ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబర్‌ 5న ఆసియా పారా క్రీడలు-2026లో పాల్గొన్న భారత బృందంతో భేటీ కానున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 2:53PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 నవంబర్‌ 5న సాయంత్రం సుమారు 4:30 గంటలకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆసియా పారా క్రీడలు-2026లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. 

ఈ ఏడాది జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మొత్తం 97 మంది భారత పారా అథ్లెట్లు 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో కలిపి 114 పతకాలు సాధించారు. 

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, శిక్షకులు, భారత పారా ఒలింపిక్‌ కమిటీ, భారత ఒలింపిక్‌ సంఘం అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొంటారు.

***


(రిలీజ్ ఐడి: 2332485) సందర్శకుల సూచీ సంఖ్య : : 19