నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2026 2:30PM by PIB Hyderabad
పేదరికంపై భారత్ సాగిస్తున్న పోరాటం.. దేశవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న తీరును వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా.. పేదరికానికి మూల కారణాలను అన్వేషిస్తూ, సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించిందో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ వ్యాసంలో వివరించారు. ‘‘గృహ వసతి, ఆరోగ్య రక్షణ, స్వచ్ఛమైన తాగునీరు, బ్యాంకింగ్, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలను కల్పించడం ద్వారా కోట్లాది కుటుంబాలు సాధించిన ప్రగతిని, గ్రామీణ మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతున్న తీరును ఈ వ్యాసంలో ఆమె చక్కగా విశ్లేషించారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
కనీస అవసరాల నుంచి సరికొత్త జీవనోపాధి అవకాశాల వరకు.. పేదరికంపై భారత్ పోరాటం దేశవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తెస్తోంది!
ప్రధానమంత్రి @narendramodi నాయకత్వంలో ప్రభుత్వం కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా.. పేదరికానికి మూల కారణాలను అన్వేషిస్తూ, ఆ అడ్డంకులను శాశ్వతంగా తొలగించే ఎలా దృష్టి సారించిందో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి @nsitharaman తన వ్యాసంలో వివరించారు.
గృహ సదుపాయం, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు, బ్యాంకింగ్ సేవలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలను కల్పించడం ద్వారా కోట్లాది కుటుంబాలు సాధించిన పురోగతిని, గ్రామీణ మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతున్న తీరును ఈ వ్యాసంలో ఆమె చక్కగా విశ్లేషించారు.