ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సాధించిన పర్వీన్‌కు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2026 6:48PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో సీజన్లోనే అత్యుత్తమ త్రో విసిరి కాంస్యం సాధించిన పర్వీన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం పట్ల గర్వం వ్యక్తం చేశారు.

పర్వీన్ ప్రదర్శించిన అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు. మరిన్ని విజయాలు సాధించేలా ఈ గెలుపు అతడికి స్ఫూర్తినిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో అత్యుత్తమ త్రో విసిరి కాంస్యం సాధించిన పర్వీన్ మనందరికీ గర్వకారణంగా నిలిచారు. ఆయన అంకితభావం, పట్టుదల ప్రశంసనీయం. మరిన్ని విజయాలు సాధించేలా ఈ గెలుపు ఆయనకు మరింత స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’

***


(రిలీజ్ ఐడి: 2326573) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam