Rural Prosperity
క్యాచ్ ది రెయిన్
प्रविष्टि तिथि:
26 OCT 2026 11:16 AM
జల సంరక్షణకు మరోసారి జాతీయ పిలుపు
క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం సంక్షిప్త పరిచయం
వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల రీచార్జ్, జల వనరుల పునరుద్ధరణపై దృష్టి సారించిన దేశవ్యాప్త కార్యక్రమం క్యాచ్ ది రెయిన్. వర్షపు నీటిని సంరక్షించేందుకు, జల భద్రతను బలోపేతం చేసేందుకు ప్రజలను, సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. వర్షాకాలంలో సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు చెరువులు, జలాశయాలను శుభ్రం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు అటవీకరణకు కూడా ప్రాధాన్యమిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా సూచించిన ప్రధాన జల సంరక్షణ చర్యలు:
- ఇళ్లు, నివాస సముదాయాలు, పని ప్రదేశాల్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.
- అనువైన ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు, రీచార్జ్ షాఫ్టులను ఏర్పాటు చేయాలి.
- వినియోగంలో లేని బోరుబావులకు మరమ్మతులు చేసి, భూగర్భ జలాల రీచార్జ్‌కు ఉపయోగించాలి.
- మెట్ల బావులు, బావులు, సంప్రదాయ జల వనరులను పునరుద్ధరించాలి.
- నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చెరువులు, జలాశయాల్లో పూడిక తీయాలి.
- నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, భూగర్భ జలాల రీచార్జ్ ప్రాంతాల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్‌జేబీ) 1.0 (2024)
జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 బలోపేతం చేసింది. జేఎస్‌జేబీ 1.0ను 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మే 31 వరకు అమలు చేశారు. ఈ కార్యక్రమం కమ్యూనిటీ (సమాజం), సీఎస్‌ఆర్, కాస్ట్ (ఖర్చు) - మూడు ‘సీ’ల సూత్రాలను అనుసరించింది. జల సంరక్షణ చర్యలను వేగవంతం చేసేందుకు అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలతో సమన్వయాన్ని పెంచింది. తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల రీచార్జ్, నీటి నిల్వ నిర్మాణాల ఏర్పాటును ప్రోత్సహించింది. నిరుపయోగంగా ఉన్న బోరుబావుల పునరుద్ధరణకు, స్థానిక పరిస్థితులకు తగిన పరిష్కారాలకు కూడా తోడ్పడింది. ప్రభుత్వ వ్యవస్థ అంతా, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేసే విధానంలో ఈ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 10 లక్షలకు పైగా భూగర్భ జలాల రీచార్జ్ నిర్మాణాలను ఏర్పాటు చేయగా, 27 లక్షలకు పైగా కృత్రిమ రీచార్జ్ నిర్మాణాలు ఏర్పాటైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
జల్ సంచయ్ జన్ భాగీదారీ 2.0 (2025)
2025 జూన్ 1న ప్రారంభమైన జల్ సంచయ్ జన్ భాగీదారీ 2.0.. అంతకుముందటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ముఖ్యంగా భూగర్భ జలాలను అతిగా వినియోగిస్తున్న జిల్లాల్లో, భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న జిల్లాల్లో రీచార్జ్‌పై దృష్టి సారించింది. ఈ విధానం తక్కువ ఖర్చుతో, అత్యంత స్థానిక స్థాయిలో చేపట్టే చర్యలకు ప్రాధాన్యమిచ్చింది. 2025 నవంబర్‌లో జరిగిన 6వ జాతీయ జల పురస్కారాల సందర్భంగా జేఎస్‌జేబీ 1.0 కింద విశేష కృషి చేసినవారికి గుర్తింపు లభించింది.
జేఎస్‌జేబీ కార్యక్రమం ప్రభావ మదింపు, సాధించిన ఫలితాలు
జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్‌జేబీ) కార్యక్రమం కింద 1.55 కోట్లకు పైగా కృత్రిమ రీచార్జ్, నీటి నిల్వ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. జేఎస్‌జేబీ 1.0 ప్రభావంపై ఒక అధ్యయనాన్ని కూడా నిర్వహించారు. 2025 జూన్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య వర్షపాతం గణాంకాల ఆధారంగా 23 లక్షల నిర్మాణాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ చర్యలతో 2.43 బిలియన్ ఘన మీటర్ల మేర భూగర్భ జలాల రీచార్జ్ జరిగినట్లు అధ్యయనం అంచనా వేసింది.
జల్ సంచయ్ జన్ భాగీదారీ: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌జేబీ: సీటీఆర్) (2026)
2026 జూన్ 1న ప్రారంభమైన కార్యక్రమం, జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంతో అనుసంధానం ద్వారా జేఎస్‌జేబీ విధానాన్ని విస్తరించింది. వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల రీచార్జ్, జల సంరక్షణ, జల సంబంధిత ఆస్తుల కల్పన, ప్రజల భాగస్వామ్యంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. స్థానిక పరిస్థితులకు తగిన, తక్కువ ఖర్చుతో చేపట్టే చర్యలను ప్రోత్సహిస్తూ, సుస్థిర జల నిర్వహణ ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచింది.
వీబీ-జీ రామ్ జీ, పీఎం కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్, పీఎంకేఎస్‌వై కింద రిపేర్, రెనొవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, కాంపా, ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వంటి పలు ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, మహిళా సంఘాలు, యువత, విద్యా సంస్థలు, పౌర సమాజ సంస్థలు, స్థానిక ప్రజలను ఈ కార్యక్రమం ఒక వేదికపైకి తీసుకొచ్చింది. ఈ భాగస్వాములు ప్రణాళికల రూపకల్పన, అమలు, ప్రజల నేతృత్వంలో జల సంరక్షణకు తోడ్పడుతున్నారు. జేఎస్‌జేబీ: సీటీఆర్ పోర్టల్, మొబైల్ యాప్ పారదర్శకతను, పర్యవేక్షణను బలోపేతం చేయడంలో, ప్రజల అభిప్రాయాలను స్వీకరించడంలో కీలక పాత్ర పోషించాయి.
జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ (జేఎస్‌ఏ: సీటీఆర్)
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా 2021 మార్చి 22న జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ ప్రారంభమైంది. దీని ప్రధాన నినాదం: “క్యాచ్ ది రెయిన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్.” వర్షపు నీటి సేకరణను ప్రోత్సహించేందుకు 256 జిల్లాల్లో నీటి కొరత ఉన్న 1,592 బ్లాకుల్లో అమలు చేసిన జల్ శక్తి అభియాన్ 2019 విజయాలను పునాదిగా చేసుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ప్రజా ఉద్యమ విధానంతో భూగర్భ జలాల రీచార్జ్, వాటర్‌షెడ్ అభివృద్ధి, జల వనరుల పునరుద్ధరణ, అటవీకరణ, ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించింది. అప్పటి నుంచి ప్రధాన అంశాలు, ప్రాధాన్య రంగాల్లో మార్పులతో ఏటా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు:
|
సంవత్సరం
|
ప్రధాన అంశం / ప్రాధాన్యం
|
ప్రధాన కార్యకలాపాలు
|
|
2021
|
క్యాచ్ ది రెయిన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్
|
వర్షపు నీటి సేకరణ & జల సంరక్షణ; జల వనరులకు జియో-ట్యాగింగ్; శాస్త్రీయ జల సంరక్షణ ప్రణాళికల రూపకల్పన; జల్ శక్తి కేంద్రాలు, అవగాహన కార్యక్రమాలు
|
|
2022
|
జల సంరక్షణ కార్యక్రమాల విస్తరణ
|
సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ; భూగర్భ జలాల రీచార్జ్, వాటర్‌షెడ్ అభివృద్ధి; చిత్తడి నేలలు, నదుల పునరుద్ధరణ; సహజ ఊటలకు నీరందించే ప్రాంతాల అభివృద్ధి, నీటి పరీవాహక ప్రాంతాల రక్షణ
|
|
2023
|
తాగునీటి వనరుల సుస్థిరత
|
నీటి కొరత ఉన్న 150 జిల్లాలపై దృష్టి; తాగునీటి వనరుల బలోపేతం; భూగర్భ జలాల రీచార్జ్, నీటి వనరుల సుస్థిరత; క్షేత్రస్థాయి పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం
|
|
2024
|
నారీ శక్తి సే జల్ శక్తి
|
మహిళల నేతృత్వంలో జల సంరక్షణ కార్యక్రమాలు; జల వనరుల్లో పూడికతీత, శుభ్రపరిచే పనులు; రీచార్జ్ కోసం నిరుపయోగంగా ఉన్న బోరుబావుల పునరుద్ధరణ; అటవీకరణ, స్థానిక జల వనరుల పునరుద్ధరణ
|
2024 కార్యక్రమం మహిళల నేతృత్వంలోని జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యమిచ్చింది. జల సంరక్షణ, పారిశుధ్యం, పరిశుభ్రత రంగాల్లో వారి విశేష కృషికి స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ ద్వారా గుర్తింపు లభిస్తోంది.
జల్ శక్తి కేంద్రాలు
జల్ శక్తి కేంద్రాలు (జేఎస్‌కేలు) జిల్లా స్థాయిలో సమాచార, సహాయక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు కింది విధాలుగా ప్రజలకు, స్థానిక పాలనా యంత్రాంగానికి తోడ్పడుతున్నాయి:
- నీటి సేకరణ పద్ధతులపై సమాచారం అందించడం
- సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం
- జల సంరక్షణ ప్రణాళికల రూపకల్పన, అమలుకు తోడ్పడటం
వర్షపు నీటి సేకరణ నుంచి సవాళ్లను తట్టుకునే గ్రామాల నిర్మాణం వరకు
సుస్థిర జల నిర్వహణ లక్ష్యంగా జల సంరక్షణ ప్రజలే ముందుండి నడిపించే ఉద్యమంగా మారింది. క్యాచ్ ది రెయిన్, జల్ సంచయ్ జన్ భాగీదారీ వంటి కార్యక్రమాలు వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల రీచార్జ్, జల వనరుల పునరుద్ధరణను ప్రోత్సహిస్తున్నాయి. శాస్త్రీయ ప్రణాళికలు, స్థానికులు బాధ్యత తీసుకోవడం, వనరుల సమన్వయంతో జల భద్రత, గ్రామీణ జీవనోపాధులు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం బలపడుతున్నాయి. ప్రజలు బాధ్యత తీసుకునే విధానాన్ని వనరుల సమన్వయం, డిజిటల్ పర్యవేక్షణ, ఆస్తుల కల్పనతో అనుసంధానిస్తూ జల భద్రత ఉన్న భారత్‌కు జేఎస్‌జేబీ: సీటీఆర్ పునాది వేస్తోంది.
References
PIB Backgrounders
https://www.pib.gov.in/FeaturesDeatils.aspx?NoteId=159260&ModuleId=2®=%203&lang=1
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151147)
आगंतुक पटल : 17
Provide suggestions / comments