ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సాధించిన సందీప్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 10:29PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల టీ44 ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన సందీప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

400 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించి, ప్రపంచ రికార్డును నెలకొల్పి ఈ పతకాన్ని గెలవటం ద్వారా ఈ క్రీడా పర్యటనను మరింత చిరస్మరణీయంగా మార్చుకున్నారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన భవిష్యత్తులోనూ ఉన్నత శిఖరాలను చేరాలని, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల టీ44 ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన సందీప్‌కు అభినందనలు!

400 మీటర్లలో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణ ఈ పతకాన్ని సాధించటం ద్వారా ఆయన ఈ క్రీడా పర్యటనను చిరస్మరణీయంగా మార్చారు. ఆయన భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నాను: పీఎం @narendramodi”


(రిలీజ్ ఐడి: 2327949) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Malayalam