సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 7:55PM by PIB Hyderabad

ఆన్‌లైన్ మాధ్యమంలో నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ యువా, వికసిత్ భారత్ క్విజ్’కు చక్కని ప్రతిస్పందన లభిస్తోంది. దీనిలో 2026 నవంబర్ 5 నాటికి 16,517 మంది పౌరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు తావు ఉండని భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ఉమ్మడి ప్రయత్నంలో పాలుపంచుకుంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటం, మరీ ముఖ్యంగా యువతలో ఈ విషయంపై చైతన్యం విస్తరిస్తుండటం ప్రజాభాగస్వామ్యానికి అద్దం పడుతోంది.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత కల్పన మంత్రిత్వ శాఖ ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎమ్‌బీఏ)లో భాగంగా ప్రశ్నోత్తరాల పోటీని 2026 అక్టోబర్ 26న మొదలుపెట్టింది. మత్తుపదార్థాలను సేవించడం వల్ల కలిగే హానికర ప్రభావాల పట్ల చైతన్యాన్ని పెంపొందింపచేయడం, పౌరులకు.. ప్రత్యేకించి యువతీయువకులకు.. మాదకద్రవ్యాల అలవాటును మాన్పించి ‘నశా ముక్త్ భారత్’ను ఆవిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించేటట్లు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ధ్యేయం.

క్విజ్‌ను 2026 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో దేశ ప్రజలందరు పాల్గొనవచ్చు. పాల్గొనే వారి కోసం క్విజ్‌ను ‘మై భారత్’ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు.
ఈ కింది లింకును సందర్శించి క్విజ్ లో పాల్గొనవలసి ఉంటుంది:
https://mybharat.gov.in/quizzes/yuva/detail/Url9dlIwCinQVSf8lwPB9w/
‘నశా ముక్త్ భారత్ అభియాన్’ను 2020 ఆగస్టు 15న ప్రారంభించారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవచ్చు, అవగాహనను పెంపొందించుకోవడం ఎలా, చికిత్స, పునరావాసం, సామూహిక భాగస్వామ్యం వంటి పద్ధతులతో మాదక పదార్థాల వాడుకకున్న డిమాండును తగ్గించే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం ఈ అభియాన్ లక్ష్యం. ఈ ప్రచార ఉద్యమాన్నిమొదటి దశలో 272 జిల్లాల్లో మొదలుపెట్టారు. తరువాత ఈ ప్రచార ఉద్యమాన్ని దేశంలో అన్ని జిల్లాలకు తీసుకుపోయారు.

35.09 కోట్ల మందికి ఈ ప్రచార ఉద్యమాన్ని గురించి వివరించారు. వారిలో 13.99 కోట్ల మంది యువత, 10.91 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాలు ఈ ప్రచార ఉద్యమం పట్ల అవగాహన, ప్రచార ఉద్యమం దేశంలో పలువురి చెంతకు చేరుకుంటోందని చాటుతున్నాయి.
ఈ అభియాన్‌లో భాగంగా, విద్యాసంస్థలలో 32.43 లక్షల కార్యకలాపాలను చేపట్టారు. దేశం నలు మూలలా పనిచేస్తున్న 755కి పైగా సామాజిక న్యాయం, సాధికారత కల్పన విభాగం (డీఓఎస్‌జేఈ) అండదండలున్న నశా ముక్తి కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా 39.91 లక్షల మందికి చికిత్సలు పూర్తి చేసి పునరావాసం కల్పించారు. నశా ముక్తి ప్రతిజ్ఞ పూనిన వ్యక్తుల మొత్తం సంఖ్య 45.07 లక్షలను మించింది. వీరిలో 2 లక్షల మందికి పైగా ‘నశా ముక్తి మిత్ర’లుగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు.

మై భారత్ క్విజ్ క్యూఆర్
ఈ అభియాన్ మొదలై ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. మత్తుపదార్థాల వాడకంతో కలిగే దుష్ప్రభావాల విషయమై ప్రజలకు మరింత అవగాహనను కలగజేయడం, విషయాలు తెలుసుకొని తగిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా వారికి సూచించడం, చైతన్య ప్రబోధంతో పాటు నివారణకు క్రియాశీల రాయబారులుగా పనిచేసేటట్లు వారిని ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధానోద్దేశాలు. ఈ కార్యక్రమం దేశాభివృద్దిలో ఆరోగ్యవంతులు, కుటుంబాలు, సముదాయాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ, ‘నశా ముక్త్ భారత్’తో పాటు ‘వికసిత్ భారత్’ దార్శనికతకు దోహదం చేస్తోంది.

క్విజ్‌లో బహుళ ప్రత్యామ్నాయాలుండే ప్రశ్నలు (ఎమ్‌సీక్యూస్) 20 పొందుపరిచారు. వీటికి క్విజ్‌లో పాల్గొనే వారు 10 నిమిషాల వ్యవధి లోపల సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వారు క్విజ్‌లో పాలుపంచుకున్నట్లుగా తెలియజేసే ఓ ధ్రువపత్రాన్ని సిద్ధం చేస్తారు.

నశా ముక్తి మిత్ర్ గా నమోదు చేసుకొనేందుకు క్యూఆర్ కోడ్
క్విజ్ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత సరి అయిన జవాబును అభ్యర్థి చూడవచ్చును. దీంతో వారు మాదక పదార్థాల వాడకాన్ని అడ్డుకొనే విషయంలో అవగాహన పెంచుకోగలుగుతారు.

ఎన్ఎమ్‌బీఏ మొబైల్ యాప్
ఈ డిజిటల్ కార్యక్రమం ద్వారా సాముదాయక భాగస్వామ్యాన్ని పటిష్టపరచాలని, బాధ్యతాయుత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, పౌరులలో ప్రత్యేకించి యువతను మాదక ద్రవ్యాల సేవనానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో తోడ్పడే విధంగా ప్రేరణను కలిగించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్ఎమ్‌బీఏ ఈ-ప్లెడ్జ్ క్యూఆర్ కోడ్
‘నశా ముక్త్ యువా, వికసిత్ భారత్ క్విజ్’లో 2026 నవంబర్ 25వ తేదీ లోపల పాలుపంచుకొని, మత్తుపదార్థాలకు చోటునివ్వని భారతదేశం దిశగా పయనించాలనే ఉమ్మడి దృష్టికోణానికి తమ వతు క్రియాత్మక తోడ్పాటును ఇవ్వాలంటూ దేశ ప్రజలందరిని, ముఖ్యంగా యువజనులను సామాజిక న్యాయం, సాధికారత కల్పన మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది.
***