Social Welfare
మై భారత్ – యువ భారత్‌కు తోడవుతున్న డిజిటల్ ఇండియా
प्रविष्टि तिथि:
05 JUL 2026 11:03 AM
యువతే మేరా యువ భారత్ హృదయం
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. ఇక్కడి జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఈ మానవ వనరుల అపారమైన సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్‌లో 'మై భారత్' (మేరా యువ భారత్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, పౌర భాగస్వామ్యానికి అవకాశాలు కల్పిస్తూ దేశ నిర్మాణంలో యువతను కీలక భాగస్వాములను చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.


యువత క్రియాశీల భాగస్వామ్యం కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలను అనుసంధానించే డిజిటల్ వేదికగా 'మై భారత్' పనిచేస్తోంది. విస్తృతమైన డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా భారతదేశ బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) మద్దతుతో ఈ వేదిక దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువ భారతీయులను అభ్యసన, దేశ నిర్మాణ అవకాశాలతో సులభంగా జోడిస్తోంది. ఇది దేశంలో సమ్మిళిత్వం, సులభతర లభ్యత, భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ చొరవ ద్వారా యువ పౌరులు 'వికసిత్ భారత్ @ 2047' స్వప్న సాకారానికి చురుగ్గా సహకరించేలా సాధికారత పొందుతున్నారు.
అవకాశాల ద్వారా అమృత పీడి సాధికారత
భౌతిక భాగస్వామ్యాన్ని డిజిటల్ సాంకేతికతతో ముడిపెడుతూ 'మై భారత్' ఒక సమగ్ర డిజిటల్ వేదికగా సేవలందిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలు ఇవే:

డిజిటల్ వాలంటీరిజం(స్వచ్ఛంద సేవ)
* 2026 జూన్ నాటికి ఈ వేదికపై పరిశుభ్రత, రక్తదానం, క్రీడలు, విపత్తు నిర్వహణ, సమాజ సేవ వంటి రంగాలలో 1.52 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
* ఇది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, హాజరు, జియో-ట్యాగింగ్, సర్టిఫికేట్ జారీ, ప్రభావ గుర్తింపు ద్వారా సమగ్ర డిజిటల్ వాలంటీర్ నిర్వహణను అందిస్తుంది.
తరగతి గదులకు అవతల అనుభవపూర్వక అభ్యాసం
* 2026 జూలై నాటికి ఈ వేదిక ప్రత్యక్ష అభ్యాసాన్ని, ఉపాధి సన్నద్ధతను ప్రోత్సహించే 24,900కు పైగా అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలను (ఈఎల్‌పీ) అందించింది.
* దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు, పని ప్రదేశాలలో శిక్షణ కోసం అప్రెంటిస్‌షిప్‌లు, పారిశ్రామిక అనుభవం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
* కేంద్ర బడ్జెట్ వంటి జాతీయ అంశాలపై యువతకు అవగాహన కల్పించే క్విజ్‌లు, పోటీల ద్వారా ఈ వేదిక పౌర నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
నాయకత్వ అభివృద్ధి, ఉపాధి మద్దతు
* ఈ వేదిక 'వికసిత్ భారత్ యువ పార్లమెంట్' వంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తోంది. ఇది యువత జాతీయ అంశాలపై చర్చించడానికి, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
* ఏఐ ఆధారిత రెజ్యూమ్ బిల్డర్, మార్గదర్శకత్వ మద్దతు యువత తమ విద్యా, ఉపాధి భవిష్యత్తు కోసం సిద్ధపడటానికి సహాయపడతాయి.
* పాలన, రాజ్యాంగం, ఆవిష్కరణలు, ప్రజా విధానాలపై బహుభాషా డిజిటల్ క్విజ్‌లు అభ్యసనాన్ని పరస్పర ప్రభావశీలంగా మార్చుతాయి.
యువతను దేశంతో అనుసంధానించే కార్యక్రమాలు
యువత నేతృత్వంలో దేశ నిర్మాణం
* 'మై భారత్ మై ఓట్' ప్రచారం తొలిసారి ఓటు వేసే వారిలో అవగాహనతో కూడిన ఓటింగ్, రాజ్యాంగ చైతన్యాన్ని పెంపొందించింది.
* జాతీయ యువజనోత్సవం: 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' లో 50.42 లక్షలకు పైగా యువత పాల్గొన్నారు. ఇది భారతదేశపు అతిపెద్ద యువ సంప్రదింపుల కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది.
* వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ) 2026.. వికసిత్ భారత్ @ 2047 కోసం ఆలోచనలు, పరిష్కారాలపై చర్చించడానికి యువతకు ఒక జాతీయ వేదికను అందించింది. ఇది నాయకత్వాన్ని, ఆవిష్కరణలను, దేశ నిర్మాణంలో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది.
* 'యూత్ ఫర్ వికసిత్ భారత్ – మై భారత్ యువ సమ్మేళనం 2026' అమృత పీడి ఆకాంక్షలు, విజయాలను జరుపుకోవడానికి 6,000 మందికి పైగా యువతను ఒకచోటకు చేర్చింది.
* 17 జోన్లలో నిర్వహించిన 'నారీ శక్తి యువ పార్లమెంట్' ద్వారా 7,000 మందికి పైగా యువతులు క్రమబద్ధమైన ప్రజాస్వామ్య చర్చలు, విధానపరమైన సంభాషణల్లో పాల్గొన్నారు.
స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యాచరణ
* నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్‌ఎస్‌ఎస్) స్వచ్ఛంద సేవ, భాగస్వామ్యం, పర్యవేక్షణను సులభతరం చేయడానికి 'మై భారత్' వేదికను ఉపయోగించుకుంటోంది.
* అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా విద్యా సంస్థలు, సామాజిక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో యోగా సెషన్ల ద్వారా 'మై భారత్' వాలంటీర్లు లక్షలాది మంది యువతను సమీకరించారు.
* మత్తుపదార్థాల రహిత భారతదేశం కోసం సాగుతున్న 'నషా ముక్త్ భారత్' ప్రచారంలో భాగంగా యువ వాలంటీర్లు అవగాహన యాత్రలు, పునరావాస చర్యలు, సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు.
* పౌర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 'మై భారత్' దేశవ్యాప్తంగా పాదయాత్రలు, పరిశుభ్రత కార్యక్రమాలు, సమాజ సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
సరిహద్దులు దాటిన యువ స్వరాలు
* 'వికసిత్ వైబ్రెంట్ విలేజ్' ప్రోగ్రామ్ యువత భారతదేశ సరిహద్దు గ్రామాల్లోని జీవితాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలు కల్పించింది. ఇది జాతీయ సమగ్రతను, క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించింది.
* క్రియాశీల పౌరసత్వాన్ని పెంపొందించడానికి స్ఫూర్తిదాయక వ్యక్తులు, మార్పు తెస్తున్న వారితో సంభాషణలతో కూడిన 'మై భారత్ పాడ్‌కాస్ట్ సిరీస్' 2026 మార్చి 21న ప్రారంభమైంది.
* ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి(ఇకోసాక్) యూత్ ఫోరమ్ 2026లో భారతీయ యువత పాల్గొనేలా 'మై భారత్' దోహదపడింది. ఇది ప్రపంచ విధాన చర్చలలో భారతదేశ దృక్పథాన్ని ప్రతిబింబించడానికి యువ నాయకులకు ఒక వేదికను అందించింది.
డిజిటల్ ఇండియా సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న 'మై భారత్'
సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యం ఎలా మరింత సులభతరంగా, గుర్తింపు పొందేలా, భవిష్యత్తుకు సిద్ధంగా మారుతుందో 'మై భారత్' నిరూపిస్తోంది.
భాగస్వామ్యం, గుర్తింపు
* 'ఒక వారంలో అత్యధిక మంది ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనడం' అనే విభాగంలో 390,812 మంది ధ్రువీకరించిన పార్టిసిపెంట్లతో 'మై భారత్' 2026 జూన్ 04న గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది.
* ఈ పోర్టల్ స్వచ్ఛంద సేవ, అభ్యాస కార్యక్రమాలు, పౌర భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ డిజిటల్ బ్యాడ్జ్‌లు, సర్టిఫికేట్లు, ధ్రువీకరించిన భాగస్వామ్య పత్రాలను అందిస్తుంది.
మీ జేబులోనే డిజిటల్ పాలన
* 22 భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న 'మై భారత్' మొబైల్ అప్లికేషన్, జూలై 02, 2026 నాటికి లక్షకు పైగా డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది.
* ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అవకాశాలు, అభ్యాస వనరులు, డిజిటల్ సర్టిఫికేట్లు, ప్రభుత్వ కార్యక్రమాలను సులభంగా పొందే వీలు కలుగుతుంది.
భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వేదిక
* యువత భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కృత్రిమ మేధ(ఏఐ), బహుభాషా సాంకేతికతలు, ఓపెన్ ఏపీఐలు, డిజిటల్ ఆధారాల ద్వారా 'మై భారత్ 2.0' యువత నిశ్చితార్థాన్ని సరికొత్తగా మారుస్తోంది.
* వికసిత్ భారత్@2047 కు అనుగుణంగా సాంకేతికత ఆధారిత పాలన ద్వారా 10 కోట్ల మందికి పైగా యువతకు సాధికారత కల్పించాలనే భారతదేశ దార్శనికతకు ఈ వేదిక ప్రతీకగా నిలుస్తుంది.
భవిష్యత్తుకు సిద్ధంగా 'మేరా యువ భారత్' నిర్మాణం
డిజిటల్ ఇండియా పునాదులపై నిర్మించిన 'మై భారత్', దేశ నిర్మాణంలో పాల్గొనేలా అమృత పీడిని శక్తివంతం చేస్తోంది. అభివృద్ధి చెందిన, సమ్మిళిత, స్వయంసమృద్ధ దేశం వైపు భారతదేశ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తోంది.
భారతదేశం 'వికసిత్ భారత్ @ 2047' వైపు అడుగులు వేస్తున్న తరుణంలో యువత కోసం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా అవతరించడానికి 'మై భారత్' సిద్ధంగా ఉంది. కృత్రి మేధ, బహుభాషా సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ వేదిక స్వచ్ఛంద సేవ, అనుభవపూర్వక అభ్యాస అవకాశాలను నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది.
References
MY Bharat Portal
Ministry of Youth Affairs and Sports
Click here for pdf file
***
(तथ्य सामग्री आईडी: 150724)
आगंतुक पटल : 9
Provide suggestions / comments