ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
14 NOV 2026 12:41PM by PIB Hyderabad
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం-2023 ప్రకారం కన్సెంట్ మేనేజర్ల రిజిస్ట్రేషన్ నియమావళి 2026 నవంబర్ 13న అమల్లోకి వచ్చింది. ఈ దశ అమల్లో భాగంగా కన్సెంట్ మేనేజర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన సంస్థలు దరఖాస్తు చేసేందుకు వీలుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ https://dpbi.gov.in పోర్టల్‌ను ప్రారంభించారు.
తమ వ్యక్తిగత డేటాకు సంబంధించిన అనుమతులపై డేటా ప్రిన్సిపల్స్‌కు మరింత నియంత్రణను అందించే వ్యవస్థను కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా వేసిన ముందడుగును ఈ నియమావళి సూచిస్తుంది. దశలవారీగా అమలు చేస్తున్న డీపీడీపీ నియమావళిలో ఇది ఒక భాగం. ఇది అర్హత కలిగిన సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, కన్సెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అందించేలా సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
కన్సెంట్ మేనేజర్ల పాత్ర, జవాబుదారీతనం
కన్సెంట్ మేనేజర్ అంటే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బోర్డు) వద్ద నమోదైన సంస్థ. ఇది అందుబాటులో ఉండే, పారదర్శకమైన, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పించే వేదిక ద్వారా డేటా ప్రిన్సిపల్స్ తమ సమ్మతిని తెలియజేయడానికి, నిర్వహణకు, సమీక్షించడానికి, ఉపసంహరించుకోవడానికి వీలును కల్పిస్తుంది. డేటా ప్రిన్సిపల్స్‌కు కన్సెంట్ మేనేజర్లు జవాబుదారీగా ఉండేలా చూస్తూ డిజిటల్ వ్యవస్థలో విశ్వసనీయతను, జవాబుదారీతనాన్ని ఈ నియమావళి బలోపేతం చేస్తుంది.
అర్హతలు, నమోదు ప్రక్రియ
కనీసం రూ. 2 కోట్ల నికర విలువతో తగిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి భారత్‌లో నమోదైన కంపెనీలు కన్సెంట్ మేనేజర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదైన సంస్థలు సురక్షితమైన, నమ్మకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడానికి అవసరమైన వనరులు, సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడటమే ఈ నిబంధనల ఉద్దేశం.
అర్హత కలిగిన కంపెనీలు రిజిస్ట్రేషన్ కోసం కొత్తగా ప్రారంభించిన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో బోర్డు పరిశీలిస్తుంది. అర్హత సాధించిన కంపెనీలను నమోదు చేస్తుంది. నమోదైన కన్సెంట్ మేనేజర్ల జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
డేటా ప్రిన్సిపల్స్ హక్కులు, డేటా నిర్వహణ సంస్థల బాధ్యతలు, అలాగే బోర్డు విచారణ, జరిమానా విధింపు ప్రక్రియలకు సంబంధించిన ఇతర కీలక నిబంధనలు 2027 మే 13 నుంచి అమల్లోకి రానున్నాయి.
డీపీడీపీ చట్టం-2023, డీపీడీపీ నిబంధనలు-2025 గురించి మరింత సమాచారం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://www.meity.gov.in/ లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సందేహాలను secretary[at]dpbi[dot]gov[dot]in కు మెయిల్ చేయవచ్చు.
కన్సెంట్ మేనేజర్ రిజిస్ట్రేషన్ నియమావళికి సంబంధించిన మరిన్ని వివరాలకు : click here.
***