నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 6:09PM by PIB Hyderabad
2026 ఆసియా పారా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ క్లాస్ ఎక్స్‌డీ7 ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన భావినా పటేల్, శుభమ్ వాధ్వాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి పతకం మాత్రమే కాదు…. భారత పారా టేబుల్ టెన్నిస్ చరిత్రలో ఇది కీలక ఘట్టంగా నిలిచిందన్నారు.
వారి టీమ్‌వర్క్, అంకితభావం, దృఢ నిశ్చయం దేశానికి గర్వకారణంగా నిలిచాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కీలక ఘట్టాన్ని సాధించిన ఇద్దరు క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ… భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"భారత పారా టేబుల్ టెన్నిస్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
2026 ఆసియా పారా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ క్లాస్ ఎక్స్‌డీ7 ఈవెంట్‌లో భావినా పటేల్, శుభమ్ వాధ్వా కాంస్య పతకం సాధించారు. ఈ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి పతకం.
వారి టీమ్‌వర్క్, అంకితభావం, దృఢ నిశ్చయం దేశానికి గర్వకారణం.
ఈ కీలక ఘట్టాన్ని సాధించిన ఇద్దరు క్రీడాకారులకు అభినందనలు.
భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నా: పీఎం @narendramodi”
***