నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 1:54PM by PIB Hyderabad
ఐఎన్ఎస్ బెట్వా నౌక సాధారణ మరమ్మతులు, రీపవరింగ్ కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌తో రూ. 498.58 కోట్ల విలువైన ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వశాఖ కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో 2026 నవంబర్ 11న రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి.
image.png
ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి చెందిన బ్రహ్మపుత్ర తరగతి ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ బెట్వా నౌక ప్రొపల్షన్ వ్యవస్థలో ప్రధాన మార్పు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆవిరి ఆధారిత ప్రొపల్షన్ వ్యవస్థ స్థానంలో డీజిల్ ఇంజిన్ ఆధారిత ప్రొపల్షన్ వ్యవస్థను అమరుస్తారు. ఈ పునరుద్ధరణలో భాగంగా ఆధునిక ఆయుధ వ్యవస్థలను అమర్చడం ద్వారా నౌక పోరాట సామర్థ్యాలను కూడా మెరుగు పరుస్తారు. తద్వారా నౌక కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతారు.
నౌక మరమ్మతు, నిర్వహణ రంగంలో, ప్రధానంగా సంక్లిష్టమైన ప్రొపల్షన్ వ్యవస్థ మార్చడం, యుద్ధ నౌకలను ఆధునికీకరించడంలో స్వదేశీ సామర్థ్యాలను ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో 50కి పైగా ఎంఎస్‌ఎంఈలు పాల్గొంటాయని అంచనా. తద్వారా భారతీయ నౌకా నిర్మాణం, దాని అనుబంధ పరిశ్రమల్లో గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
దేశీయ యుద్ధ నౌకల మరమ్మతు, నిర్వహణ సామర్థ్యాలను ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది. అలాగే ప్రభుత్వ లక్ష్యాలైన ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్-ఇన్-ఇండియా’కు వేగాన్ని జోడిస్తుంది.