57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

భారతీయ సినిమాను అంతర్జాతీయ చిత్ర పరిశ్రమతో అనుసంధానిస్తూ 20 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌

నాడు పోస్టు చేయడమైనది: 15 NOV 2026 2:40PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2336598Views: 11

సినిమా రంగంలో ఆలోచనల మార్పిడి, పరస్పర సహకారం, వ్యాపార అవకాశాలకు సంబంధించి ఈ ప్రాంతంలోని అత్యంత కీలక వేదికల్లో ఒకటైన వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌ 20వ ఎడిషన్‌ 2026 నవంబర్‌ 20 నుంచి 24వ తేదీ వరకు గోవాలోని తాజ్‌ సిడేడ్‌ డి గోవా హారిజన్‌లో జరగనుంది. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌ కింద పలు కీలక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో కో - ప్రొడక్షన్‌ మార్కెట్‌ ద్వారా ఎంపిక చేసిన చలనచిత్రాలను, డాక్యుమెంటరీలను అంతర్జాతీయ నిర్మాతలు, ఆర్థిక సహకార సంస్థలకు పరిచయం చేస్తారు. ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్‌రైటర్స్‌ ల్యాబ్‌ ద్వారా నూతన రచయితల్లోని ప్రతిభను ప్రోత్సహించి వారికి తగిన శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తారు. వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌ ల్యాబ్‌ ద్వారా తమ చిత్రాలను తుది రూపానికి తీసుకువస్తున్న దర్శక, నిర్మాతలకు నిపుణుల ద్వారా సూచనలు,సలహాలు అందిస్తారు. వ్యూయింగ్‌ రూమ్‌, మార్కెట్‌ స్క్రీనింగ్స్‌, ప్రొడ్యూసర్స్‌ ల్యాబ్‌ వంటి కార్యక్రమాలు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నెట్‌వర్కింగ్‌, ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడటంతో పాటు కొనుగోలుదారులు, పంపిణీదారులతో అనుసంధానం కావడానికి అవకాశాలు కల్పిస్తాయి.

నాలెడ్జ్‌ సిరీస్‌ ద్వారా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి అభివృద్ధి చెందుతున్న నూతన ధోరణులు, పంపిణీ వ్యవస్థ, వ్యాపార నమూనాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చిస్తారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పెవిలియన్లు, సాంకేతిక ప్రదర్శనలు, మార్కెట్‌ స్టాళ్లు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంతో పాటు, ప్రపంచ ఆడియో విజువల్‌ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను పరిచయం చేస్తాయి.

దక్షిణాసియా కథా చిత్రణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2007లో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) ప్రారంభించిన ఫిల్మ్‌ బజార్‌ కాలక్రమేణా అంతర్జాతీయ స్థాయిలో కీలక వేదికగా ఎదిగింది. ఇది చిత్ర దర్శకులు, నిర్మాతలు, ఆర్థిక సహాయకులు, పంపిణీదారులు, విక్రయ ప్రతినిధులు, చలనచిత్రోత్సవాల కార్యక్రమ రూపకర్తలను ఒకే వేదికపై అనుసంధానిస్తోంది. గత కొన్నేళ్లుగా పలు ప్రశంసలు పొందిన చిత్రాల ప్రస్థానంలో ఫిల్మ్‌ బజార్‌ కీలక పాత్ర పోషించింది. వాటిలో షిప్‌ ఆఫ్‌ థీసియస్‌ (2012), అన్హే ఘోడే దా దాన్‌ (2011), మిస్‌ లవ్లీ (2012), ఖిస్సా (2013), ది లంచ్‌బాక్స్‌ (2013), లయర్స్‌ డైస్‌ (2013), కోర్ట్‌ (2014), టిట్లీ (2014), మార్గరీటా విత్‌ ఎ స్ట్రా (2014), చౌతీ కూట్‌ (2015), దమ్‌ లగా కే హైషా (2015), తిథి (2015), న్యూటన్‌ (2017), మంటో (2018), ఫైర్‌ ఇన్‌ ద మౌంటెయిన్స్‌ (2021), ఇన్‌ ద బెల్లీ ఆఫ్‌ ద టైగర్‌ (2024), గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌ (2024), కాక్టస్‌ పియర్స్‌ (2025), షేప్‌ ఆఫ్‌ మోమో (2026), లిటిల్‌ థామస్‌ (2026) తదితర చిత్రాలు ఉన్నాయి. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ 21 ప్రాంతీయ భాషల్లో రూపొందిన 300కు పైగా చిత్రాలకు ఆర్థిక సహకారం కూడా అందించింది. వీటిలో అనేక చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.

ప్రస్తుతం విస్తృత వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌ పతాకం కింద పనిచేస్తున్న ఈ వేదిక దక్షిణాసియా సినిమాను అంతర్జాతీయ మార్కెట్లు, ప్రేక్షకులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో తన పరిధిని మరింత విస్తరించుకుంది. చిత్ర నిర్మాణంలోని వివిధ దశల్లో ఉన్న దర్శక, నిర్మాతలకు పరిశ్రమలోని సంస్థల సహకారం, మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, పంపిణీ అవకాశాలను కల్పిస్తూ ఈ వేదిక తోడ్పడుతోంది.

రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌ 20వ ఎడిషన్‌ సృజనాత్మక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, నూతన ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు కొత్త అవకాశాలను కల్పించడం ద్వారా ప్రపంచ చలనచిత్ర రంగంలో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2336598
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026