ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న దేవేందర్ కుమార్‌కు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 9:36PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు-2026లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో స్వర్ణం సాధించిన దేవేందర్ కుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

 

ఈ విజయం గొప్ప ఆనందాన్ని కలిగిస్తోందనీ, పారా క్రీడల్లో పెరుగుతున్న భారత్ ప్రాభవాన్ని తెలియజేస్తోందన్నారు. దేవేందర్‌కు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టు:

 

‘‘ఆసియా పారా క్రీడలు-2026లో పురుషులు డిస్కస్ త్రో ఎఫ్43/ఎఫ్44/ఎఫ్62/ఎఫ్64 విభాగంలో అద్భుతమైన రీతిలో త్రో విసిరి దేవేందర్ కుమార్ విజేతగా నిలిచారు. ఇది గొప్ప ఆనందాన్ని కలిగించే, పారా క్రీడల్లో పెరుగుతున్న భారత్ ప్రాభవాన్ని తెలియజేసే విజయం. స్వర్ణం సాధించిన దేవేందర్‌కు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్నివిజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’ 


(రిలీజ్ ఐడి: 2325758) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam