ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌ స్వర్ణపతక విజేత నిషాద్ కుమార్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 9:47PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌-2026 పురుషుల హై జంప్ టి47 విభాగంలో సరికొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన నిషాద్ కుమార్‌ అద్భుత క్రీడా ప్రతిభను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

 

ఇది అతనికి రెండో స్వర్ణం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ దేశంలోని యావత్ ప్రజానీకం అభిమానాన్ని చూరగొన్న అతని బహుముఖ ప్రజ్ఞ, అత్యున్నత స్థానంలో నిలవాలనే తపన నిజంగా అసాధారణని శ్రీ మోదీ కొనియాడారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 

“నిషాద్ క్రీడా ప్రతిభ నిజంగా అసాధారణం! పురుషుల హై జంప్ టీ7లో కొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించడం అమందానందకరంగా ఉంది. కుమార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. లాంగ్ జంప్‌లో ఇప్పటికే ఒక స్వర్ణం సాధించిన నేపథ్యంలో రెండో స్వర్ణం ద్వారా యావద్దేశ ప్రజల ప్రశంసలకు అందుకుంటున్నాడు. అతని బహుముఖ ప్రజ్ఞ, అగ్రస్థానంలో నిలవాలనే తపన ఎంతైనా ప్రశంసార్హం. అతనికి నా అభినందనలతోపాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.


(రిలీజ్ ఐడి: 2325751) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada