రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో రూ. 1,976.40 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత రక్షణ మంత్రిత్వశాఖ

భారత నౌకాదళం కోసం బరాక్ పాయింట్ రక్షణ క్షిపణి వ్యవస్థ ఆధునికీకరణ, వాడుకలో లేని క్షిపణుల నిర్వహణ లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 5:46PM by PIB Hyderabad

భారత నౌకాదళ నౌకల్లోని బరాక్ పాయింట్ రక్షణ క్షిపణి వ్యవస్థ ఆధునికీకరణ, వాడుకలో లేని క్షిపణుల నిర్వహణ లక్ష్యంగా... ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం రూ. 1,976.40 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇతర మూలధన సేకరణ విధానం కింద కుదిరిన ఈ ఒప్పందంపై... న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

ఈ వ్యవస్థను ఆధునికీకరించడం ద్వారా భారత నావికాదళ వేదికలకు మెరుగైన ఫీచర్లు, శక్తిమంతమైన శ్రేణి యాంటీ-ఎయిర్ రక్షణ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా... ఈ వ్యవస్థ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను సమగ్రంగా ఉన్నతీకరిస్తారు.


(రిలీజ్ ఐడి: 2338258) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil