న చేసిన కృషిని గుర్తిస్తారు.

ఇండియ‌న్‌ ప‌నోర‌మా, న్యూ హారిజాన్స్‌
ఇండియ‌న్‌ ప‌నోర‌మా 2025లో 25 ఫీచ‌ర్ చిత్రాలు, 20 నాన్ ఫీచ‌ర్ చిత్రాలు, 5 డెబ్యూ ఫీచ‌ర్ చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది. ప్రారంభ ఫీచ‌ర్‌ చిత్రంగా అమ‌ర‌న్‌(త‌మిళం), ప్రారంభ నాన్ ఫీచ‌ర్ చిత్రంగా కాకోరిని ప్ర‌ద‌ర్శిస్తారు.

 



న్యూ హారిజాన్స్ అనేక ప్ర‌త్యేక విభాగంలో స‌రికొత్త సినీ విధానాల ద్వారా  తెర‌కెక్కించిన ఐదు క్యూరెటేడ్ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది.

మ‌హిళా, తొలి, స‌రికొత్త ప్ర‌తిభ‌
ఈ ఏడాది ఐఎఫ్ఎఫ్ఐలో స‌మ్మిళిత‌త్వం కీల‌కంగా కొన‌సాగింది. మ‌హిళలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 50కి పైగా సినిమాలు, కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన 50కి పైగా సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపిక‌య్యాయి. ఉత్త‌మ నూత‌న భార‌తీయ ద‌ర్శ‌క పుర‌స్కారంగా రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి, ఉత్త‌మ వెబ్‌సిరీస్ పుర‌స్కారానికి రూ.10 ల‌క్ష‌ల బ‌హుమ‌తి ఉంటుంది.

రేప‌టి సృజ‌నాత్మ‌క మ‌న‌స్సులు
సీఎంఓటీ కార్య‌క్ర‌మం విస్త‌రిస్తూనే ఉంది. ఈ ఏడాది 799 ప్ర‌వేశాలు రాగా, 13 చిత్ర నిర్మాణ విభాగాల‌కు చెందిన 124 మంది ఎంపిక‌య్యారు. షార్ట్స్ టీవీతో 48 గంట‌ల చిత్ర నిర్మాణ స‌వాలు ప్ర‌ధానంగా నిలిచింది.

 


 


త‌ర‌గ‌తులు, చ‌ర్చ‌లు, జ్ఞానాన్ని పంచే కార్య‌క్ర‌మాలు
చ‌ల‌న‌చిత్రోత్స‌వంలో 21 మాస్ట‌ర్‌క్లాస్‌లు, ప్యానెల్ చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. విధువినోద్ చోప్రా, అనుప‌మ్ ఖేర్‌, క్రిస్టోఫెర్ చార్లెస్ కార్‌బౌల్డ్ ఓబీఈ, బాబీ డియోల్‌, ఆమీర్ ఖాన్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, పీటె డ్రాప‌ర్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్ వంటి క‌థార‌చ‌న‌, న‌ట‌న‌, ఎడిటింగ్‌, సినిమాటోగ్ర‌ఫీ, వీఎఫ్ఎక్స్‌, ఏఐ వంటి చిత్ర నిర్మాణ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పాల్గొంటారు.

ఈ ఏడాది ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు
వేవ్స్ ఫిల్మ్ బ‌జార్‌: ప్ర‌పంచ‌వ్యాప్త‌మ‌వుతున్న‌ భార‌త‌దేశ సృజ‌నాత్మ‌క విప‌ణి
భార‌తదేశ ప్ర‌ధాన చ‌ల‌న‌చిత్ర విప‌ణి ఇప్పుడు వేవ్స్ ఫిల్మ్ బ‌జార్‌కు రూపాంత‌రం చెందింది. దీనిని గ‌తంలో ఫిల్మ్ బ‌జార్‌గా పిలిచేవారు. 2007 నుంచి ఆసియాలో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన స‌హ‌-నిర్మాణ‌, కంటెంట్‌-ఆవిష్క‌ర‌ణ వేదిక‌ల్లో ఒక‌టిగా ఇది అభివృద్ధి చెందింది. ఐఎఫ్ఎఫ్ఐతో పాటు ఏడా నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మం భార‌తీయ ద‌ర్శ‌కులు, అంత‌ర్జాతీయ నిర్మాత‌లు, చ‌ల‌న‌చిత్రోత్స‌వ క్యూరేట‌ర్లు, సాంకేతిక భాగ‌స్వాములు, పెట్టుబ‌డిదారులు రేప‌టి చిత్రాల‌ను రూపొందించ‌డానికి స‌మావేశ‌మ‌య్యే వేదిక‌గా మారింది.

