ఆర్థిక మంత్రిత్వ శాఖ
మిజోరంలో రూ. 8.64 కోట్ల విలువైన 43 లక్షలకు పైగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. ఒకరిని అరెస్టు చేసిన అధికారులు
చంపై-ఐజ్వాల్ రహదారిపై నిఘా ఆధారిత తనిఖీల్లో మళ్లీ వెలుగుచూసిన మయన్మార్ సిగరెట్ల స్మగ్లింగ్ ముఠా గుట్టు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 8:52PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంతంలో సరిహద్దుల గుండా జరుగుతున్న సిగరెట్ల స్మగ్లింగ్‌కు ఈ రోజు పెద్ద దెబ్బ తగిలింది. నేడు మిజోరంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన కచ్చితమైన నిఘా ఆధారిత ఆపరేషన్‌లో రూ. 8.64 కోట్ల విలువైన 43.2 లక్షల విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్లు భావిస్తున్న ఈ సరుకును ఐజ్వాల్ వైపు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఐజ్వాల్ దిశగా భారీ పరిమాణంలో విదేశీ సిగరెట్లను ఒక ట్రక్కులో రవాణా చేస్తున్నారనే కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ ఐజ్వాల్ ప్రాంతీయ యూనిట్ అధికారులు చంపై-ఐజ్వాల్ రహదారిపై నిఘా ఏర్పాటు చేశారు. టుయిరియల్ గ్రామం వద్ద ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ ట్రక్కును సమగ్రంగా తనిఖీ చేయగా ‘పాట్రన్’ బ్రాండ్‌కు చెందిన 43,20,000 విదేశీ సిగరెట్లతో ఉన్న 432 పెట్టెలు బయటపడ్డాయి.
వీటిని పరిశీలించగా.. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ (సీఓటీపీఏ) చట్టం- 2003 ప్రకారం ఉండాల్సిన తప్పనిసరి బొమ్మల రూపంలోని ఆరోగ్య హెచ్చరికలు ఆ సిగరెట్ ప్యాకెట్లపై లేవని తేలింది. కస్టమ్స్ చట్టం- 1962లోని సెక్షన్ 110 కింద ట్రక్కుతో సహా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
మిజోరం-మయన్మార్ సరిహద్దులోని జోఖౌతార్ సెక్టార్ గుండా ఈ సిగరెట్లను మయన్మార్ నుంచి మిజోరంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విదేశీ పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణా కోసం సరిహద్దు మార్గాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
మిజోరం-మయన్మార్ సరిహద్దులోని జోఖౌతార్ సెక్టార్ గుండా ఈ సిగరెట్లను మయన్మార్ నుంచి మిజోరంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విదేశీ పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణా కోసం సరిహద్దు మార్గాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
ఈ భారీ స్వాధీనం ప్రక్రియ సరిహద్దు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి, విదేశీ వస్తువుల అక్రమ రవాణాను అరికట్టడానికి, సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దు మార్గాల్లో తనిఖీలను మరింత బలోపేతం చేయడానికి డీఆర్‌ఐ కొనసాగిస్తున్న నిరంతర ప్రయత్నాలను తెలియజేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2325349)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9