నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 8:18AM by PIB Hyderabad
గుజరాత్.. వడ్‌నగర్లోని చరిత్రాత్మక శ్రీ హట్‌కేశ్వర్ మహాదేవ్ మందిరంలో నిర్వహిస్తున్న 10 రోజుల విశ్వ శాంతి మహాయజ్ఞంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా 2026 నవంబర్ 18న పాలుపంచుకోనున్నారు.
ఈ నెల 11న మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని ఈ నెల 20న ముగించనున్నారు. ఈ మహాయజ్ఞాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ సమక్షంలో, స్వామీ జీ దివ్య మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి, సామాజిక సద్భావన, ప్రజా సంక్షేమం వంటి పవిత్ర ఉద్దేశాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, భారతదేశమంతటి నుంచి 144 మంది వైదిక పండితులు, భక్తులు పాలుపంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యానుష్ఠానాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
****