ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో రజతం సాధించిన ప్రీతి పాల్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 8:59PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో రజత పతకం సాధించిన ప్రీతి పాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

పట్టుదల, అంకితభావానికి ప్రీతి పాల్‌ అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే పోటీల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

“పట్టుదల, అంకితభావానికి ప్రీతి పాల్‌ చక్కని ఉదాహరణ. ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. రాబోయే పోటీల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 2325760) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam