జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఎన్‌హెచ్ఆర్‌సీ జోక్యంతో హైదరాబాద్ కేంద్ర కారాగారంలో లింగపరంగా వైవిధ్యమైన గుర్తింపు, వ్యక్తీకరణలు కలిగినవారి కోసం జెండర్ న్యూట్రల్ సెల్ ఏర్పాటు


ఈ జెండర్ న్యూట్రల్ సెల్‌లో ఉంచిన వారు తమ గుర్తింపునకు తగిన దుస్తులను ధరించేందుకు అనుమతిచ్చిన కారాగార అధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 11:41AM by PIB Hyderabad

లింగపరంగా వైవిధ్యమైన గుర్తింపు, వ్యక్తీకరణలు కలిగిన వారి గౌరవాన్ని కాపాడేందుకు, తగిన వసతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక జెండర్–న్యూట్రల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ కేంద్ర కారాగార అధికారులు భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ)కి తెలియజేశారు.

ట్రాన్స్‌జెండర్లు, ఎల్‌జీబీటీక్యూప్లస్ వర్గాల హక్కులకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు కమిషన్ నియమించిన ప్రత్యేక పర్యవేక్షకుడు 2026 అక్టోబర్ 8న జైలును సందర్శించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. తన పర్యటనలో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి భరోసా ఇచ్చేలా ఎన్‌హెచ్ఆర్‌సీ, ఎంహెచ్ఏ సూచనలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ కేంద్ర కారాగార సూపరింటెండెంట్ దీని అమలుకు సంబంధించిన నివేదికను కమిషన్‌కు అందజేశారు. దీనిలో జెండర్ న్యూట్రల్ సెల్ ఏర్పాటు చేయాలన్న సిఫార్సులను అమలు చేసినట్లు తెలియజేశారు. దీనితో పాటుగా ఈ సెల్‌లో ఉండేవారు తమ గుర్తింపునకు తగిన దుస్తులను ధరించేందుకు కూడా జైలు అధికారులు అనుమతినిచ్చారు.

కారాగారాల్లో లింగపరంగా విభిన్నమైన గుర్తింపులు, వ్యక్తీకరణలు కలిగిన వారి మానవ హక్కులు, గౌరవ పరిరక్షణను ప్రోత్సహించేందుకు కమిషన్ చేపడుతున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.  

***


(రిలీజ్ ఐడి: 2333044) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati