రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి భారత రైల్వే ప్రకటన


ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు... నవంబర్ 25, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు అవకాశం

ఆర్‌ఆర్‌బీ ముంబయి పరిధిలో అత్యధికంగా 177 ఖాళీలు... తర్వాతి స్థానాల్లో జమ్మూ- శ్రీనగర్ (122), చెన్నై (199)

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 5:45PM by PIB Hyderabad

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం భారత రైల్వే ఉపాధి ప్రకటన చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (సీఈఎన్) నం. 08, 2026 ద్వారా స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించటంతో పాటు రైల్వే కార్యకలాపాల సిబ్బందిని మరింత బలోపేతం చేయటమే ఈ నియామక ప్రక్రియ ఉద్దేశం.

రైల్వే రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి, రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి స్టేషన్ మాస్టర్ నియామకాలను ప్రత్యేకంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా అభ్యర్థులకు అర్హత ప్రమాణాలు, పరీక్షా విధానం, పోస్టుల ఖాళీల వివరాలతో ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుంది.

సీఈఎన్ 08, 2026 ద్వారా ఇచ్చిన ఆర్‌ఆర్‌బీ ఖాళీల వివరాల ప్రకారం... వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, జోన్లలో మొత్తం 1,265 ఖాళీలు ఉన్నాయి. ఈ అవకాశాలు దేశంలోని పలు రైల్వే జోన్లలో అందుబాటులో ఉండటం వల్ల అర్హులైన గ్రాడ్యుయేట్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పోస్టులకు పోటీపడే వీలుంది.

ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. నవంబర్ 25, 2026న ముగుస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించే ముందు అర్హత నిబంధనలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు సూచనలను పరిశీలించాల్సిందిగా బోర్డు సూచించింది.

నియామక పూర్తి నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, పరీక్షా సిలబస్, దరఖాస్తు సూచనలు, ఆర్ఆర్‌బీ వారీగా ఖాళీల వివరాలను అధికారిక లింకుల ద్వారా అభ్యర్థులు తెలుసుకోవచ్చు:

పూర్తి నోటిఫికేషన్ - సీఈఎన్ నం. 08, 2026, స్టేషన్ మాస్టర్: https://rrb.indianrailways.gov.in/-/image/1793016771817CEN_08_2026_StationMaster.pdf/examsDocuments

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌: https://rrb.indianrailways.gov.in/

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పోర్టల్‌: https://www.rrbapply.gov.in/

నియామకాలకు సంబంధించిన తాజా సమాచారం, సూచనల కోసం అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ సూచించింది.

***


(రిలీజ్ ఐడి: 2329297) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Kannada , Malayalam