Economy
టెర్రకోట నుండి వస్త్రాల పరిశ్రమలు వరకు: బెంగాల్ పరిశ్రమలకు సాధికారత కల్పించడానికి జిఎస్టీ సంస్కరణలు
प्रविष्टि तिथि:
04 OCT 2025 15:24 PM
ముఖ్యాంశాలు
-
జీఎస్టీ ని 12% నుండి 5%కి తగ్గించడం వలన చేతి వృత్తులు, చేనేత, జనపనార, తోలు, వస్త్రాలపై ధరలు 6%-11% తగ్గాయి.
-
₹2,500 వరకు ఉన్న వస్త్రాలపై ఇప్పుడు 5% పన్ను, 5 లక్షల హోజియరీ ఉద్యోగాలకు ఉపయోగం, ఎగుమతులను పెంచుతుంది.
వ్యవసాయ ఉత్పత్తులకు లాభం
పరిచయం
పశ్చిమ బెంగాల్ చాలా కాలంగా సాంప్రదాయ చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. బిష్ణుపూర్‌లోని టెర్రకోట దేవాలయాల నుండి నక్షి కాంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ వరకు, పురులియా శక్తివంతమైన ముసుగుల నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన డార్జిలింగ్ టీ వరకు, బెంగాల్ చేతివృత్తులు, పారిశ్రామిక వారసత్వం లక్షలాది మంది జీవనోపాధిని నిలబెట్టింది. జీఎస్టీ సంస్కరణలు స్థానిక వర్గాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అభివృద్ధి చెందగలవని నిర్ధారిస్తూ కళాత్మకత, వ్యాపార కేంద్రంగా బెంగాల్ గుర్తింపును బలోపేతం చేస్తాయి.
ఈ మార్పులు బెంగాల్‌లోని చేతివృత్తులవారు, రైతులు, చిన్న వ్యవస్థాపకులకు ప్రత్యక్షంగా సాధికారత కల్పిస్తాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వారి ఉత్పత్తులకు మరింత పోటీతత్వం వస్తుంది. ఇది బెంగాల్ చేతివృత్తుల వారసత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా జిల్లాలలో స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.

వస్త్ర పరిశ్రమ & ఎంఎస్ఎంఈలు
నక్షి కాంత
బెంగాల్‌లోని అత్యంత ప్రసిద్ధ ఎంబ్రాయిడరీ సంప్రదాయాలలో నక్షి కాంత ఒకటి, ఇది బీర్భూమ్,
ముర్షిదాబాద్, నదియా వంటి గ్రామీణ జిల్లాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. పాత చీరలు, ధోతీలను దుప్పట్లుగా పునర్వినియోగించే పొదుపులో కూడుకున్న కాంత ఎంబ్రాయిడరీ గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, సృజనాత్మక వ్యక్తీకరణ రెండింటినీ అందించే ఒక శక్తివంతమైన కళారూపంగా అభివృద్ధి చెందింది. నేడు, ఇది గ్రామీణ మహిళలకు, తరచుగా స్వయం సహాయక బృందాలు లేదా కుటుంబ యూనిట్లలో పనిచే వారికి కీలకమైన ఆదాయ వనరును.
12% నుండి 5% కి జీఎస్టీ తగ్గింపు ఈ రంగానికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది, ధరలు దాదాపు 6.25% తగ్గుతాయి. ఉదాహరణకు, ₹8,000 ధర ఉన్న విస్తృతమైన కాంతా-కుట్టిన చీర లేదా శాలువా ధర ఇప్పుడు ₹500 తగ్గుతుంది. ఇది దేశీయ మార్కెట్లలో ప్రామాణికమైన, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన కాంతాను మరింత సరసమైనదిగా, యంత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన లేదా భారీగా ఉత్పత్తి చేయబడిన అనుకరణలకు వ్యతిరేకంగా దాని పోటీతత్వాన్ని బలపరుస్తుంది .
ప్రపంచ మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్, యూఎస్స్, జపాన్లలో, ఈ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ, సంక్లిష్టమైన చేతి-కుట్టుకి, ప్రత్యేకమైన సౌందర్యానికి ప్రశంసలు

అందుకుంటుంది. ఈ ప్రాంతాలలోని ఫెయిర్-ట్రేడ్, స్థిరమైన ఫ్యాషన్ మార్కెట్లలో కూడా ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అందుబాటు ధరతో మార్జిన్లను మెరుగుపరచడం వలన ప్రపంచ పోటీతత్వం పెరిగి, మార్కెట్ పరిధి విస్తరిస్తుంది.
జనపనార హ్యాండ్&షాపింగ్ బ్యాగులు
పశ్చిమ బెంగాల్ భారతదేశ జనపనార పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇది వ్యవస్థీకృత మిల్లులతో 2.5 లక్షలకు పైగా కార్మికులకు ప్రత్యక్ష ఉపాధిని అందిస్తూ దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు మద్దతునిస్తుంది.
ఈ పరిశ్రమ వార్షిక టర్నోవర్ ₹10,000 కోట్లను దాటింది. ఉత్పత్తిలో దాదాపు 70% ప్రభుత్వం ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కోసం సేకరించే సాంప్రదాయ గొను సంచులు. ఇంకా, ఫ్యాషన్ బ్యాగులు, అలంకరణ వస్తువుల వంటి వైవిధ్యభరితమైన జనపనార ఉత్పత్తులకు ( జెడిపిలు) డిమాండ్ పెరిగింది.
జీఎస్టీ ని 12% నుండి 5%కి తగ్గించడం వల్ల రిటైల్ ధరలు దాదాపు 6.25% తగ్గుతాయని భావిస్తున్నారు. ₹1,000 ధర గల బ్యాగ్ కు వినియోగదారులు ₹60 కన్నా ఎక్కువ ఆదా చేయగలరు. ఇది పర్యావరణ హితమైన జనపనారను ప్లాస్టిక్ లేదా సింథటిక్ ప్రత్యామ్నాయాలతో మరింత పోటీగా చేస్తుంది. ఇది పట్టణ మార్కెట్లలో దేశీయ డిమాండ్‌ను పెంచుతుంది. ఎగుమతులకు మద్దతు ఇస్తుంది. ఇక్కడ జెడిపిలు ఇప్పటికే గణనీయమైన విలువను పొందాయి.
పశ్చిమ బెంగాల్‌లోని చేతివృత్తులవారు, కార్మికులకు, పన్ను ఉపశమనం లాభదాయకతతో పాటు మార్కెట్ ప్రాప్యతను అదే సమయంలో పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అటువంటి విలువ ఆధారిత, వినియోగదారుల దృష్టితో కూడిన ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా జీఎస్టీ తగ్గింపు ఆధునిక జీవనశైలికి సంబంధించిన " గోల్డెన్ ఫైబర్ " గుర్తింపును సంస్కరిస్తుంది.
హోజియరీ, రెడీమేడ్ దుస్తులు
హోజియరీ, రెడీమేడ్ దుస్తులు, పశ్చిమ బెంగాల్‌లోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఇవి సుమారు 5,00,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. భారతదేశంలోని హోజియరీ పరిశ్రమకు కోల్‌కతా చారిత్రక జన్మస్థలం. మెటియాబ్రూజ్, బారుయ్‌పూర్, సిలిగురిలలో ప్రధాన సమూహాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ లక్స్, రూప, డాలర్ వంటి కొన్ని పెద్ద బ్రాండ్‌ల ద్వారా వర్గీకరించబడింది. ఇవి వేలాది చిన్న, నమోదు కాని యూనిట్లకు ఉత్పత్తికు అవుట్‌సోర్స్ గా ఉన్నాయి.
5% జీఎస్టీ శ్లాబ్ పరిమితిని రూ. 2500 కు పెంపు అత్యంత ప్రభావవంతమైన మార్పు. 5% రేటును మార్చుకుండా పరిమితిని సవరించడంతో చాలా మధ్యస్థ మార్కెట్ దుస్తులు, ఇన్నర్‌వేర్, పిల్లల దుస్తులు, టీ-షర్టులు ఇప్పుడు తక్కువ పన్ను పరిమితికి అర్హత పొందాయి.
ఈ పన్ను ఉపశమనం వినియోగదారులకు, తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పెరుగుతున్న అందుబాటుతో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా పశ్చిమ బెంగాల్ చేనేత, వస్త్ర ఉత్పత్తులలో దాదాపు 12% ఎగుమతి అవుతున్నాయి. కొత్త రేట్లతో ఎగుమతులు మరింత పోటీతత్వాన్ని
పొందుతాయి. సంస్కరణలతో పన్ను భారాలను తగ్గించడం ద్వారా బెంగాల్ ఆర్థిక వ్యవస్థ, వారసత్వానికి కీలకమైన కార్మిక ప్రోత్సాహ రంగానికి మద్దతు ఇస్తుంది.
ఉద్యానవన ఉత్పత్తులు
డార్జిలింగ్ టీ , సారం
డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల పొగమంచు కొండల నుండి వచ్చే డార్జిలింగ్ టీ, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్లాక్ టీ, దీనిని తరచుగా " షాంపైన్ ఆఫ్ టీస్ " అని పిలుస్తారు. దీని ప్రత్యేకమైన ఘాటైన రుచి ఈ ప్రాంతంలోని నిర్దిష్ట వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల నుండి వస్తుంది. వీటిలో ఎత్తైన ప్రదేశం, చల్లని వాతావరణం, చైనీస్ కామెల్లియా సినెన్సిస్ టీ పొదలు ఉన్నాయి. ఈ పరిశ్రమ చారిత్రాత్మకంగా ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక నిర్మాణాన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించే తోటల నమూనాతో నిర్మితమైంది. ఇందులో మహిళలే ఎక్కువ శ్రామిక శక్తిని కలిగి ఉన్నారు. ఈ కార్మికులు ఎస్టేట్లలో నివసిస్తున్నారు. టీ సాగు వారి జీవనోపాధికి వెన్నెముకగా ఉంది.
సాధారణ టీ పై జీఎస్టీ 5% వద్దనే ఉన్నప్పటికీ, టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు, ఎసెన్స్‌లు, కాన్‌సెంట్రేట్‌లను కూడా 18% నుండి 5%కి తగ్గించారు. దీని వలన ఖర్చులు దాదాపు
11% తగ్గుతాయని భావిస్తున్నారు. ఫలితంగా, ఇన్‌స్టంట్ టీ, రెడీ-టు-డ్రింక్ పానీయాలు, ఆహార, సౌందర్య సాధన పరిశ్రమలలో ఉపయోగించే ఎక్స్‌ట్రాక్ట్‌లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు గణనీయంగా మరింత సరసమైనవిగా ఉంటాయి.
ఈ పన్ను తగ్గింపు డార్జిలింగ్ టీ ఎగుమతి ఆధారిత స్వభావానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది , ఇది భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొదటి ఉత్పత్తి. ఎగుమతి ఆధారిత ఉత్పత్తి అయిన ఇది జపాన్, జర్మనీ, యూకే, యూఎస్ఏ వంటి దేశాలలో భారీ మార్కెట్లను కలిగి ఉంది. ఇక్కడ ప్రాసెస్ చేయబడిన టీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. విలువ ఆధారిత విభాగాలలో వైవిధ్యతను ప్రోత్సహించడం ద్వారా సంస్కరణలు సాంప్రదాయ ఆకు టీ అమ్మకాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించి కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది.
మొత్తంమీద, జీఎస్టీ తగ్గింపు డార్జిలింగ్ టీ పరిశ్రమ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ వారసత్వ ఉత్పత్తి దేశీయ మార్కెట్లలో, ప్రపంచ ప్రీమియం పానీయాల పరిశ్రమలో వృద్ధి ని నిర్ధారిస్తుంది.
