57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

సోదరభావం, సంప్రదాయం, మారుతున్న కాలాల నేపథ్యంలో సాగే మధురమైన కథాచిత్రం ‘భాయ్ బ్యాండ్’... ఇఫీ- 2026లో ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 3:17PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341414Views: 2

మనీశ్ సైనీ దర్శకత్వం వహించిన గుజరాతీ చిత్రం ‘భాయ్ బ్యాండ్’ను.. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)- 2026లోని గాలా ప్రీమియర్ విభాగంలో ఈ రోజు ప్రదర్శించారు. గ్రామంలో సంప్రదాయ వివాహ బ్యాండ్‌ను నడిపే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక అభిప్రాయభేదం వారిద్దరినీ విడదీయడంతో వారి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. కొన్ని వారాల తర్వాత ఒక సోదరుడు డీజే సిస్టమ్, భారీ స్పీకర్లతో తిరిగి వచ్చి.. తన ఫోన్‌లోని ప్లేలిస్టుతో సిద్ధంగా ఉంటాడు. దాంతో ఆ సంప్రదాయ సంగీత బృందానికి అనూహ్య సవాలు ఎదురవుతుంది. సంప్రదాయ వృత్తులపైనా, కుటుంబాలను కలిపి ఉంచే మానవ సంబంధాలపైనా సాంకేతిక పురోగతి ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథ విశ్లేషిస్తుంది.

 

పీఐబీ ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మనీశ్ సైనీ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని గుజరాతీ భాష, సాంస్కృతిక నేపథ్యంలో రూపొందినప్పటికీ, దీనిలోని అంతర్లీన సందేశం, కథాంశం విశ్వవ్యాప్తమైనవని, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవుతాయని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ సినిమాలలో వేళ్లూనుకున్న కళాత్మక వ్యక్తీకరణలు, కథలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా.. విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు అవి చేరువయ్యేలా చేయడం అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా టైటిల్ తనకెంతో ఇష్టమని, దీనిని ఇద్దరు సోదరుల మధ్య ఉండే అనుబంధానికి సూచికగానూ, అలాగే పెళ్లి బ్యాండ్‌కు సూచికగానూ రెండు రకాలుగా అన్వయించుకోవచ్చని సైనీ తెలిపారు.

‘భాయ్ బ్యాండ్’ చిత్రాన్ని రంగులు, ఉత్సాహంతో నిండిన ఒక విలక్షణమైన సినిమాగా నటుడు ప్రీత్ కమానీ అభివర్ణించారు. తన తొలి గుజరాతీ చిత్రమైన ఇందులో దర్శకుడు మనీశ్ సైనీతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ.. చిత్ర నిర్మాణ సమయంలో తన సౌలభ్యాన్ని, సృజనాత్మక స్వేచ్ఛను ఆయన అభినందించారు. నటీనటుల ఎంపిక ప్రక్రియలోని ఒక ఆసక్తికరమైన సంఘటనను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ పాత్రకు తనను ఖరారు చేసే ముందు స్క్రీన్ టెస్ట్ చేసి చూడాల్సిందిగా తానే స్వయంగా దర్శకుడిని కోరినట్లు ఆయన వివరించారు.

తన నటనలో సహజత్వాన్ని తీసుకురావడానికి ఆ పాత్రను అర్థం చేసుకుని, ఆకళింపు చేసుకున్న తీరును నటుడు చిరాగ్ కత్రేచా వివరించారు. ఒక గాయకుడి పాత్రను పోషించడంలో ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ... ఇది ఎంతో శ్రమతో కూడుకున్నదైనప్పటికీ, ఆసక్తికరమైన అనుభవమని పేర్కొన్నారు.

ఎంతో ఆహ్లాదకరమైన, ఉల్లాసభరితమైన వ్యక్తిత్వంతో కూడిందంటూ నటి శ్రద్ధా డాంగర్ తన పాత్రను వివరించారు. చిత్ర బృందంతో కలిసి పనిచేసిన, చిత్ర నిర్మాణంలో వారితో గడిపిన ఆనందకరమైన సమయాన్ని ఆమె ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు.

హాస్యం, సంగీతం, ఆకట్టుకునే కథనంతో కూడిన ‘భాయ్ బ్యాండ్’ చిత్రం.. వివాహ వేడుకల్లో మారుతున్న సంగీత ధోరణులకు మాత్రమే పరిమితమైన కథ కాదు. ప్రాంతీయ కథన సాంస్కృతిక శక్తిని చాటేలా రూపుదిద్దిన ఈ సినిమా.. సాంకేతికత, సంప్రదాయ జీవనోపాధులు, మానవ సంబంధాల కలయికపై పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది.

 

ఈ మీడియా సమావేశానికి శ్రీ కిరణ్ మురళి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341414
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026