నాడు పోస్టు చేయడమైనది:
27 NOV 2026 8:03PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల కూటమి (ఐఓఆర్‌ఏ) 25వ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన 23 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల నాయకులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు.
హిందూ మహా సముద్రం నేపథ్యంలో వివిధ దేశాల మధ్య వేల ఏళ్లుగా చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు విస్తరించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఐఓఆర్ఏ అధ్యక్ష హోదాలో సభ్య దేశాలన్నిటితో కలసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా శాంతి, భద్రత, స్థిరత్వం, సమష్టి సౌభాగ్యం ఇనుమడించేలా ‘మహాసాగర్’ (ప్రాంతీయ దేశాల సంపూర్ణ-సర్వతోముఖ భద్రత-వృద్ధి) కార్యక్రమం అమలుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“న్యూఢిల్లీలో ఏఓఆర్‌ఏ 25వ మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన 23 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులతో సమావేశం కావడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.
హిందూ మహాసముద్రం అనాదిగా తన తీరం చుట్టూగల దేశల ప్రజలను అనుసంధానిస్తోంది. ప్రస్తుత ‘ఐఓఆర్‌ఏ’ అధ్యక్ష హోదాలో ‘మహాసాగర్’ పేరిట బృహత్ కార్యక్రమం అమలుకు భారత్ సంసిద్ధంగా ఉంది. ఆ మేరకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం, సమష్టి సౌభాగ్యం ఇనుమడించేలా భాగస్వామ్య దేశాలన్నిటితో సంయుక్తంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***