మాల్దా మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమ
బెంగాల్ " మామిడి రాజధాని " అని పిలువబడే మాల్దా జిల్లా 200 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రసిద్ధ రకాలు, ఫజ్లి, లక్ష్మణ్ భోగ్, ఖిర్సాపతి (హిమ్సాగర్), జిఐ ట్యాగ్ ను పొందాయి. ఇవి ఈ ప్రాంత గుర్తింపుకు చిహ్నంగా ఉన్నాయి. ~80,000 మంది పెంపకందారులతో సహా దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉండటంతో మామిడి సాగు మాల్దా ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉంది.
సగటున, మాల్దా సంవత్సరానికి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది, దానిలో పెరుగుతున్న భాగాన్ని గుజ్జు, జ్యూస్‌లు, జామ్‌లు, ఊరగాయలుగా ప్రాసెస్ చేస్తారు. ఈ ఉత్పత్తులకు దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 2023లో మాల్దా నుండి మామిడి ఎగుమతులు ₹80 కోట్లకు పైగా చేరుకున్నాయి. జిఐ-ట్యాగ్ చేయబడిన రకాలు మధ్యప్రాచ్యం, యూకే, యూరప్, ఇటీవల స్వీడన్, న్యూజిలాండ్ వంటి కొత్త మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.
ప్రాసెస్ చేసిన మామిడి ఉత్పత్తులు, జ్యూస్‌లు, జామ్‌లపై ని ని 12% నుండి 5%కి తగ్గించడం వల్ల వాటి రిటైల్ ధర దాదాపు 6.25% తగ్గుతాయి. ఇది ప్రాసెస్ చేసిన

ఉత్పత్తులను దేశీయ వినియోగదారులకు మరింత సరసమైనదిగా చేస్తుంది. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. డిమాండ్ పెరగడం, వారి ఉత్పత్తులకు హామీ ఇవ్వబడిన మార్కెట్‌తో, రైతుల ఆదాయం కూడా మరింత స్థిరంగా మారుతుంది.
చేతి వృత్తులు
బంకురా పంచముర టెర్రకోట కళాకృతులు
బంకురా జిల్లాలో, ముఖ్యంగా పంచముర గ్రామం, బిష్ణుపూర్ ప్రాంతంలో, టెర్రకోట చేతి వృత్తుల ప్రాంతీయ సమాజాల వంశపారంపర్య వృత్తి. ప్రసిద్ధ బంకురా పంచముర టెర్రకోట బొమ్మలు, ముఖ్యంగా శైలీకృత బంకురా గుర్రం, 17వ శతాబ్దంలో బిష్ణుపూర్ మల్ల రాజుల పోషణలో ఉద్భవించాయి. నేడు, ఈ చేతిపనులను 4,000+ మంది కళాకారులు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా కుటుంబ ఆధారిత సంస్థలు, ఇందులో మహిళలు కూడా ఉన్నారు . స్థానిక మార్కెట్లు, కోల్‌కత్తాలోని హస్త శిల్ప మేళా వంటి ప్రభుత్వ ఉత్సవాలు కీలకమైన అవుట్‌లెట్‌లు.
బంకురా టెర్రకోట హస్తకళలకు కొత్తగా జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించడం చాలా ముఖ్యమైనది. దీని వలన రిటైల్ ధరలలో 6 .25% తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు ₹5,000కి అమ్ముడైన పెద్ద అలంకార టెర్రకోట గుర్రంపై, వినియోగదారులు దాదాపు ₹312 పన్ను ఆదా చేస్తారు. ఈ పొదుపు మొత్తం డిమాండ్‌ను ప్రేరేపిస్తుంది. అమ్మకాలను పెంచుతుంది. ఈ పరిశ్రమలో నిమగ్నమైన కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.
మధురకతి మ్యాట్స్ & వైవిధ్యభరితమైన ఉత్పత్తులు
పుర్బా, పశ్చిమ్ మెదినీపూర్ జిల్లాల్లో వేలాది కుటుంబాలు మధుర్కథి చాపలు, ఉత్పత్తులను నేస్తాయి. పశ్చిమ్ మెదినీపూర్‌లోని సబాంగ్ ఈ చేతివృత్తులకు అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడ మహిళలు నేత ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారు. చాలా గృహాలకు, చాప నేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఎందుకంటే 77% పైగా వ్యక్తులకు వారి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. దాదాపు ఒక లక్ష వ్యవసాయ కుటుంబాలు చాపలకు కావాల్సిన వనరును పండించడంలో, నేతలో నిమగ్నమై ఉన్నారు. మేదినీపూర్‌లోని 11 బ్లాకులలో 4,432 మంది చేతివృత్తులవారు అధికారికంగా మధుర నేత కార్మికులుగా నమోదయ్యారు.