ఈ ఏడాది ఏం జ‌ర‌గ‌నుంది:
2025 న‌వంబ‌ర్ 20-24 మ‌ధ్య 19వ ఎడిష‌న్ జ‌రుగుతుంది. ఇది గ‌ణ‌నీయంగా విస్త‌రించిన‌, చురుకైన విప‌ణిని తీసుకొస్తోంది. ఈ సంవ‌త్స‌రం బ‌జార్ ప్ర‌పంచ‌స్థాయిలో త‌న ఉనికిని బ‌లోపేతం చేసుకుంటోంది.

అంత‌ర్జాతీయ నిధుల స‌మీక‌ర‌ణ‌, చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికైన చిత్రాలు స‌హా ఫీచ‌ర్లు, డాక్యుమెంట‌రీలు ప్ర‌దర్శించే దృఢ‌మైన స‌హ‌-నిర్మాణ విప‌ణి ఇది. స్క్రీన్ రైట‌ర్స్ ల్యాబ్‌, వ‌ర్క్‌-ఇన్‌-ప్రోగ్ర‌స్ ల్యాబ్‌, వేగంగా అభివృద్ధి చెందిన వ్యూయింగ్ రూమ్ వంటి వాటితో నిర్మాత‌లు, విక్ర‌య ఏజెంట్లు విభిన్న భాష‌లు, శైలుల‌లో కొత్త చిత్రాల‌ను గుర్తించేందుకు అవ‌కాశం ఉంటుంది.

పిచింగ్ సెష‌న్లు, దేశ‌, రాష్ట్రాల ప్ర‌ద‌ర్శ‌న‌లు, నిర్మాణం, పంపిణీ, స‌రికొత్త నిర్మాణ సాధ‌నాలు వంటి వాటిని చూపించేలా స‌రికొత్త‌గా నాలెడ్జ్ సిరీస్ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌త్యేక పెవీలియ‌న్లు, బృందాలు, స్టాళ్లు అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యాన్ని పెంపొందిస్తున్నాయి. భార‌త్‌లోని దాదాపు 10 రాష్ట్రాలు, అనేక భాగ‌స్వామ్య దేశాల కార్య‌క్ర‌మాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది.

సాంకేతిక‌త‌, స‌హ‌కారం, కొత్త ప్ర‌తిభ పెర‌గ‌డం ద్వారా వేవ్స్ ఫిల్మ్ బ‌జార్ ఐఎఫ్ఎఫ్ఐలో సృజ‌నాత్మ‌క మార్పిడీ కేంద్రంగా మారుతోంది. ఇక్క‌డ కొత్త ప్రాజెక్టు గుర్తింపు, భాగ‌స్వామ్యం ద్వారా సినీ రంగంలో త‌ర్వాతి త‌రం మొద‌టి విజేత‌ల‌ను పొందుతోంది,

ఐఎఫ్ఎఫ్ఐఈఎస్‌టీఏ
ఈ ఏడాది ఆరంగేట్రం చేస్తున్న ఐఎఫ్ఎఫ్ఐఈఎస్‌టీఏ 56వ ఎడిష‌న్‌కు శ‌క్తివంత‌మైన సంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని ప‌రిచ‌యం చేసింది. 2025 న‌వంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు గోవాలో సంగీతం, లైఫ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. గొప్ప సౌండ్‌, స్టేజ్‌తో కూడిన వేడుకగా రూపొందింన‌ ఈ ఉత్సవం ప్రేక్షకులకు సమకాలీన భార‌తీయ‌ సంగీతం నుండి శాస్త్రీయ కళాత్మకత, ప్రత్యక్ష థియేట్రికల్ క్షణాల వరకు అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది. యువ ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన ప్రదర్శనకారులు, విభిన్న శైలులను క‌ల‌ప‌డం ద్వారా ప్ర‌జ‌లు పాల్గొనే, ఆహ్లాదంగా గ‌డిపే, సాంస్కృతిక అనుభూతి పొందే వాతావరణాన్ని సృష్టించడం ఐఎఫ్ఎఫ్ఐఈఎస్టిఎ లక్ష్యంగా పెట్టుకుంది.

వేడుక వివ‌రాలు
తేదీ
కార్య‌క్ర‌మం
వివ‌రాలు

2025 న‌వంబ‌ర్ 21
2025 న‌వంబ‌ర్ 22
2025 న‌వంబ‌ర్ 23
2025 న‌వంబ‌ర్ 24

ఓషో జైన్ లైవ్ క‌న్స‌ర్ట్‌
ఫెస్టివ‌ల్ షోకేస్‌
ఫెస్టివ‌ల్ షోకేస్‌
ఫెస్టివ‌ల్ షోకేస్‌

మొద‌టిరోజు ప్ర‌ద‌ర్శ‌న‌
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్‌(భార‌త్‌, అంత‌ర్జాతీయ‌), సుర‌న్ కా ఎక‌ల‌వ్య‌, వాహ్ ఉస్తాద్‌
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్‌(భార‌త్‌, అంత‌ర్జాతీయ‌), సుర‌న్ కా ఎక‌ల‌వ్య‌, వాహ్ ఉస్తాద్‌, దేవాంచ‌ల్ కి ప్రేమ్‌క‌థ‌
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్‌(భార‌త్‌, అంత‌ర్జాతీయ‌), సుర‌న్ కా ఎక‌ల‌వ్య‌, వాహ్ ఉస్తాద్‌

సినిమాఏఐ హాక‌థాన్‌
జాతీయ చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ‌(ఎన్ఎఫ్‌డీసీ), ఎల్‌టీఐమైండ్‌ట్రీ భాగ‌స్వామ్యంతో వేవ్స్ ఫిల్మ్ బ‌జార్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 56వ ఎడిష‌న్‌లో భాగంగా ఏర్పాటుచేసిన సినిమాఏఐ హ్యాక‌థాన్ మొట్ట‌మొద‌టి ఏఐ ఫిల్మ్ హ్యాక‌థాన్‌. ఇది క‌థ చెప్ప‌డంలో క‌ళ‌, సాంకేతిక‌త‌, నైతిక ఆవిష్క‌ర‌ణ‌ను ఒక్క‌చోట‌కు చేరుస్తోంది.

ఈ ఏడాది ఏం జ‌ర‌గ‌నుంది
ప్ర‌పంచ‌వ్యాప్తంగా 18 ఏళ్ల‌కు పైబడిన వ్య‌క్తులు, బృందాలు(ఐదుగురు స‌భ్యుల వ‌ర‌కు) హ్యాక‌థాన్ తెరిచి ఉంటుంది. 2025 న‌వంబ‌ర్ 1న ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌య్యాయి. న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు. న‌వంబ‌ర్ 16న ఎంపికైన బృందాల ప్ర‌క‌ట‌న‌.
ఎంపిక చేసిన 10 బృందాలు ఐఎఫ్ఎఫ్ఐ సంద‌ర్భంగా క్రియేటీవ్ స్ప్రింట్‌లో పాల్గొంటాయి(న‌వంబ‌ర్ 20న ఇతివృత్తం ప్ర‌క‌ట‌న‌). ప్ర‌తి బృందం క‌థ‌ను రాసుకొని పూర్తిగా ఏఐ సాధ‌నాల‌ను వినియోగించి 1-2 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించి, ఎడిట్ చేయాల్సి ఉంటుంది.

గుర్తింపు & పుర‌స్కారాలు
విభాగం
న‌గ‌దు బ‌హుమతి
ఉత్త‌మ ఏఐ చల‌న‌చిత్రం
వినూత్నంగా ఏఐ వినియోగం
బెస్ట్ స్టోరీటెల్లింగ్‌
ఉత్త‌మ విజువ‌ల్స్‌
ఉత్త‌మ సౌండ్‌/మ్యూజిక్ డిజైన్‌

గెలిచిన చిత్రాలు గోవాలోని ఐఎఫ్ఎఫ్ఐలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతాయి. ఎన్ఎఫ్‌డీసీ, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వేదిక‌ల‌పై ఉంటాయి.

