నాడు పోస్టు చేయడమైనది:
20 OCT 2026 7:36PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడల్లో పురుషుల సింగిల్స్ క్లాస్ - 1 విభాగంలో కాంస్య పతకం సాధించిన జెహాన్ దొరాబ్ మదన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత పారా టేబుల్ టెన్నిస్ బృందం దేశానికి గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. జెహాన్ సాధించిన విజయం క్రీడ పట్ల అతని ఆసక్తి, నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
“భారత పారా టేబుల్ టెన్నిస్ బృందం మనందరికీ గర్వకారణంగా నిలుస్తోంది. ఆసియా పారా క్రీడలు - 2026లో పురుషుల సింగిల్స్ క్లాస్ - 1 విభాగంలో జెహాన్ దొరాబ్ మదన్ కాంస్య పతకం సాధించారు. ఆయన విజయం క్రీడ పట్ల ఆయనకున్న ఆసక్తి, నైపుణ్యాలకు నిదర్శనం. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.