బెంగాల్‌లోని తేమతో కూడిన వాతావరణంలో, మధుర మ్యాట్‌లు గృహోపకరణాలు, బ్యాగులు, టేబుల్ రన్నర్లు, ఫోల్డర్‌లు, కోస్టర్‌లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి.
జీఎస్టీ ని 12% నుండి 5%కి తగ్గించడం వలన మధురకథి మ్యాట్స్, వైవిధ్యభరితమైన ఉత్పత్తులు దాదాపు 6.25% చౌకగా లభిస్తాయి . ఇది చేతివృత్తులవారి ఆదాయాలకు, విస్తరిస్తున్న వినియోగదారుల డిమాండ్‌కు అర్థవంతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
పురులియా చౌ మాస్క్‌లు
పురులియా జిల్లాలోని చరిదా గ్రామంలోని ఉత్సాహభరితమైన చౌ నృత్య ముసుగులను స్థానిక కళాకారులు తయారు చేస్తారు. చరిదాలోని 310 కుటుంబాల నుండి సుమారు 500 మంది ప్రజలు ఈ కళలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్నారు. చరిదా కళాకారులలో 85% మంది దీనిని తమ ప్రాథమిక ఈ జీవనోపాధి పై ఆధారపడ్డారు. ఈ ముసుగులు పురులియా చౌ నృత్య సంప్రదాయానికి కేంద్రంగా ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా అలంకార కళగా కూడా విస్తృతంగా అమ్ముడవుతున్నాయి.
ఇటీవల జీఎస్టీ రేటును 12% నుండి 5%కి తగ్గించడంతో ఈ ఈ చేతి వృత్తుల అందుబాటును, పోటీతత్వాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది . దీని వలన ధరలలో 6.25% తగ్గుదల సాంస్కృతిక, వాణిజ్య పరంగా గణనీయతను సంతరించుకుంది. ఉదాహరణకు, ₹4,000 ధర గల మాస్క్‌పై, కొనుగోలుదారులకు ఇప్పుడు ₹250 ఆదా అవుతుంది. నృత్య బృందాలకు అలంకరణ మాస్క్‌లను పొందడం మరింత సాధ్యమయ్యేలా చేస్తుంది . తక్కువ ఖర్చు సాంప్రదాయ హస్తకళ వస్తువులకు ప్రాప్యత, డిమాండ్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ఎగుమతి
మార్కెట్లలో, ఈ మాస్క్‌లను యూకే, యూఎస్ఏ, ఫ్రాన్స్, జపాన్ అంతటా ప్రదర్శనలలో ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు కళాకారుల మార్జిన్‌లను, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతుంది.
పన్ను ఉపశమనం 150 సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని రక్షించడమే కాకుండా చరిదాలో జీవనోపాధిని కూడా సురక్షితం చేస్తుంది. సాంస్కృతిక పరిరక్షణ, గ్రామీణ ఆదాయాలు రెండింటినీ బలోపేతం చేస్తుంది.
కుష్మాండి చెక్క ముసుగులు
కుష్మాండి చెక్క ముసుగులు దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుష్మాండి బ్లాక్‌లో ముఖ్యంగా మహిస్బాతన్ గ్రామంలో కేంద్రీకృతమై ఉన్న శతాబ్దాల నాటి చేతివృత్తులు. ప్రధానంగా ప్రాంతీయ సమాజాలతో ముడిపడి ఉన్న ఈ కళ గోమిరా నృత్యంతో ముడిపడి ఉంది. ఇక్కడ చేతివృత్తులవారు ముసుగు తయారీ ప్రక్రియను భక్తి చర్యగా చూస్తారు. దాదాపు 250–300 మంది చేతివృత్తులవారు ఈ చెక్క ముసుగుల తయారీలో చురుకుగా పాల్గొంటారు. ఈ కుటుంబాలకు ఈ చేతి వృత్తులు అనుబంధ ఆదాయ వనరు, సాంస్కృతికకు ముఖ్యమైనగుర్తింపు.
జీఎస్టీ రేటును 12% నుండి 5%కి తగ్గించడం ఈ
సమాజానికి స్పష్టమైన ఉపశమనం కలిగిస్తుంది. ఈ తగ్గింపు ధరలలో దాదాపు 6.25% తగ్గింపుకు దారితీస్తుంది. అంటే ₹5,000 ధర గల మాస్క్ ₹312 పన్నులను ఆదా చేస్తుంది. చేతివృత్తులవారికి సంతలలో ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా ప్రత్యక్ష అమ్మకాలను మరింత లాభదాయకంగా చేస్తుంది.
పెరిగిన మార్జిన్లు, మెరుగైన అందుబాటు జీఎస్టీ సంస్కరణలు చేతివృత్తులవారు వారి పనులను నిలబెట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఈ 300 సంవత్సరాల పురాతన చెక్క ముసుగు సంప్రదాయం సాంస్కృతికంగా ఉత్సాహంగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చేస్తుంది.
షోలాపిత్ క్రాఫ్ట్
షోలాపిత్ క్రాఫ్ట్ బెంగాల్‌లోని అత్యంత సున్నితమైన, పవిత్రమైన కళా సంప్రదాయాలలో ఒకటి. దీనిని బర్ధమాన్, ముర్షిదాబాద్, బీర్భూమ్, నాడియా, హుగ్లీ, మాల్దా సౌత్ 24 పరగణాలు వంటి జిల్లాల్లో దాదాపు 5,000 మంది కళాకారులు ఆచరిస్తున్నారు. సాంప్రదాయకంగా షోలాపిత్ దండలను దేవతలకు అర్పించేవారు. నేడు, ఇది బెంగాల్ సాంస్కృతిక ఆచారాలకు, ప్రధానంగా దుర్గా పూజ వివాహాలకు అంతర్భాగంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో
సుమారు 5,000 మంది కళాకారులు ఈ చేతి వృత్తులలో నిమగ్నమై ఉన్నారు. హస్తకళాకారులు క్లిష్టమైన పనులపై నెలల తరబడి గడుపుతున్నారు.
జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించడం వల్ల ఈ శ్రమతో కూడిన క్రాఫ్ట్ పోటీతత్వం నేరుగా పెరుగుతుంది. సవరించిన రేటింగ్ ధర 6.25% తగ్గుతుంది. అంటే ₹2,500 ధర ఉన్న అలంకార వస్తువు ఇప్పుడు దాదాపు ₹156 చౌకగా లభిస్తుంది. చేతివృత్తులవారు ఎక్కువగా నైపుణ్యం కలిగిన కార్మికులపై ఆధారపడే మార్కెట్లో ఈ ఖర్చు ఉపశమనం చాలా ముఖ్యమైనది. ధర తగ్గింపు ఈ పర్యావరణ అనుకూలమైన, సాంప్రదాయ అలంకరణ వస్తువులు ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ అలంకరణ వస్తువులకు మరింత పోటీనిస్తాయి .
పన్ను తగ్గింపు దేశీయ, ఎగుమతి మార్కెట్లలో డిమాండ్‌ను పెంచుతుందని మరియు లాభదాయకతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఖర్చులను తగ్గించడం, పరిధిని విస్తరించడం ద్వారా జీఎస్టీ సంస్కరణలు " బెంగాల్ మూలికా ఐవరీ " అని పిలువబడే చేతివృత్తులను నిలబెట్టడానికి సహాయపడతాయి.