ఐఎఫ్ఎఫ్ఐ ప్ర‌యాణం: జ్ఞాప‌కాలు, ప‌రిణామ‌క్ర‌మం
భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన కొత్త‌లోనే 1952లో దేశ స్వాత్యంత్య్ర పోరాట విలువ‌లైన న్యాయం, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, సౌభ్రాతృత్వం, అహింస‌, భిన్నత్వంలో ఏక‌త్వం, సంఘీభావ స్వ‌రూపంగా ఐఎఫ్ఎఫ్ఐ ఏర్పాటైంది. భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని చ‌ల‌న‌చిత్ర విభాగం నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం వ‌సూధైవ కుటుంబం అనే త‌త్వాన్ని క‌లిగి ఉంది. అహింస‌, శాంతియుత స‌హ‌జీవ‌నం అనే భార‌తీయ భావ‌న‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

1952 జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 1 వ‌ర‌కు ముంబైలో ప్రారంభ ఎడిష‌న్ జ‌రిగింది. ఇందులో సుమారు 40 ఫీచ‌ర్ చిత్రాలు, 100 చిన్న చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. త‌ర్వాత మ‌ద్రాస్‌, ఢిల్లీ, క‌ల‌క‌త్తాలో ఈ వేడుక జ‌రిగింది. ద‌క్షిణాసియాలోనే ప్ర‌ధాన సినీ కార్య‌క్ర‌మంగా ప్ర‌పంచ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో ఒక‌టిగా ప్ర‌వేశించింది.

1952లో ప్రారంభ‌మైన నాటి నుంచి ఐఎఫ్ఎఫ్ఐ భార‌త‌దేశంలో అతిపెద్ద సినీ కార్య‌క్ర‌మం. త‌ర్వాత న్యూఢిల్లీలోనూ ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 1965లో 3వ ఎడిష‌న్ నుంచి ఈ కార్య‌క్ర‌మం ఐఎఫ్ఎఫ్ఐ పోటీగా మారింది. 1975లో వివిధ చిత్ర‌నిర్మాణ న‌గ‌రాల్లో ప్ర‌త్యామ్నాయ సంవ‌త్స‌రాల్లో జ‌రిగేలా పోటీలేని ఉత్స‌వంగా చ‌ల‌న‌చిత్రోత్స‌వం మొద‌లైంది. త‌ర్వాత చ‌ల‌న‌చిత్రోత్స‌వాలు ఐఎఫ్ఎఫ్ఐలో విలీన‌మ‌య్యాయి. 2004లో ఈ ఉత్స‌వానికి గోవా శాశ్వ‌త నివాసంగా మారింది. ప్ర‌తియేటా పోటీత‌త్వంతో కూడిన వేడుక‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.

ఐఎఫ్ఎఫ్ఐ వ్యూహాత్మ‌క ప్ర‌భావం: సినిమా, సంస్కృతి, వాణిజ్యాన్ని న‌డిపిస్తున్న కార్య‌క్ర‌మం
ఆసియాలో పురాత‌న‌, భార‌త‌దేశ ప్ర‌ధాన సినీ వేదిక‌గా ఐఎఫ్ఎఫ్ఐ ప‌రిణామం చెందింది. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, గోవా ప్ర‌భుత్వ స‌హ‌కారంతో భార‌తీయ సినిమాలో దౌత్యం, పరిశ్ర‌మ వృద్ధి, సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌ను ముందుకు న‌డిపిస్తోంది. త‌ద్వారా అనేక ర‌కాలుగా ఐఎఫ్ఎఫ్ఐ ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది:

సాంస్కృతిక ప్రాముఖ్య‌త‌: భార‌త‌, ప్ర‌పంచ సినిమాకు వార‌ధి
ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా కేవ‌లం ఒక స్క్రీనింగ్ వేదిక కంటే ఎక్కువ‌గా ఇది ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉన్న వేదిక‌గా భార‌తీయ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తోంది. భార‌తీయ సినిమాను ప్ర‌పంచానికి అనుసంధానం చేయాల‌నే, ప్ర‌పంచ సినిమాను భార‌త్‌కు తీసుకురావాల‌నే సంక‌ల్పంతో వివిధ సంస్కృతులు, శైలులు, భాష‌ల చిత్రాల గుర్తింపు, ప్రోత్సాహం, స‌హ‌కారం కోసం ఐఎఫ్ఎఫ్ఐ ప‌నిచేస్తోంది. వ‌సుధైవ కుటుంబం(ప్ర‌పంచ‌మంతా ఒకే కుటుంబం) అనే నిఆదంతో స్థిరంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఉత్స‌వం భార‌తీయ సినిమా, ప్ర‌పంచ సినిమా అనుసంధానాన్ని సుల‌భ‌త‌రం చేస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త‌దేశ దౌత్య‌, వాణిజ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో సినిమాలో విజ‌య‌వంతంగా ప‌నిచేస్తున్నాయి. భార‌త‌దేశ శ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌డంలో, కొత్త అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో సినిమాల పాత్ర కీల‌కం. భార‌త్ 20కి పైగా భాష‌ల‌లో ఏటా 2,000 కంటే ఎక్కువ చిత్రాల‌ను నిర్మిస్తోంది. ఇది ప్ర‌పంచంలోనే ఎక్కువ‌.

చ‌ల‌న‌చిత్ర విప‌ణి, స‌హ నిర్మాణ అవ‌కాశాలు
ఐఎఫ్ఎఫ్ఐతో పాటు 2007 నుంచి జ‌రుగుతున్న వేవ్స్ ఫిల్మ్ బ‌జార్‌.. స‌హ నిర్మాణ విప‌ణి, వ‌ర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్‌లు, వ్యూయింగ్ రూమ్‌లు, నెట్‌వ‌ర్కింగ్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇవి చ‌ల‌న‌చిత్రోత్స‌వ దృష్టిని ఆర్థిక‌, పంపిణీ, వ్యూహాల వైపు మ‌ళ్లిస్తోంది. ఫిల్మ్ బ‌జార్‌లో చోటు ద‌క్కించుకున్న భార‌తీయ సినిమాలకు నేరుగా స‌హ నిర్మాణ‌, విక్ర‌య‌, అంత‌ర్జాతీయ ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శ‌న అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌ద్వారా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు, ఆర్థిక మార్గాల‌కు క‌ల్పిస్తోంది. భార‌తీయ ప్ర‌ధాన చ‌ల‌న‌చిత్ర విప‌ణి అయిన‌ 19వ ఎడిష‌న్ వేవ్స్ ఫిల్మ్ బ‌జార్ దాదాపు 300 చిత్రాల‌ను స‌హ‌నిర్మాణం, పంపిణీ అవ‌కాశాల‌కు అందిస్తోంది. విజ‌యం సాధించిన సంస్థ‌ల‌కు 20 వేల డాల‌ర్ల విలువైన న‌గ‌దు బ‌హుమ‌తులు అందిస్తోంది.

ఏబీజీసీ-ఎక్స్ఆర్ ప‌రిశ్ర‌మ అభివృద్ధి
ఐఎఫ్ఎఫ్ఎఐలోని ప్ర‌త్యేక సాంకేతిక పెవీలియ‌న్స్ వీఎఫ్ఎక్స్‌, యానిమేష‌న్‌, సీజీఐ వంటి ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధానంగా చూపిస్తోంది. ఇది చ‌ల‌న‌చిత్రోత్స‌వ సాంకేతిక సృజ‌నాత్మ‌క‌త ఇతివృత్తానికి అనుగుణంగా ఉంటుంది. మీడియా, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏవీజీసీ(యానిమేష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్, గేమింగ్‌, కామిక్స్‌), ఎక్స్ఆర్‌(ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగాల్లోని అంకుర సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ వేవ్స్ కార్య‌క్ర‌మం కింద ఉండే వేవ్స్ ఎక్స్.. ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.

ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగానికి జాతీయ స్థాయి సెంట‌ర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటీవ్ టెక్నాల‌జీస్‌(ఐఐసీటీ) ఉంది. ఎన్‌విడియా, గూగుల్‌, అడోబ్‌, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అంత‌ర్జాతీయ ప‌రిశ్ర‌మ దిగ్గ‌జాల‌తో భాగ‌స్వామ్యాల‌తో యానిమేష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, చ‌ల‌న‌చిత్ర‌, ఎక్స్‌టెండెడ్ రియాలిటీలో ఆవిష్క‌ర‌ణ‌లు, ప‌రిశోధ‌న‌, అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం ఈ సంస్థ ల‌క్ష్యం.

