ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2026 6:21PM by PIB Hyderabad

భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

బిర్సా ముండా అజేయమైన ధైర్యసాహసాలు, పోరాట పటిమ, మాతృభూమి పట్ల అంకితభావం ప్రతి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

“భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించాను. ఆయన అజేయమైన ధైర్యసాహసాలు, పోరాట పటిమ, మాతృభూమి పట్ల అంకితభావం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్టు చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2336710) సందర్శకుల సూచీ సంఖ్య : : 8