ఆర్థిక మంత్రిత్వ శాఖ
త్రిచీ విమానాశ్రయంలో వన్యప్రాణుల దొంగ రవాణా ముఠా గుట్టును రట్టు చేసిన డీఆర్ఐ.. 45 సరీసృపాల స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
రహస్య సమాచారం అందడంతో, త్రిచీ విమానాశ్రయం వద్ద కస్టమ్స్ విభాగం సహకారంతో దాడి..
బ్యాంకాక్ నుంచి కొలంబో మీదుగా వస్తున్న ప్రయాణికుల సామానులో
ఆహార పొట్లాల లోపల స్పృహలో లేని సరీసృపాల స్వాధీనం
నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 11:03AM by PIB Hyderabad
త్రిచీ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా 45 సరీసృపాలను భారత్లోకి దొంగరవాణా చేయడానికి ప్రయత్నించగా, ఆ ప్రయత్నాన్ని విమానాశ్రయ రహస్య సమాచార విభాగం (ఏఐయూ) తో కలిసికట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దాడి చేసి విఫలం చేసేసింది. నిర్దిష్ట గోప్య సమాచారం అందిన మీదట, డీఆర్ఐ ఈ నెల 26న బ్యాంకాక్ నుంచి కొలంబో మీదుగా వస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణికులను ఆపింది. వారి సామాన్లను క్షుణ్నంగా తనిఖీ చేయగా, భోజనం తాలూకు 27 పొట్లాలలో దాచిపెట్టిన వన్యజీవాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పాకుడు జంతువులకు నిద్ర పోయే మందు పెట్టారని గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న సరీసృపాలలో 23 కార్న్ స్నేక్స్, 16 బాల్ పైథాన్స్, 5 అర్జెంటీనా జాతి తెలుపు, నలుపు కొండచిలువలు, ఒక స్నో వైట్ ఇగువానా ఉన్నాయి. ఆ పాకుడు జంతువులను జప్తు చేశారు. ప్రయాణికులిద్దరినీ కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం త్రిచీ ఏఐయూ అధికారులు అరెస్టు చేశారు. ప్రయాణికుల సామానును సోదా చేసినప్పుడు పట్టుకున్న వన్యజీవాలను, తదుపరి దర్యాప్తు కోసం త్రిచీ ఏఐయూకు అప్పగించారు.
గోప్య సమాచారం అందిన మీదట కస్టమ్స్ అధికారుల సన్నిహిత సమన్వయం ఏర్పరుచుకొని ప్రభావవంతమైన కార్యకలాపాల నిర్వహణ ద్వారా దొంగ రవాణా గుట్టును విజయవంతంగా అడ్డుకొన్న ఈ ఘటన వన్యప్రాణులను దేశంలో వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడాన్ని, అటవీ జీవుల దొంగ రవాణా అరికట్టడానికి డీఆర్ఐ నిబద్దతతో కృషి చేస్తోందని చాటుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2329446)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9