గోవాలో ప‌ర్యాట‌క‌, ఆర్థిక ప్ర‌భావం
గోవా శాశ్వ‌త వేదిక కావడంతో ఐఎఫ్ఎఫ్ఐ స్థానిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్రేరేపించ‌డంతో పాటు అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా ప‌ర్యాట‌కాన్ని పెంపొందిస్తోంది. గోవాలో చ‌ల‌న‌చిత్రాల చిత్రీక‌ర‌ణ‌కు అన్ని ప్ర‌క్రియ‌లు, అనుమ‌తుల‌ను సింగిల్ విండో సిస్ట‌మ్‌లో అందించేలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా చొర‌వ చూపుతోంది. ప్ర‌తియేటా గోవాలో అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వం జ‌ర‌గ‌డం చ‌ల‌న‌చిత్ర ప‌ర్యాట‌కాన్ని గ‌ణ‌నీయంగా ప్రోత్స‌హిస్తోంది. ఐఎఫ్ఎఫ్ఐ, గోవా అనుసంధాన‌మై ఉన్నాయ‌ని, ఈ చ‌ల‌న‌చిత్రోత్స‌వం ప్ర‌తియేటా ప్ర‌ధాన కార్య‌క్ర‌మంగా మారుతోంద‌ని, దీనిని ప్ర‌పంచ‌స్థాయి అనుభవంగా మార్చ‌డానికి ప్ర‌తియేటా మౌలిక స‌దుపాయాల‌ను ఆధునికీకరిస్తున్నామ‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ పేర్కొన్నారు.

ముగింపు
ఐఎఫ్ఎఫ్ఐ 56వ ఎడిష‌న్ ప్రారంభానికి సిద్ధ‌మ‌వుతున్నందున ఈ ఉత్స‌వం వార‌స‌త్వం, ఆవిష్క‌ర‌ణ‌ల కూడలిగా నిలుస్తోంది. దిగ్గ‌జ చిత్రాల‌ను ఉత్స‌వంగా జ‌రుపుకోవ‌డం నుంచి కొత్త గొంతుల‌ను వినిపించ‌డం వ‌ర‌కు, పున‌రుద్ధ‌రించిన అల‌నాటి మేటి చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న నుంచి ఏఐ ఆధారిత సృజ‌నాత్మ‌క‌త అవ‌కాశాల‌ను స్వీక‌రించ‌డం వ‌ర‌కు, స్టోరీటెల్లింగ్‌లో గ‌తం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్తు క‌లిసే వేదిక‌గా ఐఎఫ్ఎఫ్ఐ త‌న పాత్ర‌ను చాటుకుంటోంది. విస్తృత కార్య‌క్ర‌మాలు, ప్ర‌పంచ భాగ‌స్వామ్యాలు, మొట్ట‌మొద‌టి ఐఎఫ్ఎఫ్ఐఈఎస్‌టీఏ ద్వారా సాంస్కృతిక కోణంతో ఈ సంవ‌త్స‌రం ఉత్స‌వం ప్రేక్ష‌కులకు వీక్ష‌ణ అనుభ‌వానికి మించి అందిస్తోంది. స‌జీవ‌మైన‌, అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక ప్ర‌యాణంలో భాగ‌స్వామ్యాన్ని క‌ల్పిస్తోంది.

క‌ళాకారులు, ప్రేక్ష‌కులు, దర్శ‌కులు, స‌మూహాల‌ను ఐఎఫ్ఎఫ్ఐ ఒకేచోట‌కు చేరుస్తోంది. స‌రిహ‌ద్దులు, భాష‌లు, ఊహ‌ల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌ను అనుసంధానించ‌డంలో సినిమా అనే శాశ్వ‌త శ‌క్తికి ఐఎఫ్ఎఫ్ఐ నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. గోవా మ‌రో చిర‌స్మ‌ర‌ణీయ ఎడిష‌న్‌ను నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నందున ఈ ఉత్స‌వం ఆశావాదం, సృజ‌నాత్మ‌క‌త‌, ప్ర‌ద‌ర్శితం కానున్న సినిమాల‌పై అచంచ‌ల‌మైన విశ్వాసంతో ఎదురుచూస్తోంది.

 

***

(Explainer ID: 156211) आगंतुक पटल : 38
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , English , Gujarati , Urdu , Nepali , हिन्दी , Punjabi , Kannada