ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒలింపిక్ కల భారతదేశ వ్యాప్తంగా మహిళలకు నూతన అవకాశాలను కల్పిస్తుందని వివరిస్తున్న వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 2:31PM by PIB Hyderabad

ఒలింపిక్ కల భారతదేశ వ్యాప్తంగా మహిళలకు నూతన అవకాశాలను కల్పిస్తుందని వివరిస్తూ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారతదేశ ఆకాంక్ష... క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధానాన్ని, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్న తీరుని, ఆర్థిక స్వావలంబనకు సృష్టిస్తున్న మార్గాలను శ్రీమతి సింధు ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అస్మిత వంటి కార్యక్రమాలను, రాబోయే తరం మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తినివ్వటంలో క్రీడా విజయాల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

"దేశవ్యాప్తంగా మహిళలకు ఒలింపిక్ కల నూతన అవకాశాలను అందుబాటులోకి తీసుకు వస్తుంది.

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న భారత్ ఆకాంక్ష.. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధానాన్ని, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్న తీరుని, ఆర్థిక స్వావలంబనకు సృష్టిస్తున్న మార్గాలను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి @Pvsindhu1 వ్యాసంలో వివరించారు.

అస్మిత వంటి కార్యక్రమాలను, రాబోయే తరం మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తినివ్వటంలో క్రీడా విజయాల పాత్రను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు.

https://www.hindustantimes.com/opinion/india-hosting-the-olympics-will-empower-its-women-101795631127186.html”


(రిలీజ్ ఐడి: 2341934) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Nepali , हिन्दी , Bengali , Assamese , Gujarati , Malayalam