ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల ఆదాయాన్నీ , గ్రామాల్లో సౌభాగ్యాన్నీ పెంపొందించడంలో అగ్రివోల్టాయిక్స్ సత్తాను వివరించిన కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషీ, శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌ల వ్యాసం..
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 11:52AM by PIB Hyderabad
కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషీ, శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
వ్యవసాయాన్ని సౌర విద్యుచ్ఛక్తి ఉత్పాదనతో ముడిపెడుతూ రైతుల ఆదాయాన్ని పెంచడానికి అగ్రివోల్టాయిక్స్ సాంకేతిక పరిజ్ఞానికున్న శక్తిసామర్థ్యాలను కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషీ, శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాసంలో వివరించారు. అగ్రివోల్టాయిక్స్ ఏ విధంగా అదనపు రాబడిని అందిస్తూ, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు పంట దిగుబడికి దన్నుగా ఉంటుందన్నది ఈ వ్యాసం తెలియజేసింది. వ్యవసాయ క్షేత్రాలకు అదనపు శక్తిని జోడించడంతో పాటు పల్లెల సౌభాగ్యాన్ని ఇనుమడింప చేసే దూరదృష్టికి ఈ వ్యాసం అద్దం పట్టింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘వ్యవసాయానికి సౌర విద్యుచ్ఛక్తి ఉత్పాదనను ముడిపెడుతూ రైతుల ఆదాయాన్ని పెంపొందింపచేయడంలో అగ్రివోల్టాయిక్స్ పోషించే ముఖ్యపాత్రను గురించి కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషీ, శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. ఇది అదనపు రాబడిని ఎలా అందిస్తున్నదీ, ఇంధన ఖర్చులను ఎలా తగ్గిస్తున్నదీ, పంట దిగుబడికి ఎలాగ దన్నుగా నిలుస్తున్నదీ వారు ప్రస్తావించారు.
పొలాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వడంతో పాటు, పల్లెల సౌభాగ్యాన్ని ఇనుమడింపచేయడానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేసే వ్యాసమిది. దీనిని తప్పక చదవగలరు’’ అని పేర్కొంది.
https://indianexpress.com/article/opinion/columns/india-solar-farming-viksit-bharat-agrivoltaics-10929961/lite/
***
(రిలీజ్ ఐడి: 2325812)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9