నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 3:14PM by PIB Hyderabad

2026 నవంబర్ 5న గువాహటికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలోని సోనాపూర్ టోల్ గేట్ సమీపంలో ఏనుగు దంతాల అక్రమ రవాణా యత్నాన్ని పక్కా సమాచారం ఆధారంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్‌ఐ) అధికారులు అడ్డుకున్నారు.
సాయంత్రం 5.40 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న అయిదుగురు అనుమానితులను డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. వారిలో ఒకరు ఏనుగు దంతాలు ఉన్నట్లు అనుమానిస్తున్న సంచిని తీసుకెళ్తున్నారు. అధికారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు ఖుక్రీ, డావో (పదునైన ఆయుధాలు) చూపిస్తూ అధికారులపైకి దూసుకెళ్లారు. అనంతరం సంచిని అక్కడే వదిలేసి సమీపంలోని గ్రామంలోకి పారిపోయారు.
వదిలివెళ్లిన సంచిని తనిఖీ చేయగా.. 29 అంగుళాలు, 30 అంగుళాల పొడవు కలిగిన రెండు ఏనుగు దంతాలు లభించాయి. వీటి మొత్తం బరువు సుమారు 3.7 కిలోలు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనల ప్రకారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు, చర్యల కోసం వాటిని అస్సాం రాష్ట్ర అటవీశాఖకు అప్పగించారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్-I, అంతరించిపోతున్న వన్యజీవులు, వృక్షజాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ (సీఐటీఈఎస్)లోని అనుబంధం-I ప్రకారం ఏనుగు దంతాలకు రక్షణ ఉంది. రక్షించారు. ఇలాంటి రక్షిత జంతువుల నుంచి తయారైన వస్తువులను అమ్మడం, కొనడం లేదా వ్యాపారం చేయడం భారత చట్టాల ప్రకారం నిషేధం.
నిఘా సమాచారం ఆధారంగా చర్యలు చేపట్టడం, సంబంధిత ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకోవడం ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా, రక్షిత జంతుజాతుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు డీఆర్‌ఐ కట్టుబడి ఉంది.
***