నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 7:50PM by PIB Hyderabad
వెనిస్ ఆర్ట్ బిన్నాలేలో ఉత్తమ జాతీయ పెవిలియన్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ‘విజిటర్స్ లయన్’ పురస్కారాన్ని భారత పెవిలియన్ గెలుచుకోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ కళా సాంస్కృతిక రంగాలకు గర్వకారణమన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“భారతీయ కళా, సాంస్కృతిక ప్రపంచానికి ఇది గర్వకారణమైన తరుణం!
వెనిస్ ఆర్ట్ బిన్నాలేలో జాతీయ పెవిలియన్ విభాగంలో ప్రతిష్ఠాత్మక విజిటర్స్ లయన్ పురస్కారాన్ని భారత పెవిలియన్ గెలుచుకోవడం సంతోషదాయకం.
సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన మన దేశ సాంస్కృతిక వారసత్వం నుంచి స్ఫూర్తిని పొందుతూ.. కళా ప్రపంచానికి మన కళాకారులు సరికొత్త దృక్పథాన్ని అందిస్తున్నారు.
మరెందరో భారతీయ యువత కళారంగం వైపు అడుగులు వేయడానికీ, సరికొత్త సృజనాత్మక శిఖరాలను అన్వేషించడానికీ ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను.”
***