ప్రధాన మంత్రి కార్యాలయం
స్వేచ్చ, స్వాతంత్య్రాల వాస్తవిక ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 8:12AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. నిజమైన స్వేచ్ఛ.. అనగా వ్యక్తులను భయం నుంచీ, పరాధీనత నుంచీ విముక్తిని ప్రసాదించి ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించగలిగేలా చూడటంలో ఉందని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యావదస్యాస్వతన్త్రత్వం తావదీశ్వరతో భయమ్
య ఏతత్సముపాసీరంస్తే ముహ్యన్తి శుచార్పితాః’’ అని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన శ్లోకానికి భావం ఇదీ.. మనుషులు తమను స్వతంత్రులుగా భావించనంత కాలం తమ కన్న పెద్ద శక్తికి భయపడుతూ, జీవిస్తుంటారు. ఈ తథ్యాన్ని నమ్మే వారు భయ, దుఃఖాల వలలో చిక్కుకొని భ్రమలలో పడిపోతారు. నిజానికి, మనుషులకు భయం, పరాధీనతల నుంచి విముక్తం చేసి వారు ఆత్మవిశ్వాసంతోనూ, ఆత్మగౌరవంతోనూ బతుకగలిగేటట్లు చూడడంలోనే స్వాతంత్య్ర ప్రాధాన్యం వ్యక్తమవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2327272)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam