మంత్రిమండలి
azadi ka amrit mahotsav

నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు 8.449 కి.మీ పొడవు, 5 స్టేషన్లతో ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపునకు కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2026 3:08PM by PIB Hyderabad

నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు 8.449 కి.మీ పొడవు, 5 స్టేషన్లతో ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 8.449 కిలోమీటర్ల పొడవైన కారిడార్లో 5 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మిస్తారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ మొత్తం 71.878 కిలోమీటర్లకు చేరుతుంది.

ప్రయోజనాలు, వృద్ధికి ఊతం:

నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపు నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకమైనది. నగరంలో మెట్రో రైలు వ్యవస్థను పెద్దఎత్తున విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

మెరుగైన అనుసంధానం:

నోయిడా మెట్రో ప్రాజెక్టులో భాగంగా నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్‌ను పొడిగించటం ద్వారా సుమారు 8.449 కిలోమీటర్ల మేర నూతన మెట్రో మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇది నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం తగినంత అనుసంధానం లేని ప్రాంతాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నోయిడా సెక్టార్-61 బ్లూ లైన్ ఇంటర్‌ఛేంచ్‌తో సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కారిడార్లకు నేరుగా అనుసంధానమవుతుంది.

నోయిడాలోని కీలక ప్రాంతాలను అనుసంధానించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అవి:

  • గౌర్ సిటీ మాల్, హెచ్‌అండ్‌ఎస్ మాల్, కార్యాలయాలు, గ్రేటర్ నోయిడా సెక్టార్-04లోని బ్లూ సఫైర్ మాల్, వాణిజ్య ప్రాంతాలు, నోయిడా సెక్టార్-51లోని ఐకియా, నోయిడా సెక్టార్-73లోని ఆంథూరియం మాల్ వంటి వాణిజ్య కేంద్రాలు.

  • నోయిడా సెక్టార్-60లోని టెక్ మహీంద్రా ఆఫీస్, టీసీఎల్ టెక్ ఆఫీస్, నోయిడా సెక్టార్-73లోని ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు, గ్రేటర్ నోయిడా సెక్టార్-04లోని గోల్డెన్ ఐ ఆఫీస్, వాణిజ్య కేంద్రాల వంటి ప్రధాన అంతర్జాతీయ సంస్థలు, ఐటీ హబ్స్.

  • నోయిడా సెక్టార్-122లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి విద్యా సంస్థలు.

  • కైలాష్ హాస్పిటల్, నోయిడా సెక్టార్-70లోని రామా హాస్పిటల్, నోయిడా సెక్టార్-51లోని క్లౌడ్9 హాస్పిటల్, నోయిడా సెక్టార్-62లోని రామా హాస్పిటల్ వంటి అత్యవసర వైద్య ఆరోగ్య సదుపాయాలు.

  • నోయిడా సెక్టార్-122లోని క్లియో కౌంటీ రెసిడెన్సీస్, గ్రేటర్ నోయిడా సెక్టార్-04లోని గౌర్ సిటీ 1, 2 వంటి ప్రధాన నివాస ప్రాంతాలు ఉన్నాయి.

నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపుతో కీలక ప్రాంతాలను మెట్రో వ్యవస్థతో అనుసంధానించటం ద్వారా కనెక్టివిటీ మెరుగవటంతో పాటు ఉపాధి, వ్యాపారం, విద్య, సాధారణ రవాణాకు సంబంధించి స్థానికులు, ప్రయాణికులకు పట్టణంలో ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది.

 

  • ట్రాఫిక్ రద్దీ తగ్గింపు: ప్రత్యామ్నాయ రోడ్డు రవాణా మార్గంగా మెట్రో రైలు ఎంతో దోహదపడుతుంది. నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపు వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో మెట్రో వ్యవస్థ మరింత విస్తరించి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రహదారిపై రద్దీ తగ్గటం ద్వారా వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రహదారి భద్రత మెరుగవుతుంది.

  • పర్యావరణ ప్రయోజనాలు: నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్‌ను పొడిగించటం నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో సమగ్ర మెట్రో రైలు వ్యవస్థను పెంచటం ద్వారా సంప్రదాయ శిలాజ ఇంధన రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

  • ఆర్థిక వృద్ధి: ప్రయాణ సమయం తగ్గటం, నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఢిల్లీ విమానాశ్రయం, ఢిల్లీ రైల్వే స్టేషన్లు, వివిధ బస్ డిపోల వంటి రవాణా కేంద్రాలకు మెరుగైన సౌకర్యం లభించటం వల్ల ప్రజలు కార్యాలయాలు, గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవచ్చు. ఇది ఉత్పాదకతను పెంచుతుంది. నూతన మెట్రోస్టేషన్ల సమీప ప్రాంతాల్లో స్థానిక వ్యాపారాలు పుంజుకునేందుకు, అభివృద్ధి చెందని ప్రాంతాల్లో పెట్టుబడులు, అభివృద్ధిని ఆకర్షించేందుకు మెరుగైన అనుసంధానత దోహదపడుతుంది.

  • సామాజిక ప్రభావం: నోయిడాలో నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ విస్తరణ ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తుంది. ఇది వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలకు మేలు చేకూరుస్తుంది. రవాణా అసమానతలను తగ్గిస్తుంది. తద్వారా ప్రయాణ సమయం తగ్గి, అత్యవసర సేవల లభ్యత మెరుగవటంతో ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతంగా మారతాయి.

  • నోయిడా మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వాలైన్ మెట్రో రైలు కారిడార్ పొడిగింపు నగరానికి విప్లవాత్మక అభివృద్ధిగా నిలుస్తుంది. ఇది మెరుగైన అనుసంధానత, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పర్యావరణ ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. కీలకమైన పట్టణ సవాళ్లను పరిష్కరించటం ద్వారా భవిష్యత్ విస్తరణకు బలమైన పునాది వేస్తూ నగర అభివృద్ధి గమనాన్ని, సుస్థిరతను తీర్చిదిద్దటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2335071) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Malayalam , English , Urdu , हिन्दी , Gujarati , Kannada