శాంతినికేతన్ తోలు వస్తువులు
బిర్భూమ్ జిల్లాలోని శాంతినికేతన్ బోల్పూర్ ప్రాంతం, సురుల్, బల్లవ్‌పూర్ వంటి చుట్టుపక్క పరిసర గ్రామాలలో కేంద్రీకృతమై ఉన్న శాంతినికేతన్ తోలు వస్తువుల క్లస్టర్, టాన్ చేసిన తోలుపై చేతితో ఎంబోస్ చేసిన బాటిక్, అప్లిక్యూ డిజైన్లకు చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి. విశ్వభారతి విశ్వవిద్యాలయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పాతుకుపోయిన ఈ క్రాఫ్ట్ పరిమిత ప్రత్యామ్నాయ ఉపాధి ఉన్న ప్రాంతాలలో జీవనోపాధికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. వందలాది మంది చేతివృత్తులవారికి ప్రత్యక్ష ఉపాధిని అందించే చిన్న ఎంఎస్ఎంఈల పంపిణీ నమూనా ద్వారా ఈ పరిశ్రమ వర్గీకరించబడింది. కోల్‌కత్తా, చుట్టుపక్కల ఉన్న విస్తృత తోలు క్లస్టర్లు సుమారు 5 లక్షల మందికి ఉపాధిని అందిస్తుంది.
ఈ వస్తువులకు దేశీయ మార్కెట్ ఉత్సాహంగా ఉంది. బోటిక్‌లు, ఎంపోరియా, జిఐ ట్యాగ్డ్, జిఐ హెరిటేజ్ వంటి ఆన్‌లైన్ కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. చిన్న సంస్థల వార్షిక టర్నోవర్ ₹ 50 లక్షల నుండి ₹ 2.5 కోట్ల మధ్య ఉంటుంది. ఈ రంగ ఆర్థిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. అంతర్జాతీయంగా ఈ తోలు పని జపాన్, యూఎస్ఏ, యూరప్‌లో డిమాండ్ ఉంది. ఇక్కడ కొనుగోలుదారులు భారీగా ఉత్పత్తి చేయబడిన ప్రత్యామ్నాయాల కంటే వాటి ప్రామాణికతకు

విలువ ఇస్తారు.
జీఎస్టీ రేటును 12% నుండి 5%కి తగ్గించడం వలన దాదాపు 6.25% ప్రత్యక్ష ధర తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు ₹2,000 ధర గల హ్యాండ్‌బ్యాగ్ ఇప్పుడు వినియోగదారునికి ₹125 ఆదా అవుతుంది. చేతివృత్తులవారు నిర్వహించే ఎంఎస్ఎంఈల కోసం, ఈ పన్ను ఉపశమనం సింథటిక్ వస్తువులతో పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుంది. మార్జిన్‌లను పెంచుతుంది. డిజైన్, నాణ్యత మార్కెటింగ్‌లో తిరిగి పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. వినియోగదారులకు ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తిదారులకు లాభదాయకతను పెంచడం
ద్వారా జీఎస్టీ సంస్కరణలు గ్రామీణ జీవనోపాధిని సంరక్షిస్తాయి.
ముగింపు
పశ్చిమ బెంగాల్‌లోని సాంప్రదాయ పరిశ్రమలు, సంపన్న వస్త్రాలు కొత్త జీఎస్టీ సంస్కరణలతో
గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. శాంతినికేతన్ తోలు నుండి మాల్దా మామిడి ఉత్పత్తుల వరకు వస్తువులపై సవరించిన రేట్లతో, ప్రభుత్వం వినియోగదారులకు సరసతను పెంచడం, చేతివృత్తులవారికి మార్జిన్‌లను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పండుగ సీజన్, ఆ పై తర్వాత కూడ అధిక అమ్మకాలు, ఉద్యోగ సంరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.
మరీ ముఖ్యంగా ఈ మార్పులు గ్రామీణ గృహాలకు జీవనాధారంగా నిలుస్తాయి. శతాబ్దాల నాటి సంప్రదాయాల కొనసాగింపును ప్రోత్సహిస్తూ వాటిని ఆధునిక మార్కెట్లతో సమలేఖనం చేస్తాయి.
(तथ्य सामग्री आईडी: 150622)
आगंतुक पटल : 37
Provide suggestions / comments