ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2026 11:36AM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్-1లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖల అధికారులు, సిబ్బందితో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు వల్లభభాయ్ పటేల్ అందించిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయ స్ఫూర్తిని అందిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిలా శ్రీవాస్తవ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం (డీసీపీసీ) కార్యదర్శి శ్రీ తేజ్‌వీర్ సింగ్, ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) డాక్టర్ లవ్నీష్ జీ. కృష్ణ, నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) సీఈఓ శ్రీ సునీల్ కుమార్ బర్న్వాల్‌తో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతలను పరిరక్షించటంలో అధికారులు, సిబ్బంది ఉమ్మడి నిబద్ధతను ప్రతిజ్ఞా మహోత్సవం ద్వారా స్పష్టం చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను గౌరవించటమే కాక, జాతీయ ఐక్యత, సంఘీభావం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏటా అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ను జరుపుకుంటాం.

అభివృద్ధి చెందిన, ఐక్య భారత్ దిశగా నడిపిస్తున్న ఐక్యత, సమగ్రత, జాతీయ సమైక్యత ఆదర్శాలకు అనుగుణంగా దేశ నిబద్ధతను స్పష్టం చేసేందుకు ఈ వేడుక ఉపయోగపడింది.

 

***


(రిలీజ్ ఐడి: 2331346) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil