Infrastructure
ఆదా అవుతున్న సమయం, తగ్గితున్న ప్రయాణ దూరాలు
प्रविष्टि तिथि:
05 OCT 2026 12:37 PM
ప్రాంతాలను చేరువ చేస్తున్న భారతదేశ మౌలిక సదుపాయాలు
ఆదా అయ్యే గంటల్లో కనిపించే అనుసంధాన ప్రయోజనాలు
లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన అనుసంధానం కల్పించడమంటే నిర్మించిన రహదారుల కిలోమీటర్లు మాత్రమే కాదు, ఆదా అయ్యే ప్రయాణ సమయంలో కూడా లెక్కించాలి. దేశవ్యాప్తంగా కొత్త వంతెనలు, సొరంగాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు సేవలు నగరాలు, ప్రాంతాలు, సమాజాల మధ్య ప్రయాణానికి పట్టే సమయాన్ని మారుస్తున్నాయి. చుట్టూ తిరిగి వెళ్లాల్సిన మార్గాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, నెమ్మదిగా సాగే దారులకు బదులుగా నేరుగా, వేగంగా చేరుకునే అనుసంధానాలను ఈ ప్రాజెక్టులు అందిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయాల ఆధారంగా వస్తున్న మార్పు రోజువారీ ప్రయాణాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వేగవంతమైన అనుసంధానాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో రోజువారీ రాకపోకలకు దూరం అడ్డంకిగా మారే పరిస్థితి తగ్గుతోంది.
వంతెనలు: అడ్డంకులను అధిగమిస్తూ, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ..
నదులను దాటేందుకు రోజువారీ ప్రయాణాల్లో పట్టే సుదీర్ఘ సమయాన్ని వంతెనలు తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు గంటల తరబడి సాగిన ప్రయాణాలను ఎంతో తక్కువ సమయంలో పూర్తయ్యేలా చేస్తున్నాయి.

* భూపేన్ హజారికా సేతు/ధోలా–సదియా వంతెన, అస్సాం–అరుణాచల్ ప్రదేశ్ (మే, 2017)
6 గంటలు → 1 గంట
అస్సాంలోని రూపాయ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని మేకా/రోయింగ్ మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి ఒక గంటకు తగ్గింది. దీంతో ఐదు గంటలు ఆదా అవుతున్నాయి.
* బోగీబీల్ వంతెన, అస్సాం (డిసెంబర్, 2018)
రోజంతా పట్టే ప్రయాణం → 1–2 గంటలు
బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన రైలు, రోడ్డు వంతెన ధేమాజీ, దిబ్రూగఢ్ మధ్య అనుసంధానాన్ని మార్చివేసింది. గతంలో దాదాపు రోజంతా పట్టే ప్రయాణాలు ఇప్పుడు సుమారు ఒకటి నుంచి రెండు గంటల్లో పూర్తవుతున్నాయి.
* అటల్ సేతు, మహారాష్ట్ర (జనవరి, 2024)
2 గంటలు → 20 నిమిషాలు
ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ముంబయి, నవీ ముంబయి మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తోంది. ప్రయాణ సమయాన్ని సుమారు 20 నిమిషాలకు తగ్గించింది.
* కోసి రైల్ మహాసేతు, బిహార్ (సెప్టెంబర్, 2020)
8 గంటలు → 30 నిమిషాలు
కోసి రైల్ మహాసేతు నిర్మలీ, సరాయ్‌గఢ్ మధ్య రైలు ప్రయాణ సమయాన్ని సుమారు ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గించింది. ప్రయాణ దూరం కూడా సుమారు 300 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్లకు తగ్గింది.
* సిస్సేరి నది వంతెన, అరుణాచల్ ప్రదేశ్ (నవంబర్, 2019)
సుమారు 5 గంటలు ఆదా
200 మీటర్ల పొడవైన సిస్సేరి నది వంతెన పాసీఘాట్, రోయింగ్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు ఐదు గంటలు తగ్గించింది. దిబాంగ్ లోయ, సియాంగ్ మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసింది.
సొరంగాలు: భౌగోళిక అడ్డంకులను దాటుతూ, గంటలను ఆదా చేస్తూ..
భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు అతి తక్కువ దూరంతో ప్రయాణించే మార్గాలను అందిస్తున్నాయి. పర్వతాలు, మలుపులు తిరిగే రహదారులు, ప్రమాదాలకు గురయ్యే మార్గాలను తప్పిస్తూ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయి. ప్రయాణాలు సాఫీగా సాగేందుకు తోడ్పడుతున్నాయి.

* అటల్ టన్నెల్, హిమాచల్ ప్రదేశ్ (అక్టోబర్, 2020)
4–5 గంటలు ఆదా
9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం రోహ్‌తాంగ్ కనుమ మీదుగా వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది. మనాలి–సర్చు మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గించి, లాహౌల్–స్పితికి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానాన్ని అందిస్తుంది.
* డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ టన్నెల్, జమ్మూ కశ్మీర్ (ఏప్రిల్, 2017)
దాదాపు 2 గంటలు ఆదా
9 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల మీదుగా వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది. ప్రయాణ దూరాన్ని సుమారు 30 కిలోమీటర్లు తగ్గిస్తుంది. జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటలు తగ్గిస్తుంది.
* బనిహాల్–ఖాజీగుండ్ రోడ్డు సొరంగం, జమ్మూ కశ్మీర్ (ఏప్రిల్, 2022)
సుమారు 1.5 గంటలు ఆదా
రెండు సమాంతర సొరంగ మార్గాలతో కూడిన 8.45 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం రోడ్డు ప్రయాణ దూరాన్ని 16 కిలోమీటర్లు తగ్గిస్తుంది. ప్రయాణ సమయాన్ని సుమారు గంటన్నర తగ్గిస్తుంది.
* సేలా టన్నెల్, అరుణాచల్ ప్రదేశ్ (మార్చి, 2024)
ప్రయాణ సమయం గంటకు పైగా తగ్గింపు
సుమారు 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగం వ్యూహాత్మకంగా ముఖ్యమైన తేజ్‌పూర్–తవాంగ్ మార్గంలో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానాన్ని నిర్ధారిస్తుంది.
ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్లు
తక్కువ దూరంతో సాగే మార్గాలు, నియంత్రిత ప్రవేశం, అధిక వేగంతో ఎక్స్‌ప్రెస్‌వేలు నగరాల మధ్య ప్రయాణ వేగాన్ని మారుస్తున్నాయి. ఒకప్పుడు అనేక గంటలు పట్టిన సుదీర్ఘ ప్రయాణాలు ఇప్పుడు గణనీయంగా తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి.
* దిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే (2021)
2.5 గంటలు → 50 నిమిషాలు
82 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు దిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండున్నర గంటల నుంచి దాదాపు 50 నిమిషాలకు తగ్గించింది.
* బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే (మార్చి, 2023)
3 గంటలు → 75 నిమిషాలు
118 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడు గంటల నుంచి సుమారు 75 నిమిషాలకు తగ్గించింది.
* దిల్లీ–డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ (ఏప్రిల్, 2026)
6 గంటలు → 2.5 గంటలు
నియంత్రిత ప్రవేశంతో కూడిన 213 కిలోమీటర్ల ఈ కారిడార్ దిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు గంటలకు పైగా నుంచి సుమారు రెండున్నర గంటలకు తగ్గిస్తుంది.
* ముంబయి–నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్ (డిసెంబర్, 2022)
16 గంటలు → సుమారు 8 గంటలు
నియంత్రిత ప్రవేశంతో కూడిన 701 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముంబయి, నాగ్‌పూర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది.
* అహ్మదాబాద్–ధొలేరా ఎక్స్‌ప్రెస్‌వే (మార్చి, 2026)
అహ్మదాబాద్–ధొలేరా: 100 కిలోమీటర్లు, 2 గంటల 15 నిమిషాలు → 83 కిలోమీటర్లు, 45 నిమిషాలు
అహ్మదాబాద్–భావ్‌నగర్: 169 కిలోమీటర్లు, 3 గంటల 15 నిమిషాలు → 141 కిలోమీటర్లు, 1 గంట 45 నిమిషాలు
కొత్త మార్గంలో, నియంత్రిత ప్రవేశంతో నిర్మించిన 109 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే అహ్మదాబాద్, ధొలేరా మధ్య వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంది.
* దిల్లీ–అమృత్‌సర్–కట్రా ఎక్స్‌ప్రెస్‌వే (మొదటి దశ–జులై, 2026)
దిల్లీ–అమృత్‌సర్: 8 గంటలు → 4 గంటలు
దిల్లీ–కట్రా: 14 గంటలు → 6 గంటలు
శ్రీ మాతా వైష్ణో దేవికి వెళ్లే యాత్రికులు, పర్యాటకుల రాకపోకలను పెంచేందుకు, కారిడార్ వెంబడి పారిశ్రామిక, సరకు రవాణా అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అభివృద్ధి చేస్తున్నారు.
* దిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే
33 గంటలు → సుమారు 12 గంటలు
దిల్లీ, ముంబయి మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 33 గంటల నుంచి సుమారు 12 గంటలకు తగ్గించేందుకు కొత్త మార్గంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అభివృద్ధి చేస్తున్నారు.

రైల్వేలు: వేగవంతమైన రైళ్లు, తక్కువ సమయంలో ప్రయాణాలు
కొత్తతరం రైళ్లు, ప్రత్యేక హైస్పీడ్ కారిడార్లు రైలు ప్రయాణాల్లో గణనీయంగా సమయాన్ని ఆదా చేస్తున్నాయి. రైల్వే వ్యవస్థవ్యాప్తంగా 549 రైళ్ల వేగాన్ని పెంచడంతో 2026 రైల్వే సమయ పట్టిక ఈ మార్పును ప్రతిబింబిస్తోంది. వీటిలో 20 రైళ్ల ప్రయాణ సమయం 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గింది. మరో 48 రైళ్ల ప్రయాణ సమయం 31–59 నిమిషాలు, 105 రైళ్ల ప్రయాణ సమయం 16–30 నిమిషాలు తగ్గింది. మిగిలిన 376 రైళ్ల ప్రయాణ సమయం 5–15 నిమిషాలు తగ్గేలా వేగాన్ని పెంచారు.
కొత్తతరం రైళ్లు
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్, న్యూదిల్లీ–వారణాసి (ఫిబ్రవరి, 2019)
గత రైలు సేవల కంటే 40–50% వేగం
భారతదేశపు తొలి వందే భారత్ రైలును 2019 ఫిబ్రవరి 15న న్యూదిల్లీ–కాన్పూర్–ప్రయాగ్‌రాజ్–వారణాసి కారిడార్‌లో ప్రారంభించారు. న్యూదిల్లీ, వారణాసి మధ్య నిర్దేశిత ప్రయాణ సమయం సుమారు ఎనిమిది గంటలు. దీంతో ఈ మార్గంలోని గత రైలు సేవల కంటే ఇది సుమారు 40–50% వేగంగా ప్రయాణిస్తుంది.
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కట్రా–శ్రీనగర్ (జూన్, 2025)
2–3 గంటలు ఆదా
ఈ రైలు కట్రా–శ్రీనగర్ ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటలకు తగ్గించింది. పొడిగించిన జమ్మూ–శ్రీనగర్ సర్వీసు ఇప్పుడు ప్రయాణాన్ని 4 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేస్తోంది.
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్, బనారస్–ఖజురహో (నవంబర్, 2025)
సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా
గతంలో నడిచిన ప్రత్యేక రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 2 గంటల 40 నిమిషాలను ఆదా చేస్తుంది.
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకుళం–బెంగళూరు (నవంబర్, 2025)
2 గంటలకు పైగా ఆదా
ఈ రైలు ప్రయాణాన్ని 8 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుంది.
* వందే భారత్ ఎక్స్‌ప్రెస్, లఖ్‌నవూ–సహారన్‌పూర్ (నవంబర్, 2025)
దాదాపు 1 గంట ఆదా
ఈ రైలు ప్రయాణాన్ని సుమారు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తిచేస్తుంది.
* వందే భారత్ స్లీపర్, హౌరా–గువాహటి (జనవరి, 2026)
సుమారు 17 గంటలు → సుమారు 14 గంటలు
భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు సరాయ్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే దాదాపు మూడు గంటలను ఆదా చేస్తుంది. ఇందులో సుమారు 823 మంది ప్రయాణికుల కోసం 16 ఎయిర్ కండిషన్డ్ బోగీలు ఉన్నాయి.

హైస్పీడ్ రైలు కారిడార్లు
* ముంబయి–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్
రోడ్డు మార్గంలో 8–9 గంటలు → సుమారు 1 గంట 58 నిమిషాలు
గంటకు 320 కిలోమీటర్ల నిర్వహణ వేగంతో కూడిన 508 కిలోమీటర్ల ఈ కారిడార్ 12 స్టేషన్లకు సేవలు అందిస్తుంది. ఇందులో థానే క్రీక్ కింద సుమారు 7 కిలోమీటర్ల మేర సాగే భారతదేశపు తొలి సముద్రగర్భ రైలు సొరంగం ఉంది. తొలి రైలు సేవను 2027 ఆగస్టులో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు (హెచ్‌ఎస్‌ఆర్) కారిడార్లు
ప్రధాన నగరాల మధ్య సుమారు 1–4 గంటల్లో ప్రయాణం
2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ కారిడార్ల మొత్తం పొడవు దాదాపు 4,000 కిలోమీటర్లు. అంచనా పెట్టుబడి ₹16 లక్షల కోట్లు.
|
కారిడార్
|
సూచనప్రాయ ప్రయాణ సమయం
|
|
దిల్లీ–వారణాసి
|
సుమారు 3 గంటల 50 నిమిషాలు
|
|
వారణాసి–పట్నా–సిలిగురి
|
సుమారు 2 గంటల 55 నిమిషాలు
|
|
చెన్నై–బెంగళూరు
|
సుమారు 1 గంట 13 నిమిషాలు
|
|
బెంగళూరు–హైదరాబాద్
|
సుమారు 2 గంటలు
|
|
చెన్నై–హైదరాబాద్
|
సుమారు 2 గంటల 55 నిమిషాలు
|
|
ముంబయి–పుణె
|
సుమారు 48 నిమిషాలు
|
|
పుణె–హైదరాబాద్
|
సుమారు 1 గంట 55 నిమిషాలు
|
ప్రయాణికులకు ఆదా అవుతున్న గంటల కొద్దీ సమయం
భారత రవాణా వ్యవస్థ రూపాంతరం ప్రజలు, ప్రాంతాలు పరస్పరం అనుసంధానమయ్యే విధానాన్ని మారుస్తోంది. వంతెనలు, సొరంగాలు కొత్త మార్గాలను అందిస్తుండగా, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆధునిక రైలు సేవలు సుదూర ప్రయాణాలకు కొత్త రూపమిస్తున్నాయి. ఈ చర్యలన్నీ కలిసి రాకపోకలను మరింత సాఫీగా మార్చుతూ, వివిధ ప్రాంతాలకు చేరుకునే అవకాశాలను విస్తరిస్తున్నాయి.
References
Ministry of Road Transport & Highways:
Ministry of Railways:
Prime Minister’s Office:
Press Information Bureau:
Ministry of Finance:
Ministry of Defence:
Government of Maharashtra:
Click to see pdf
***
(तथ्य सामग्री आईडी: 151077)
आगंतुक पटल : 3
Provide suggestions / comments